అన్వేషించండి

Thalapathy 69: దళపతి విజయ్ ఆఖరి సినిమా... వైభవంగా పూజతో షురూ, రెగ్యులర్ షూట్ ఎప్పుడంటే?

KVN Productions Kicks Off Thalapathy 69 with Grand Muhurat Puja: దళపతి విజయ్ హీరోగా కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకం మీద వెంకట్ కె నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా పూజతో ప్రారంభమైంది.

దళపతి విజయ్ (Thalapathy Vijay) కొత్త సినిమా ఓపెనింగ్ శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో జరిగింది. ఇంతకు ముందు ఆయన సినిమా లాంచ్ జరగడం వేరు, ఇప్పుడు జరగడం వేరు. ఆయన ఆఖరి సినిమా కావడంతో దళపతి 69 ప్రారంభోత్సవానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే...

భారీగా తెరకెక్కిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
విజయ్ ఆఖరి చిత్రాన్ని నిర్మించే అవకాశం కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దేవి నవ రాత్రుల్లో రెండో రోజున ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా తన నటనతో, తనదైన హీరోయిజంతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు విజయ్. తమిళనాడులో ఆయనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ ప్రేక్షకులలో సైతం విజయ్ ఫ్యాన్స్ సంఖ్య తక్కువ ఏమీ కాదు. విజయ్ లెగసీని దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున చిత్రాన్ని నిర్మించడానికి కేవీఎల్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణ రెడీ అయ్యారు.

విజయ్ సరసన బుట్ట బొమ్మ పూజ హెగ్డే!
విజయ్ 69వ చిత్రం ఇది. అందుకని, దళపతి 69 (Thalapathy 69)ని వర్కింగ్ టైటిల్ కింద ఫిక్స్ చేశారు మీ సినిమాలో విజయ్ జంటగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) నటించనున్నారు. 'బీస్ట్' తర్వాత వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా ఇది. తమిళంలో బుట్ట బొమ్మ ఖాతాలో మరో భారీ సినిమా అని చెప్పవచ్చు. సినిమా పూజా కార్యక్రమాల్లో ఈ విజయ్, పూజా హెగ్డే స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Readఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?

కీలక పాత్రలో 'ప్రేమలు' ఫ్రేమ్ మమత... బాబీ కూడా!
దళపతి 69 చిత్రానికి హెచ్ వినోద్ దర్శకుడు. శనివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇందులో 'ప్రేమలు' సినిమాతో కేరళలో పాటు తెలుగులోనూ భారీ విజయం అందుకున్న హీరోయిన్ మమతా బైజు కీలక పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు, 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రియమణి, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read'శ్వాగ్' రివ్యూ: 'రాజ రాజ చోర' మేజిక్ రిపీట్ అయ్యిందా... శ్రీ విష్ణుకు హ్యాట్రిక్ వచ్చిందా?


దళపతి 69 విడుదల ఎప్పుడంటే?
Thalapathy 69 Release Date: తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వచ్చే ఏడాది అక్టోబర్‌ నెలలో విడుదల కానుంది. 'దళపతి 69' చిత్రానికి సంగీత దర్శకుడు: అనిరుద్‌, సినిమాటోగ్రాఫర్: సత్యన్‌ సూర్యన్‌, ఎడిటర్: ప్రదీప్‌ ఇ రాఘవ్‌, యాక్షన్‌ కొరియోగ్రఫీ: అనల్‌ అరసు, ఆర్ట్ డైరక్టర్‌: సెల్వ కుమార్‌, కాస్ట్యూమ్స్: పల్లవి సింగ్‌.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget