By: ABP Desam | Updated at : 07 Apr 2022 12:06 PM (IST)
విజయ్, రష్మిక
తమిళ స్టార్ హీరో విజయ్‌కు తెలుగులో కూడా ఫాలోయింగ్ ఉంది. అతడి స్టయిల్, మేనరిజమ్స్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే, రష్మికా మందన్నాకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆమె స్టయిల్, ఎక్స్‌ప్రెషన్స్‌కు నేషనల్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఓ సినిమాలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రారంభోత్సవంలో విజయ్‌కు రష్మిక దిష్టి తీస్తున్న ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. వీడియోలో వాళ్ళిద్దర్నీ చూశారా? ఈ రోజు విడుదల చేశారు. చూసేయండి.
#Thalapathy66..Cherishing the new beginnings with THALAPATHY @actorvijay Sir,@iamRashmika & the whole team :)@SVC_official @MusicThaman @karthikpalanidp @Cinemainmygenes @scolourpencils @vaishna94154242 @HariRgv @ahishor @Lyricist_Vivek @Yugandhart_https://t.co/uPehOl1Y40
— Vamshi Paidipally (@directorvamshi) April 7, 2022
విజయ్ కథానాయకుడిగా రూపొందుతున్న 66వ చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బుధవారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. అనంతరం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.
జాతీయ పురస్కారం అందుకున్న 'మహర్షి' తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అన్ని వర్గాలు, భాషల ప్రేక్షకుల్ని అలరించేలా కథను ఆయన రెడీ చేశారని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' లేటెస్ట్ అప్‌డేట్
వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ - స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడు. ఎడిటర్: కెఎల్ ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి & హన్షిత, ప్రొడక్షన్ డిజైనర్స్: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి.
Also Read: ఎన్టీఆర్‌ను డామినేట్ చేశాడా? రామ్ చరణ్ ఆన్సర్ ఏంటి?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Rashmika Mandanna (@rashmika_mandanna)
Godse Movie Release Date: సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ మారింది!
Major Movie: 'మేజర్' నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ - విన్నారా?
Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు
Anil Ravipudi: ఎన్టీఆర్ తో సినిమా - అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
Prey Teaser: ‘ప్రే’ టీజర్ చూశారా? మరింత భయానకంగా ప్రిడేటర్ ప్రీక్వెల్
TRS Rajyasabha Candidates: రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన టీఆర్ఎస్, ఆ ముగ్గురు వీరే
Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !
KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్ వెళ్తారా? ఓడి టెన్షన్ పడతారా!
Divorce Case: భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు