Thug Life Twitter Review - 'థగ్ లైఫ్' ట్విట్టర్ రివ్యూ: తేడాగా రిపోర్ట్స్... ఓవర్సీస్‌లో మిక్స్డ్ టాక్... కమల్, శింబుతో మణిరత్నం రొటీన్ ఫిల్మ్ తీశారా?
Thug Life Twitter Review in Telugu: కమల్ హాసన్, శింబు హీరోలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన 'థగ్ లైఫ్'కు సెన్సార్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మరి ట్విట్టర్ టాక్?

కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వం వహించిన 'నాయకుడు' ఎంతో మందికి ఫేవరెట్ సినిమా. ఆ కాంబోలో మళ్ళీ సినిమా రావడానికి 37 ఏళ్ళు పట్టింది. కమల్, మణి కలిసి చేసిన లేటెస్ట్ సినిమా 'థగ్ లైఫ్'. ఇందులో శింబు మరో హీరో. అభిరామి, త్రిష హీరోయిన్లు. సెన్సార్ నుంచి ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ లభించింది.
'థగ్ లైఫ్' సెన్సార్ టాక్...
సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్!
Thug Life Censor Talk: సెన్సార్ బోర్డు నుంచి 'థగ్ లైఫ్'కు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. హీరోలు కమల్ హాసన్, శింబు తమ నటన అదరగొట్టారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని సెన్సార్ రిపోర్ట్. ఆల్రెడీ చెన్నైలో సినిమా ప్రముఖులకు ఒక షో వేశారట. మూవీ చూసినోళ్లు చాలా బావుందని చెబుతున్నారు. సినిమా సూపర్ హిట్ అన్నారు. ఓవర్సీస్ నుంచి డివైడ్ టాక్ వచ్చింది. మణిరత్నం రొటీన్ రివెంజ్ డ్రామా తీశారని పేర్కొంటున్నారు. ఇంటర్వెల్ ఫైట్ బావున్నా... సెకండాఫ్ ఫ్లాట్‌గా ఉందని చెబుతున్నారు. అమెరికా, యూకే నుంచి మిక్స్డ్ టాక్ లభించింది.
#Thuglife Censor talk - Movie sure shot Blockbuster.. 🔥
— Ramesh Bala (@rameshlaus) June 4, 2025
#ThugLife - SUPER HIT 🔥🔥
— Lets OTT World (@LetsOTTWorld) June 4, 2025
తమిళనాడు ప్రీమియర్ షోస్ నుంచి 'థగ్ లైఫ్'కు సూపర్ హిట్ టాక్ లభించింది. ఇక అమెరికా, యూకే నుంచి ప్రీమియర్ షోస్ టాక్ రావాల్సి ఉంది. ఆ రెండు చోట్ల 'థగ్ లైఫ్' షోస్ ఎప్పుడు పడతాయి? అక్కడ టాక్ ఎప్పుడు వస్తుంది? అనేది కింద ఉన్న లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.
ఇంటర్వెల్ ముందు ఫైట్ అదుర్స్...
రెహమాన్ పాటలకు కత్తెర, ఆ ఒక్కటీ తప్ప!
ఇంటర్వెల్ ముందు వరకూ కమల్ హాసన్ కంటే స్క్రీన్ మీద శింబు డామినేషన్ ఎక్కువ కనిపించిందట. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్సులో శింబు చూపించిన అగ్రేషన్ సినిమాకు హైలైట్ అవుతుందని, అందులో ఆయన నటన నభూతో న భవిష్యత్ అని చెన్నైలో ప్రీమియర్ షో చూసిన జనాలు చెబుతున్నారు. ఎస్.టి.ఆర్ (శింబు) అదరగొట్టారట.
In #ThugLife , There's a PEAK Action Sequence is there Before Interval — Can See An Aggressive #SilambarasanTR in that Portion , First Half is Completely Fast paced, no Dropping Off . 1st Half a Complete DOMINATION of S- T- R 🔥🔥
— Let's X OTT GLOBAL (@LetsXOtt) June 4, 2025
Fastern your Seat Belt !!!! pic.twitter.com/IIeU8SoQlS
'థగ్ లైఫ్'కు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి. సినిమా విడుదలకు ముందు ఆడియో సూపర్ హిట్ అయ్యింది. అయితే పాటలకు కత్తెర పడిందట. శింబుతో కలిసి బాలీవుడ్ బ్యూటీ సాన్యా మల్హోత్రా స్టెప్స్ వేసిన 'జింగిచ్చా' ఒక్కటే పూర్తిగా సినిమాలో వినబడుతుందట. మిగతా అన్ని పాటలూ కత్తెరకు గురి అయ్యాయట.
Let's X OTT Global EXCLUSIVE -
— Let's X OTT GLOBAL (@LetsXOtt) June 4, 2025
Every track in #ThugLife is trimmed except Jingucha, which is played entirely ! pic.twitter.com/ag7ryDDgqE
షాక్ ఇచ్చిన త్రిష... ఆవిడ క్యారెక్టర్ తెలుసా!?
ఇప్పటి వరకు తాను చేయనటువంటి క్యారెక్టర్ 'థగ్ లైఫ్'లో చేశానని విడుదలకు ముందు త్రిష చెప్పారు. ఎటువంటి పాత్రలో ఆవిడ కనిపిస్తుందోనని ఆడియన్స్ అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో త్రిష బార్ డ్యాన్సర్ రోల్ చేశారు. సినిమాలో ఆవిడ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుందట.
In #ThugLife — Instead of a love angle, Trisha takes on a distinctive bar dancer role & Not involved in the love plot 😄 that leaves a big mark on the movie .
— Let's X OTT GLOBAL (@LetsXOtt) June 4, 2025
Sugar Baby... Oh Sugar Baby ... pic.twitter.com/IvufudpQ00
#ThugLife - ⭐⭐⭐⭐ BB 💥
— its cinema (@iitscinema) June 4, 2025
- #KamalHaasan & #Manirathnam Combo..💥
- #SilambarasanTR's Role & after 2 yrs on Big Screen..✌️
- #Trisha's Character & waiting to see if there's any surprise in it..
- KH vs STR Faceoff..💥
- Manirathnam's Characterization & Screenplay..🙏
- ARR's… pic.twitter.com/cBrNTmG14D





















