Mirai Teaser: నువ్వెవరో నీకే తెలియని యోధావి - అప్పుడు 'హనుమాన్'.. ఇప్పుడు రాముడు.. 'మిరాయ్' టీజర్ వేరే లెవల్..
Teja Sajja: యంగ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ భారీ యాక్షన్ అడ్వెంచర్ 'మిరాయ్' నుంచి టీజర్ వచ్చేసింది. సూపర్ యోధ రోల్‌లో రాముడిగా తేజ అదరగొట్టారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Teja Sajja's Mirai Teaser Released: 'హనుమాన్' మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా. ఆయన సూపర్ యోధగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'మిరాయ్'. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.
అప్పుడు హనుమాన్.. ఇప్పుడు రాముడు
ఈ మూవీ సూపర్ యోధ రోల్‌లో తేజ సజ్జా కనిపించనున్నారు. చెడును అంతం చేసి ధర్మాన్ని, ఊరిని కాపాడేందుకు రాముడి రూపంలో ఓ యోధుడిలా తేజ సజ్జా వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేయగా.. టీజర్ వేరే లెవల్‌లో ఉంది. 'జరగబోయేది మారణహోమం.. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం కాగా.. అశోకుడి కలింగ యుద్ధం బ్యాక్ డ్రాప్‌లో రణం తర్వాత పరిణామాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది.
'నువ్వు యోధావి.. కానీ నువ్వెవరో నీకే తెలియని యోధావి.' 'సమాధానం కోసం బయట కాదు లోపల వెతుకు' అంటూ తేజ సజ్జాను ఎలివేట్ చేసే డైలాగ్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి.
'9 బుక్స్.. 100 క్వశ్చన్స్.. వన్ స్టిక్కర్.. బిగ్ అడ్వెంచర్' అంటూ తేజ సజ్జా చెప్పే డైలాగ్ వేరే లెవల్‌లో ఉంది. సూపర్ యోధ, విలన్ మధ్య యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉన్నట్లు తెలుస్తుండగా.. టీజర్ చివర్లో రాముడు నడుచుకుంటూ వస్తుండగా.. వానరాలు ఆయనకు మొక్కడం ఆసక్తిని పెంచేసింది.
9 books. 100 questions. 1 stick.
— Teja Sajja (@tejasajja123) May 28, 2025
BIG ADVENTURE ❤️🔥#MiraiTeaser out now 💥
— https://t.co/VdFWbdMSkN #MIRAI in cinemas SEP 5th, 2025. #SuperYodha 🥷
Rocking Star @HeroManoj1 @RitikaNayak_ @Karthik_gatta @vishwaprasadtg @GowrahariK @peoplemediafcy @vivekkuchibotla… pic.twitter.com/GEfhJMOVoN
విలన్‌గా మంచు మనోజ్
ఈ మూవీలో విలన్‌గా మంచు మనోజ్ నటించగా.. ఆయనకు సూపర్ యోధునికి మధ్య జరిగే యాక్షన్ సీన్స్ వేరే లెవల్‌లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. 'ఇది మహా వీలునామా.. భూమిపై చేయబోయే సంతకం' అంటూ మనోజ్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మూవీలో శ్రియ, జగపతిబాబు, కౌశిక్ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ అడ్వెంచర్‌ను కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తుండగా.. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తేజ సజ్జా సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా.. మంచు మనోజ్ నెగిటివ్ రోల్‌లో నటించనున్నారు. గౌర హర మ్యూజిక్ అందించారు. పాన్ ఇండియా వైడ్‌గా సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్‌లో రిలీజ్ చేయనున్నారు. అశోక కళింగ యుద్ధ పరిణామాల తర్వాత రాసిన గ్రంథాలు.. వాటిని తరతరాలుగా కాపాడుతూ వస్తున్న 9 మంది యోధులు ప్రధానాంశంగా మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది.






















