The Raja Saab Advance Booking: రాజా సాబ్ అడ్వాన్స్ బుకింగ్... ప్రభాస్ సినిమా విడుదలకు ముందే భారీ వసూళ్లు, ప్రస్తుతం ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
The Raja Saab Box Office Advance Booking: ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' అడ్వాన్స్ బుకింగ్ లో భారీ వసూళ్లు సాధించింది. మొదటి రోజున బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు సిద్ధమైంది.

The Raja Saab Day 1 Prediction Collection: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హారర్ కామెడీ 'ది రాజా సాబ్' కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఆల్రెడీ 'ది రాజా సాబ్' అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది, ఇందులో సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం 5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.
సక్నిల్క్ నివేదిక ప్రకారం, 'ది రాజా సాబ్' అడ్వాన్స్ బుకింగ్‌లో ఇప్పటి వరకు 1 లక్ష 96 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడు అయ్యాయి. ఇప్పటి వరకు 5.35 కోట్ల రూపాయలు వసూలు చేసిందీ సినిమా. బ్లాక్ చేసిన సీట్లతో కలిపి ఈ సంఖ్య 10.11 కోట్ల రూపాయలకు చేరుకుంది. 'ది రాజా సాబ్' అడ్వాన్స్ బుకింగ్‌లో ఏ విధంగా దూసుకుపోతుందో చూస్తుంటే... మొదటి రోజునే ఈ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనా వేయవచ్చు.
Also Read: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
'ది రాజా సాబ్' మొదటి రోజు వసూళ్లు
ప్రభాస్ నటించిన హారర్ కామెడీ చిత్రం 'ది రాజా సాబ్' నేషనల్ బాక్సాఫీస్ వద్ద మొత్తం 65 నుండి 70 కోట్ల రూపాయల వరకు వసూలు చేయవచ్చని అంచనా. చిత్ర నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ అయితే వంద కోట్లు వస్తాయని నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. కాబట్టి ఐదు భాషల్లోనూ భారీగా వసూళ్లు రాబట్టనుంది.
'ది రాజా సాబ్' మొదటి రోజున తెలుగులో 45 నుండి 50 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు. హిందీలో ఈ చిత్రం 10 నుండి 12 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు. తమిళం, కన్నడ, మలయాళంలో కూడా ఈ చిత్రం 5 నుండి 6 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు.
మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజా సాబ్'లో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దీని తర్వాత ప్రభాస్ పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' చిత్రంలో తృప్తి డిమ్రితో కలిసి నటిస్తున్నారు. దీనితో పాటు 'కల్కి 2898 AD 2'లో కూడా కనిపించనున్నారు.
Also Read: Sreeleela: ఇది బీకాంలో ఫిజిక్స్ లెక్క... ఆర్ట్స్ కాలేజీలో డాక్టర్లు ఎందుకుంటారమ్మా?





















