Prashanth Neel Journey: ప్రశాంత్ నీల్ - ఇప్పుడు ఈ పేరే ఓ బ్రాండ్!

Prashanth Neel ఇప్పుడు ఈ పేరు తెలియని మూవీ లవర్ ఉండరు. KGF Chapter 2తో దేశవ్యాప్తంగా మరోసారి తన స్టామినాను పరిచయం చేశారు ఆయన. కేజీఎఫ్ పేరే బ్రాండ్ అనేంతలా పేరు తెచ్చుకున్న నీల్ జర్నీ ఎలా మొదలైంది.

FOLLOW US: 

ప్రశాంత్ నీల్....కేజీఎఫ్ 2 సినిమాతో ఈ పేరు ఇండియా అంతా మారు మోగిపోతుంది. కానీ ఒకప్పుడు తన కోసం హీరోలను ఒప్పించటానికి ప్రశాంత్ నీల్ తిరగని ఆఫీస్ లేదు...బతిమాలని ప్రొడ్యూసర్ లేడు. సంపాదించటానికే సినిమాల్లోకి వచ్చానని ధైర్యం గా చెప్పుకునే ప్రశాంత్ నీల్....సినిమా టేకింగ్ లో తన దైన ముద్రను చూపిస్తూనే వచ్చాడు. కేవలం మూడు సినిమాలకే జాతీయ స్థాయిలో అతని పేరు మోగిపోతోందంటే అర్థం చేసుకోవచ్చు ఆ టేకింగ్ కి ఎంత మంది ఫిదా అయిపోయారో అని.

మీకు తెలుసా....ప్రశాంత్ నీల్ 2010లో  శ్రీమురళీని హీరోగా పెట్టి ‘ఆ హుడుగి నేనే’ అనే సినిమా తీద్దామనుకున్నారు. కానీ ప్రొడ్యూసర్లు ఎవరూ ముందుకు రాలేదు. సినిమా కోసం స్క్రీన్ ప్లే అంతా రాసుకున్నాక తను అసలు సినిమా తీయగలనో లేదో అని ప్రశాంత్ నీల్ కు కూడా సందేహం వచ్చింది. ఎందుకంటే ఫిల్మ్ కోర్సు చేసిన అనుభవం తప్ప ఎవరి దగ్గరా కనీసం అసిస్టెండ్ డైరెక్టర్ గా కూడా చేయలేదు ప్రశాంత్ నీల్. అప్పుడే నిర్ణయించుకున్నాడు ఇకపై స్క్రీన్ ప్లే రాశాడంటే..చూసేవాడికి, ఆఖరకు నటించేవాళ్లకు కూడా నెక్ట్స్ సీన్ లో ఏమొస్తుందో ఊహించకూడదని. ఆ డెసిషనే ఈ రోజు ప్రశాంత్ నీల్ యూనిక్ స్క్రీన్ ప్లేకు కారణమైంది.

శ్రీమురళీని చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ అతని బాడీ లాంగ్వేజ్ కు తగినట్లుగా సినిమా రాసుకున్నాడు. అదే ఉగ్రమ్. 2014లో ప్రశాంత్ నీల్ తీసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కన్నడ మూవీ లవర్స్ ను ఓ ఊపు ఊపేసింది. ఆ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించి ప్రశాంత్ నీల్ గ్రాండ్ ఎంట్రీని శాండల్ వుడ్ కు పరిచయం చేసింది. అప్పుడే ఉగ్రమ్ కు సీక్వెల్ గా ఉగ్రమ్ వీరమ్ తీయాలని డిసైడయ్యాడు ప్రశాంత్ నీల్. అప్పుడే కోలార్ ఫీల్డ్స్ కు సంబంధించి ఓ అనాథ పిల్లాడు డాన్ గా ఎదిగితే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ కథ రాయటం మొదలు పెట్టాడు. అదే ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ మైలురాయిలా నిలుస్తుందని ప్రశాంత్ నీల్ కూడా ఊహించి ఉండడు.

కథ ప్రకారం సినిమా ముంబైలో నడుస్తుంది. సో ప్యాన్ ఇండియా సినిమాకు కావాల్సిన ప్లాట్ ఏర్పాటైపోయింది. పైగా మదర్ సెంటిమెంట్...యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది ఆ లైన్ కి ఏ భాషలో తీసినా...ఇక అంతే కేవలం కన్నడ సినిమాగానే భావించి తీసిన కేజీఎఫ్ చివరకు నిర్మాతలు బలవంతం చేయటంతో ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజైంది. డార్క్ థీమ్ లో యష్ ను చూపించిన విధానం.. రాగా రస్టిక్ గా ఉండే ఆ టేకింగ్...యష్ అప్పీరియెన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మోగిపోయింది. ఇప్పుడు కేజీఎఫ్ 2 కు ఈ స్థాయిలో కలెక్షన్లు రావాటనికి కూడా కేజీఎఫ్ క్రియేట్ చేసిన మేనియానే కారణం.

ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అవ్వాలని అయినవాడు. ఏదో పని చేసి బతికేద్దామని సినిమాల్లోకి రాలేదు. సినిమా ఆడాలి. డబ్బు సంపాదించాలి అని ముందు నుంచి ఆలోచనతోనే ఉన్నాడు. అందుకే తన సినిమాల్లో తనకు కూడా వాటాలుంటాయి. ఇక ఆ టేకింగ్ గురించి చెప్పుకోవాలి. బిల్డప్ అండ్ పేఆఫ్ మోడ్ లో చాలా మంది డైరెక్టర్లు మనకు కనిపిస్తారు. హాలీవుడ్ లో క్వింటన్ టరంటినో నుంచి మొదలుపెట్టి టాలీవుడ్ లో బోయపాటి శ్రీను వరకూ హీరోని, హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ముందు సీన్లు రాసుకుని ఆ తర్వాత హీరోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. కానీ ప్రశాంత్ నీల్ టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే పూర్తి భిన్నం. ఉగ్రం నుంచి కేజీఎఫ్ 2 వరకూ మూడు సినిమాల్లోనూ హీరోకు ఓటమి అనేది తెలియదు. ఒకవేళ ఓడిపోయినట్లు కనిపించినా కథలో దానికో కారణం ఉందన్నట్లు సీన్స్ ను బిల్డ్ చేయటంలో ప్రశాంత్ నీల్ మాస్టర్ అని చెప్పాలి.  హీరో ను ఓ అండర్ డాగ్ స్టేజ్ నుంచి ఎలివేట్ చేసుకుంటూ...హీరోకున్న లక్ష్యం ముందు ప్రపంచంలో ఏ శక్తి నిలవేదన్నట్లు స్ట్రాంగ్ క్యారెక్టర్ లా రాసుకుంటాడు.

ఫైనల్ గా The Allegory
ప్రతీ రోజూ అన్యాయాల్ని, అలసత్వాన్ని చూసే సామాన్య జనం ఫాంటసీల్లో ఎప్పుడూ ఒక్క దెబ్బతో అంతటినీ మార్చేసే హీరోనే ఉంటాడు. అలాంటి కధల్ని మనం ఎప్పుడూ రాసుకుంటూనే ఉంటాం. నిజ జీవితపు లోటుని పూడ్చుకుంటూనే ఉంటాం. సినిమాల్లో ఎన్ని కొత్త మార్పులు వచ్చినా ఇది మారదు. అదే కమర్షియల్ సినిమా పవర్. ఆ విషయం ఆ పిచ్చోడికి తెలుసు. ఆ పిచ్చోడే ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ పిచ్చోడేం కాదు. అందుకే ఈ రోజు దేశం మాట్లాడుకుంటోంది.

Published at : 22 Apr 2022 02:54 PM (IST) Tags: prashanth neel kgf kgf chapter 2 KGF Director Prashanth Neel Prashanth Neel Journey

సంబంధిత కథనాలు

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!