అన్వేషించండి

Tapsee Pannu wedding: తాప్సీ పన్ను పెళ్లంట - ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

హీరోయిన్ తాప్సీ పన్ను, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బో ల పదేళ్ల ప్రేమ బంధం పెళ్లిగా మారటానికి అంతా సిద్ధమయింది. మరి వారి డెస్టినేషన్ వెడ్డింగ్, మరిన్ని పెళ్ళి వివరాలు తెలుసుకుందామా?

హీరోయిన్ తాప్సీ పన్ను త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ప్రియుడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బో‌ను పెళ్లి చేసుకోనుంది. వీరిద్దరు పదేళ్లుగా ప్రేమ బంధంలో ఉన్నట్టు తాప్సీ పన్ను గతేడాది బయటపెట్టింది. కాగా, వీరి వివాహం ఉదయ్‌పూర్‌లో కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. దీనికి బాలీవుడ్ నటులెవర్నీ పిలవటం లేదని తెలిసింది.

సిఖ్-క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి

వీరి పెళ్లి సిఖ్, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో జరగనున్నట్లు సమాచారం. పదేళ్లుగా తాప్సీ పన్ను ఈ డానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బో డేటింగ్‌లో ఉంది. మార్చి నెలలో ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం.

డిల్లీకి చెందిన తాప్సీ తెలుగుతో పాటు పలు భాషల్లో నటించినప్పటికీ, పెద్దగా గుర్తింపు లేక బాలివుడ్ లో సెటిల్ అయ్యింది. తర్వాత ఎంతో మంది స్టార్ హీరోలతో, పాన్ ఇండియా చిత్రాల్లోనూ నటించింది. ఈ మధ్య 'డంకీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది. తాప్సీ పన్ను తెలుగులో 'ఝుమ్మంది నాదం' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు.

గతేడాది జనవరిలో తన డ్రీం వెడ్డింగ్ ఎలా జరగాలో తాప్సీ చెప్పుకొచ్చింది. తన పెళ్ళిలో ఆటపాటలు, చాలా రకాల తిను పదార్థాలు ఉండబోతున్నట్టు చెప్పింది. ‘‘పెళ్లి జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక. ఇందులో ఎటువంటి డ్రామాలు లేకుండా, చాలా సాధారణంగా జరుపుకోవాలి. ఎలాగూ ప్రొఫెషనల్ జీవితంలో కావల్సినంత డ్రామా ఉంటుంది’’ అని ఈ తరం పెళ్లికూతుర్లను ఉద్దేశించి చెప్పుకొచ్చింది. ఇంకా, తన పెళ్లిలో అర్ధరాత్రిళ్ల వరకు ఎలాంటి సంప్రదాయ కార్యక్రమాలు చేయబోవటం లేదని తాప్సీ తెలిపింది.

తాప్సీ పెళ్లికూతురు లుక్ ఎలా ఉందబోతోందంటే..

తన వెడ్డింగ్ లుక్ గురించి మాట్లాడుతూ, తనకు హెవీ హెయిర్ స్టైల్స్ నచ్చవని, చాలా సాధారణంగా జుట్టు వేసుకొవటానికి ఇష్టపడతానని, కొంతమంది పెళ్ళికూతుర్లు అంతంత మేకప్ లు వేసుకొని తయారవడం చూస్తే జాలి కలుగుతుందని, అంతగా రెడీ అయ్యి, ఫొటోల్లో వేరే మనిషిలాగా కనపడితే తమను తాము ఎలా చూసుకోగలరని ఆమె ఆశ్చర్యపోయారు. "ఈ జ్ఞాపకాలు కేవలం ఆ ఒక్కరోజు కోసం కాదు, జీవితాంతం గుర్తుండిపోయేవి కదా? ఫొటోలు చూసుకొని మనల్ని మనం గుర్తుపట్టలేకుండా ఉంటే ఎలా?" అని అన్నారామె.

తనకంటూ ఉన్నతమైన అభిప్రాయాలతో ఉంటూ, సందర్భాన్ని బట్టి తన ఫెమినిజం గొంతు వినిపిస్తుంది తాప్సీ. ‘పింక్’ లాంటి సినిమాల్లో బిగ్ బీతో నటించి, మంచి పేరు సంపాదించుకున్నారు. ఇటు ఆరోగ్యం, జీవనవిధానంకు సంబంధించిన ఎన్నో విషయాల మీద ఆమె మాట్లాడుతుంది.

Also Read: చిన్న సినిమాలు, పెద్ద విజయాలు - గత వారం డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలివే! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget