అన్వేషించండి

Anjali: ‘గేమ్ చేంజర్’తో నాకు నేషనల్ అవార్డ్ వస్తుందని భావిస్తున్నా.. వారి నోట అదే మాట: అంజలి

Anjali Game Changer Interview: ‘గేమ్ చేంజర్’లో పార్వతి పాత్రలో నటించాను. నా కెరీర్ బెస్ట్ సినిమా మరియు బెస్ట్ పాత్ర. ఈ సినిమాలోని నా పాత్రకు నేషనల్ అవార్డ్ వస్తుందని అంతా అంటుంటే నాకు అదే అనిపిస్తుంది

Anjali About Game Changer: ‘గేమ్ చేంజర్‌’లో నా పాత్ర పేరు పార్వతి. మా అమ్మ పేరు కూడా పార్వతి. శంకర్ సార్ కథ చెప్పినప్పుడు.. క్యారెక్టర్ పేరు చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకు వచ్చారని తెలుగు నటి అంజలి. ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గేమ్ చేంజర్’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ కియార అద్వాణీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించిన ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 10న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మేకర్స్ ఈ చిత్ర ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలుగు నటి అంజలి మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ..

మా అమ్మే గుర్తుకు వచ్చింది

‘‘ఈ సంక్రాంతికి నేను నటించిన రెండు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఏ యాక్టర్‌కి అయినా సరే సంక్రాంతికి సినిమా వస్తుందంటే ఆనందంగా ఉంటుంది. తెలుగులో ‘గేమ్ చేంజర్’, తమిళంలో విశాల్‌తో నటించిన చిత్రం రాబోతోంది. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చి మంచి విజయం సాధిస్తాయని ఆశిస్తున్నాను. ‘గేమ్ చేంజర్’ విషయానికి వస్తే.. ఈ సినిమాలో నా పాత్ర పేరు పార్వతి. మా అమ్మ పేరు కూడా పార్వతి. శంకర్ సార్ ఈ కథ చెబుతూ.. నా క్యారెక్టర్ పేరు చెప్పగానే మా అమ్మే గుర్తుకు వచ్చింది. ఆ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెబుదామని ఎప్పటి నుండో వెయిట్ చేస్తూ వచ్చాను. ఈ క్యారెక్టర్ నా నుంచి చాలా డిమాండ్ చేసింది. నేను కూడా అదే స్థాయిలో నటించానని అనుకుంటున్నాను. నా నటన చూసి చాలా చోట్ల శంకర్ సార్ మెచ్చుకున్నారు. ఇది నా కెరీర్‌లో ది బెస్ట్ చిత్రం, అలాగే ది బెస్ట్ పాత్ర అవుతుంది. నాకు అనే కాదు.. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది.

Also Read: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు

ఈ సినిమాలోని పార్వతి పాత్ర కోసం నేనేమీ ప్రత్యేకంగా ప్రిపేర్ కాలేదు. నా పాత్రలో సస్పెన్స్, ట్విస్ట్ ఉంటుందని శంకర్ సార్ ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఇంకా నేను ఆ కారెక్టర్‌ గురించి ఎక్కువగా చెప్పకూడదు. అది థియేటర్‌లో ఆడియెన్స్ చూసినప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సెట్స్ నుంచి వచ్చినా కూడా ఆ పాత్ర చాలా రోజులు నన్ను వెంటాడుతూనే వచ్చింది. నా కెరీర్‌లో ఇదే బెస్ట్ బెస్ట్ పాత్ర అని మాత్రం చెప్పగలను. ఈ పాత్రకు అంతా నేషనల్ అవార్డ్ వస్తుందని అంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. నిజంగా అదే నిజమైతే మాత్రం అంతకంటే గొప్ప విషయం, సక్సెస్ ఇంకేం ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల అది నిజం కావాలని కోరుకుంటున్నాను.

ఈ పాత్ర చేసే సమయంలో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెప్పాలంటే.. బయటే జరిగే సంఘటనలు, ఎదురైన అనుభవాల నుంచే ఏ పాత్ర అయినా పుట్టుకొస్తుంది. కానీ ఈ సినిమాలోని నా పాత్ర, బ్యాక్ డ్రాప్ చాలా కొత్తగా ఉంటుంది. నాకు ఇలాంటి ఘటనలు, మనుషులు ఎప్పుడూ ఎదురు కాలేదు. చాలా కొత్తగా అనిపించింది. అందుకే ఈ పాత్రను పోషించేందుకు, నటనతో ఆడియెన్స్‌ను నమ్మించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు శంకర్ సార్ నా పాత్ర గురించి చాలానే చెప్పారు. నా పాత్రలో చాలా సోల్ ఉంటుందని ఆయనే చెప్పారు. నా పాత్రని ఎక్కువగా రివీల్ చేయకూడదనే ట్రైలర్, టీజర్‌లో తక్కువ షాట్స్ పెట్టారు. తెరపై చూసినప్పుడు ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. అప్పన్న, పార్వతీల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.

రామ్ చరణ్ తన కో స్టార్స్‌కు కంఫర్ట్ ఇస్తారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ చాలా కామ్‌గా ఉంటారు. సెట్స్‌లో అందరితోనూ చాలా బాగా ఉంటారు. అంత పెద్ద స్టార్ అయినా అందరిని చక్కగా పలకరించి, అందరితో చక్కగా మాట్లాడతారు. దిల్ రాజు గారి బ్యానర్, శంకర్ సార్ సినిమా, రామ్ చరణ్‌తో మొదటి సినిమా కావడంతో నాకు ఇలా అన్ని రకాలుగా ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. శంకర్, మణిరత్నం వంటి స్టార్ దర్శకుల చిత్రాల్లో నటించాలని అందరికీ ఉంటుంది. నాకు శంకర్ సార్ చిత్రంలో ఛాన్స్ రావడం ఆనందంగా అనిపించింది. ఈ సినిమాతో నా ఆలోచనాధోరణి కూడా మారింది. ఈ ప్రయాణంలో ఎంతో మార్చుకున్నాను. ఇక నెక్ట్స్ ఎంచుకునే పాత్రలు, సినిమాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఈ సినిమా నిజంగా నాకు గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మెగాస్టార్ గారు ఈ సినిమా చూసి నా పాత్రను మెచ్చుకున్నారని తెలిసింది. అదే నాకు పెద్ద అవార్డులా అనిపిస్తోంది.

Also Read: అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అరుగు మీద అంటూ ఓ పాటను రిలీజ్ చేశాం. ఇప్పటికే ఈ పాట రీల్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాట నాకు మాత్రమే కాదు, టీమ్ అందరికీ కూడా అది ఫేవరేట్ సాంగ్. అది ఎప్పటికీ నిలిచిపోయే పాట. తమన్ సంగీతంలో నేను చేసిన ‘బలుపు, వకీల్ సాబ్’ చిత్రాలలోని పాటలు ఎవర్ లాస్టింగ్‌గానే ఉంటాయి. ఇప్పుడీ పాట కూడా ఎవర్ లాస్టింగ్‌గా నిలుస్తుంది. దిల్ రాజు గారి నిర్మాణంలో నాకు ఎప్పుడూ గొప్ప చిత్రాలే వచ్చాయి. ‘సీతమ్మ వాకిట్లో, వకీల్ సాబ్’ ఇలా అన్నీ మంచి చిత్రాలే వచ్చాయి. ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ రాబోతోంది. ఇది కూడా చాలా మంచి సినిమా అవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నాకు హోం బ్యానర్ లాంటిది. ‘గేమ్ చేంజర్’ సినిమాను థియేటర్లలో చూస్తే వచ్చే ఎక్స్‌పీరియెన్స్ వేరేలా ఉంటుంది. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి, సక్సెస్ చేయాలని కోరుతున్నాను..’’ అని అంజలి చెప్పుకొచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
Swarna Kuppam Vision 2029 : సొంత నియోజకవర్గంలో పర్యటన - స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
సొంత నియోజకవర్గంలో పర్యటన - స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Cherlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని
KTR News: ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
Swarna Kuppam Vision 2029 : సొంత నియోజకవర్గంలో పర్యటన - స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
సొంత నియోజకవర్గంలో పర్యటన - స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Cherlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని
KTR News: ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
First HMPV Case In India: భారత్‌లో ఒకేరోజు రెండు HMPV Virus కేసులు! బెంగళూరులో చిన్నారులకు పాజిటివ్
భారత్‌లో ఒకేరోజు రెండు HMPV Virus కేసులు! బెంగళూరులో చిన్నారులకు పాజిటివ్
Tragedy After Game Changer Event: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌ చూసి వెళుతూ ఇద్దరు మృతి.. తీవ్ర ఆవేదనకు గురైన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ తరపున ఆర్థిక సాయం
‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌ చూసి వెళుతూ ఇద్దరు మృతి.. తీవ్ర ఆవేదనకు గురైన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ తరపున ఆర్థిక సాయం
Mukesh Chandrakar: గుండెను చీల్చి బయటకు తీశారు - కాలేయం 4 ముక్కలైపోయింది, జర్నలిస్ట్ ముఖేశ్ హత్య కేసులో సంచలన విషయాలు
గుండెను చీల్చి బయటకు తీశారు - కాలేయం 4 ముక్కలైపోయింది, జర్నలిస్ట్ ముఖేశ్ హత్య కేసులో సంచలన విషయాలు
Dil Raju: 'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌కు వచ్చిన ఇద్దరు మృతి... అభిమానుల‌కు రూ. 10 లక్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన దిల్‌ రాజు
'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌కు వచ్చిన ఇద్దరు మృతి... అభిమానుల‌కు రూ. 10 లక్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన దిల్‌ రాజు
Embed widget