![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Thiruveer: హీరోగా తిరువీర్ కొత్త సినిమా - పోస్టర్‌లో ‘భగవంతుడు’కి కొమ్ములు ఎందుకు ఉన్నాయో తెలుసా?
Thiruveer Upcoming Movie: హీరోగా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో వస్తున్న తిరువీర్.. తాజాగా ‘భగవంతుడు’ అనే మరో కొత్త కాన్సెప్ట్‌తో రానున్నాడు. శివరాత్రి సందర్భంగా మూవీ పోస్టర్ విడుదలయ్యింది.
![Thiruveer: హీరోగా తిరువీర్ కొత్త సినిమా - పోస్టర్‌లో ‘భగవంతుడు’కి కొమ్ములు ఎందుకు ఉన్నాయో తెలుసా? Thiruveer upcoming movie Bhagavantudu poster released on the occasion of shivaratri Thiruveer: హీరోగా తిరువీర్ కొత్త సినిమా - పోస్టర్‌లో ‘భగవంతుడు’కి కొమ్ములు ఎందుకు ఉన్నాయో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/187dc57a4bc5665d192ce1df2630c42c1709892873850802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Thiruveer Upcoming Movie Bhagavantudu: కొత్త కాన్సెప్ట్‌తో సినిమాలు వస్తే చాలు.. అందులో నటించిన హీరో ఎవరు అని కూడా పట్టించుకోకుండా హిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఈరోజుల్లో కొత్త కాన్సెప్ట్ కథలకు, సినిమాలకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఎంతోమంది బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోలు కూడా ఇలాంటి సినిమాల ద్వారానే ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. అందులో తిరువీర్ కూడా ఒకరు. ఇప్పటికే ఒకట్రెండు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న తిరువీర్.. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక తన అప్‌కమింగ్ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను ‘జబర్దస్త్’ ఫేమ్ అదిరే అభి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దాంతో పాటు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను యాడ్ చేశాడు.
మూడు సినిమాలతో సిద్ధం..
ఇప్పటికే ‘మసూద’, ‘పరేషాన్’ లాంటి చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు తిరువీర్. ఈ రెండు సినిమాలు వేర్వేరు జోనర్లకు చెందినవే. ముఖ్యంగా ‘మసూద’ అయితే చాలాకాలం తర్వాత హారర్ మూవీ లవర్స్‌కు ట్రీట్ ఇచ్చింది. ఆ సినిమా తనను హీరోగా నిలబెట్టింది. దీంతో ‘మసూద’ తర్వాత తనకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు తిరువీర్ చేతిలో ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఈ ఏడాదిలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ముందుగా శివరాత్రి సందర్భంగా ‘భగవంతుడు’ అనే మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌ను ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు అదిరే అభి.
గెస్ చేస్తూ ఉండండి..
‘భగవంతుడు’ టైటిల్‌లో భగవంతుడికి కొమ్ములు ఉన్నాయి. పైగా ఇందులో కాళ్లకు గజ్జెలు కట్టుకొని ఒక వ్యక్తి నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ పోస్టర్‌ను షేర్ చేసిన అభి.. ‘ఈ పోస్టర్‌లో భగవంతుడుకి ఎందుకు కొమ్ములు పెట్టారో గెస్ చెయ్యగలరా?’ అంటూ ప్రశ్న విసిరాడు. దీంతో నిజమే కదా.. అసలు పోస్టర్‌లో భగవంతుడు అనే పదానికి కొమ్ములు ఎందుకు ఉన్నాయి అని చర్చించడం మొదలుపెట్టారు నెటిజన్లు. ఇక దీంతో పాటు ఈ సినిమాలో తాను ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నానని కూడా బయటపెట్టాడు. అసలు పోస్టర్‌లో కొమ్ములు ఎందుకు ఉన్నాయో గెస్ చేస్తూ ఉండండి అంటూ నెటిజన్లను సందేహంలో పడేశాడు.
View this post on Instagram
యాక్టివ్ అయిన ఫరియా..
గోపీ విహారీ.. ‘భగవంతుడు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇందులో తిరువీర్‌కు జోడీగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. చాలాకాలం తర్వాత సినిమాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యింది ఫరియా. తన మొదటి సినిమా ‘జాతిరత్నాలు’ హిట్ అయినా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకుండా గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్‌తోనే సరిపెట్టుకుంది. ఇప్పుడు మళ్లీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీ అయ్యింది. ఇక తిరువీర్‌తో కలిసి తను లీడ్ రోల్ ‘భగవంతుడు’ సినిమాను పనస శంకరయ్య గౌడ్, నారాయణ్ దాస్ కలిసి సమర్పిస్తున్నారు. రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై రవికుమార్ పనస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ప్రేక్షకులకు విషెస్ చెప్తూ ‘భగవంతుడు’ పోస్టర్ విడుదలయ్యింది.
Also Read: ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్‌ను పెళ్లాడిన రాఖీ సావంత్ మాజీ భర్త
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)