కమల్ ముందున్న టార్గెట్ ఎంత? 'థగ్ లైఫ్' థియేట్రికల్ బిజినెస్ ఎంత?

'థగ్ లైఫ్' బడ్జెట్ అంతా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్మడం ద్వారా రికవరీ అయ్యిందట.

'థగ్ లైఫ్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌ తీసుకుంది. అందుకు రూ. 150 కోట్లు ఇచ్చిందట. 

విజయ్ టీవీ 'థగ్ లైఫ్' శాటిలైట్ టెలికాస్ట్ రైట్స్ తీసుకుంది. అందుకు రూ. 60 కోట్లు చెల్లించిందట. 

'థగ్ లైఫ్' ప్రొడక్షన్ కాస్ట్ 200 కోట్లు అయితే అది నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చేశాయి. 

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'థగ్ లైఫ్' థియేట్రికల్ బిజినెస్ 11 కోట్లు.

తెలుగులో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి 'థగ్ లైఫ్' రిలీజ్ చేస్తున్నారు. 12 కోట్ల షేర్ వస్తే ఆయన హ్యాపీ.

కన్నడ మినహా మిగతా 'థగ్ లైఫ్' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 105 కోట్లు.

ప్రపంచవ్యాప్తంగా రూ. 106 కోట్ల షేర్, రూ. 210 కోట్ల గ్రాస్ వస్తే... 'థగ్ లైఫ్' హిట్. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ.

కన్నడలో రిలీజ్ ఆపేయడం వల్ల 'థగ్ లైఫ్' నిర్మాతలకు ఆల్మోస్ట్ 15 కోట్లు లాస్ అట.