అన్వేషించండి

The Raja Saab Poster: ప్రభాస్ బర్త్ డే స్పెషల్... సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్, మహారాజుగా సర్‌ప్రైజ్ చేసిన రాజా సాబ్

ది రాజా సాబ్ మూవీ నుంచి ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఆ పోస్టర్ లో ఉన్న విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు దేశవ్యాప్తంగా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మూవీ లవర్స్ తో పాటు ఆయన అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'ది రాజా సాబ్' సినిమా నుంచి తాజాగా ప్రభాస్ పుట్టినరోజు కానుకను రిలీజ్ చేశారు మెకర్స్. మరి ఆ బర్త్ డే కానుక విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి. 

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న హర్రర్ ఎంటర్టైనర్ 'ది రాజా సాబ్'. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్ గా ఓ సర్ప్రైజ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'సింహాసనం తనకు చెందిన వ్యక్తి కోసం వెయిట్ చేస్తోంది...' అంటూ ఇప్పటికే మేకర్స్ తలకిందులుగా ఉన్న ఒక సింహాసనం ఫోటోను రిలీజ్ చేసి క్యూరియాసిటీని పెంచేశారు. తాజాగా బర్త్ డే ట్రీట్ గా ఆ సింహనం సీక్రెట్ ను బయట పెడుతూ 'ది రాజా సాబ్' నుంచి మరో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో ప్రభాస్ రాజసం ఉట్టిపడే రాయల్ లుక్ లో, కొంచం భయంకరంగా, మరింత కొత్తగా కనిపించారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ సింహాసనం మీద కూర్చుని చేతిలో సిగార్ తో రాజు లుక్ లో కొత్తగా కనిపించి మంచి హైప్ క్రియేట్ చేశారు. అలాగే హర్రర్ నేపథ్యమున్న సినిమా అని ఈ మోషన్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. నిర్మాత ఎస్కేఎన్ తన ట్విటర్ లో 'రాజసం ఆయన బ్లడ్ లోనే ఉంది...వివాదాస్పదరహితుడైన పాలనా దక్షుడు 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు... దీనికే ఇలా అయిపోతే ఎలా ముందుంది అసలైన పండుగ' అంటూ ఆ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

ఇక డైరెక్టర్ మారుతి ఈ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ప్రభాస్ కు స్పెషల్ గా విషెస్ తెలియజేశారు. 'దీనికోసం రోజులు లెక్కపెడుతున్నాను... నా రాజా సాబ్ ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు. నేను ఇప్పుడు పెద్దగా ఏమీ చెప్పలేను. కానీ ఏప్రిల్ 10న మనం ఈ క్షణాన్ని బిగ్గెస్ట్ సెలబ్రేషన్ తో పట్టం కట్టే రోజు అవుతుంది' అంటూ తనదైన స్టైల్ లో ప్రభాస్ ని విష్ చేశారు. ఇక ఆ మోషన్ పోస్టర్ వీడియోలో ప్రభాస్ చీకట్లో ఓ అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా, సడన్ గా చెయ్యి నీ చూపించి భయపెట్టారు మేకర్స్.

ఈ వీడియో ద్వారా ఇటీవల హామీ ఇచ్చినట్టుగానే అందరిని 'ది రాజా సాబ్' ప్రపంచంలోకి తీసుకెళ్లారు మేకర్స్. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ను చూసి క్రేజీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ ఒక్క పోస్టర్ తో 'ది రాజా సాబ్' సినిమాపై ఓ రేంజ్ లో బజ్ పెరిగింది. ఇది ప్రభాస్ అభిమానులకు పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్. 

Also Readఅల్లు అర్జున్ రూటులో బాలీవుడ్ స్టార్... 10 కోట్లు ఇస్తామన్నా అటువంటి యాడ్ చేయడానికి 'నో' చెప్పేశాడు, అతను ఎవరో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Fatal Accident In Jaipur: జైపూర్‌లో ఆయిల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ట్ర‌క్కు..పెట్రోల్ బంకులో పేలుడు.. 8 మంది స‌జీవ ద‌హ‌నం
జైపూర్‌లో ఆయిల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ట్ర‌క్కు..పెట్రోల్ బంకులో పేలుడు.. 8 మంది స‌జీవ ద‌హ‌నం
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Embed widget