అన్వేషించండి

Peddi Tickets Rate: తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్

Mythri Distributors Vs Single Screen Theatres Exhibitors: మైత్రి డిస్ట్రిబ్యూషన్ వర్సెస్ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ మధ్య నెలకొన్న సమస్యలు 'పెద్ది' సినిమా వసూళ్లకు పెద్ద దెబ్బ కొట్టేలా ఉన్నాయి.

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు అందరూ కలిసి మంగళవారం రాత్రి భాగ్య నగరంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తమకు పర్సంటేజ్ ఇవ్వవల్సిందేనని, ఇక మీదట రెంటల్ పద్ధతికి అంగీకరించేది లేదని తెలిపారు. అదొక్కటే కాదు... ఇతర అంశాల్లోనూ తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. వాటిలో ముఖ్యమైనది... టికెట్ రేట్లు.

టికెట్ రేట్లు పెంచేది లేదు...
ప్రేక్షకుల మీద భారం మోపేది లేదు!
తెలంగాణలో టికెట్ రేట్స్ పెంపు మీద గత కొన్ని రోజులుగా భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. టికెట్ రేటు పెంచుకోవడానికి వీలుగా ప్రభుత్వం అనుమతి ఇచ్చినా... కోర్టులో కొందరు పిటీషన్లు వేయడం నిర్మాతలకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. టికెట్ రేటు పెంచడం సరైన నిర్ణయమా? కాదా? అనేది పక్కన పెడితే... ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫున ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సోదరుడు - నిర్మాత కమ్ ఎగ్జిబిటర్ శిరీష్ టికెట్ రేట్లు పెంచేందుకు ససేమిరా ఒప్పుకోమని చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించినా... తాము మాత్రం తమ థియేటర్లలో పెంచేది లేదని, ప్రేక్షకుల మీద భారం మోపేది లేదని పేర్కొన్నారు. దీని వల్ల ముందుగా నష్టపోయే సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'.

Also Read: RGV On Bandi Bhagiratha - బండి భగీరథపై ఆర్జీవీ కామెంట్స్... సద్దాం హుస్సేన్ కొడుకుతో పోలుస్తూ ట్వీట్ - వైరల్

'పెద్ది' వసూళ్లకు పెద్ద గండి...
సాధారణ టికెట్ రేట్లతో రికార్డులు కష్టమే!
ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బాల్కనీ టికెట్ రేటు 200 లోపే ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... 175 రూపాయలు. ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్ అయిన పేటీఎమ్, బుక్ మై షోలో బుక్ చేస్తే 200 అవుతుంది. బాల్కనీ తర్వాత వంద రూపాయలు, నేల టికెట్టు 50 రూపాయలు ఉంది. సినిమా విడుదలైనప్పటి నుంచి మొదటి వారం లేదా పది రోజులు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి లభిస్తే ఆ రేటు 200 నుంచి 400 లేదా 500 వరకు వెళుతోంది. బెనిఫిట్ షో రేట్లు అయితే 1000 నుంచి 2000 వరకు ఉంటున్నాయి. ఇప్పుడు టికెట్ రేట్లు పెంచమని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ స్పష్టంగా చెప్పడం వల్ల మొదటగా నష్టపోయే సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'యే.

Also ReadMouni Roy Divorce - డబ్బులు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?

జూన్ 4న 'పెద్ది' విడుదల అవుతోంది. సినిమాకు కావాల్సిన బజ్ ఆల్రెడీ విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు తీసుకు వచ్చాయి. అభిమానులు, ప్రేక్షకులు కొందరు నాలుగు వందలు అయినా టికెట్ పెట్టి సినిమా మొదటి వారం సినిమా చూసేందుకు రెడీ. ఆల్రెడీ టికెట్ రేట్లు గురించి ప్రభుత్వంతో చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడినట్టు తెలిసింది. జీవో వచ్చినా సింగిల్ స్క్రీన్ థియేటర్లు టికెట్ రేట్లు పెంచి సినిమా ప్రదర్శించేందుకు ససేమిరా ఒప్పుకోమని చెబితే నిర్మాతకు వచ్చే వసూళ్ళకు పెద్ద గండి పడుతుంది. మైత్రి డిస్ట్రిబ్యూషన్, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ మధ్య కొన్ని రోజులుగా ఇష్యూలు ఉన్నాయి. ఇప్పుడు అవి 'పెద్ది' మీద ఎఫెక్ట్ చూపించేలా ఉన్నాయి.

Also ReadNani Paradise - పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Embed widget