అన్వేషించండి

Mouni Roy Divorce: డబ్బు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?

Mouni Roy Divorce Confirmed: బాలీవుడ్ భామ మౌనీ రాయ్, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ విడాకులు తీసుకున్నారు. నాలుగేళ్ల వైవాహిక బంధం తర్వాత ఈ జంట వేరు పడింది. అందుకు కారణం సూరజ్ అని టాక్. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.
  • భర్త డబ్బు, పేరు ప్రఖ్యాతల కోసం మోసం చేశాడని మౌనీ ఆరోపించారు.
  • ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు, ఫోటోలు తొలగించి అన్‌ఫాలో చేసుకున్నారు.

బాలీవుడ్ సినిమాలు, పాపులర్ హిందీ సీరియల్ 'నాగిన్'తో పేరు తెచ్చుకున్న బెంగాలీ భామ మౌనీ రాయ్ (Mouni Roy). 'బ్రహ్మాస్త్ర'తో పాటు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకూ ఆమె పరిచయమే. వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ (Sooraj Nambiar)కు విడాకులు ఇచ్చారు. నాలుగేళ్ల వైవాహిక బంధం తర్వాత ఈ జంట వేరు పడింది. ఇప్పుడు మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ కలిసి జీవించడం లేదు. వేర్వేరుగా ఉంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ ఫాలో కూడా చేసుకున్నారు. అయితే... ఈ విడాకులకు సంబంధించి అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

భర్త చేతిలో మోసపోయిన మౌనీ రాయ్
అవును... మౌనీ రాయ్ (Mouni Roy Divorce News Latest Update)ను సూరజ్ నంబియార్ మోసం చేసినట్టు బాలీవుడ్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్. ఏబీపీ న్యూస్ 'సాస్ బహు ఔర్ సాజిష్' షోకి అందించిన సమాచారం ప్రకారం... పేరు ప్రఖ్యాతలు, కీర్తి కోసం మౌని రాయ్‌ను ఆమె భర్త మోసం చేశాడట. మౌనీకి చెందిన డబ్బులు సైతం కొంత మొత్తాన్ని అతను కూడా వాడుకున్నాడట. డబ్బుతో పాటు కొన్ని విషయాల్లో సూరజ్ చేతిలో మోసపోయినట్టు తెలుసుకున్న మౌనీ రాయ్... అతడికి విడాకులు ఇచ్చినట్టు తెలిసింది.

సూరజ్ నంబియార్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కూడా మౌనీ రాయ్ తొలగించారు. ఏబీపీకి అందిన సమాచారం ప్రకారం... ప్రస్తుతం వారిద్దరూ కలిసి జీవించడం లేదు. విడాకులు కూడా మంజూరు అయ్యాయట. అయితే, ఈ అంశంపై వారిద్దరూ అధికారికంగా స్పందించలేదింకా.

Also ReadNani Paradise - పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో

Mouni Roy Suraj Nambiar Wedding Date: మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ పెళ్లి జనవరి 27, 2022లో జరిగింది. సూరజ్ మలయాళీ అయితే... మౌనీ బెంగాలీ. తమ తమ సంప్రదాయాలను పాటిస్తూ గోవాలో వివాహం చేసుకున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... మౌని రాయ్ క్లోజ్ ఫ్రెండ్ దిశా పటాని కూడా సూరజ్ నంబియార్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారు.

Photo GalleryChiranjeevi Latest Photoshoot - బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Saas Bahu Aur Saazish (@sbsabpnews)

మౌనీ రాయ్ గురించి చెప్పాలంటే... హిందీ సీరియళ్లతో పాపులర్ అయ్యారు. ఆమె 2006లో ప్రసారమైన 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ'తో కెరీర్‌ ప్రారంభించారు. అందులో కృష్ణ తులసి పాత్రను పోషించారు. ఆ తర్వాత 'కహో నా యార్ హై', 'కస్తూరి', 'దోవోన్ కే దేవ్...మహాదేవ్', 'నాగిన్' చేశారు. సినిమాల్లోనూ మౌనీ రాయ్ నటించారు.

విడుదలకు రెడీ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'లో మౌనీ రాయ్ ఐటెం సాంగ్ చేశారు. హిందీలో 'రన్', 'తుమ్ బిన్ 2', 'గోల్డ్', 'కేజీఎఫ్: చాప్టర్ 1', 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా', 'బ్రహ్మాస్త్ర', సినిమాల్లో నటించారు. జూన్ 5న విడుదల కానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'లో కూడా మౌనీ రాయ్ ఉన్నారు. 

Also ReadTrisha Krishnan - రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు మరో సినిమా... భారీ తమిళ మల్టీస్టారర్‌లో త్రిష?

Frequently Asked Questions

మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ విడాకులు తీసుకున్నారా?

అవును, నాలుగేళ్ల వైవాహిక బంధం తర్వాత మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.

మౌనీ రాయ్ విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటి?

పేరు, ప్రఖ్యాతలు, డబ్బు విషయంలో సూరజ్ నంబియార్ మౌనీ రాయ్ ను మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ మోసం వల్లే మౌనీ రాయ్ విడాకులు తీసుకున్నట్లు సమాచారం.

మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఎప్పుడు వివాహం చేసుకున్నారు?

మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ జనవరి 27, 2022న గోవాలో వివాహం చేసుకున్నారు. వారి సంప్రదాయాలను పాటిస్తూ ఈ వివాహం జరిగింది.

మౌనీ రాయ్ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది?

మౌనీ రాయ్ 2006లో 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' అనే హిందీ సీరియల్ తో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 'నాగిన్' వంటి సీరియల్స్ తో బాగా పాపులర్ అయ్యారు.

టాప్ హెడ్ లైన్స్

The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Embed widget