Theft in Director House: ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో చోరీ - జాతీయ అవార్డులు ఎత్తుకెళ్లిన దొంగలు
Robbery in Director Manikandan: జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణికందన్ ఇంట్లో చోరీ జరిగింది. శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు.
Robbery in Director Manikandan: జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణికందన్ ఇంట్లో చోరీ జరిగింది. శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మదురైలోని ఉసిలంపట్టిలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో చూసి ఇంటి తాళాన్ని పగులగొట్టిన దుండగులు, సుమారు రూ.లక్ష నగదు, ఐదు సవర్ల విలువైన బంగారు నగలను చోరీ చేసినట్లు సమచారం. అంతే కాకుండా డైరెక్టర్ సాధించిన నేషనల్ అవార్డులకు సైతం ఎత్తుకేళ్లారు. అందులో రజత పతకాలతో మరిన్ని అవార్డులు ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: లగ్జరీ కారు కొన్న 'యమదొంగ' హీరోయిన్ - కారు ధర, ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్శకుడి ఇంటికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు దర్శకుడు మణికందన్ చెన్నైలో షూటింగ్ బిజీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయతే, కేసు విషయంలో పోలీసులు చాలా సీరియస్‌గా విచారణ జరుపుతున్నారు. ఈ చోరీలో అవార్డులు ఎత్తుకెళ్లడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఆయన ఇంట్లో చోరి చేసి అవార్డులు ఎత్తుకెళ్లారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. నగదు మొత్తం దొంగలించకుండ అక్కడ ఉన్న అవార్డులను చోరీ చేయడం మాత్రం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.
Also Read: ఈ పల్లెటూరు అమ్మాయి ఎవరంటూ అవమానించారు - బాడీషేమింగ్‌పై మృణాల్ కామెంట్స్
కాగా ఫొటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన మణికందన్ ఆ తర్వాత అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అదే టైం లో మణికందన్ విండ్ అనే షార్ట్ ఫిల్మ్ తో డైరెక్టర్ వెట్రిమారన్ నిర్మాతగా ఆయనకు తొలి అవకాశం ఇచ్చారు. ఆయన సపోర్టు మణికందన్ కాకా ముట్టై సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా మంచి సక్సెస్ అవ్వడమే కాదు 62వ నేషనల్ అవార్డుల్లో రెండు పురస్కారాలను దక్కించుకుంది.అంతేకాదు 13వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్‌లో కూడా బెస్ట్ ఫీచర్ ఆడియన్స్ సినిమాగా అవార్డును సైతం కైవసం చేసుకుంది.అయితే, మణికందన్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ వెబ్ సీరీస్ చేస్తున్నారు.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా రిలీజ్ కాబోయే ఈ వెబ్ సీరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన మణికందన్ ఫొటోగ్రఫీపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారట. రాజీవ్ మేనన్ నిర్వహించే ఫిలిం స్కూల్ అయిన మైండ్‌స్క్రీన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో డిజిటల్ ఫోటోగ్రఫీలో కోర్సులో జాయిన్ అయ్యిందేకు సొంతంగా ఆయన డబ్బు సంపాదించుకున్నారట. ఇందుకోసం ఆయన స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ ఐడీ కార్డ్స్ తయారి, పెళ్లి ఫొటోగ్రాఫర్‌గా పనిచేసి డబ్బు సంపాదించుకుని రాజీవ్ మేనన్ ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యారట.