Tollywood Box Office: చిన్న సినిమాలు, పెద్ద విజయాలు - గత వారం డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలివే!
Tollywood Box Office: ఫిబ్రవరి మూడో వారంలో 'సుందరం మాస్టర్', 'మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా', 'సిద్ధార్థ్ రాయ్' లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటి ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
February Box Office Collections: ఫిబ్రవరి నెలలో పెద్ద సినిమాల రిలీజులు పెద్దగా లేకపోవడంతో, చిన్న మీడియం రేంజ్ చిత్రాలు ఈ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి ట్రై చేశాయి. ఈ నెలలో ఇప్పటికే అనేక చిన్నా చితకా సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. వాటిలో కొన్ని ఆడియన్స్ ను అలరించగా.. మరికొన్ని ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. ఈ విధంగా గత వారం వచ్చిన చిత్రాల్లో 'సుందరం మాస్టర్', 'మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా', 'సిద్ధార్థ్ రాయ్' వున్నాయి. ప్రమోషణనల్ కంటెంట్ తో అంతో ఇంతో జనాల దృష్టిని ఆకర్షించిన ఈ చిన్న సినిమాలు.. ఫస్ట్ వీకెండ్ లో డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టాయి.
కమెడియన్ హర్ష చెముడు (వైవా హర్ష), తెలుగమ్మాయి దివ్య శ్రీపాద హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. RT టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు ఈ చిత్రాన్ని నిర్మించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విలేజ్ కామెడీ డ్రామా.. ఫిబ్రవరి 23న రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజే 2.03 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ.. రెండో రోజు అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 4.68 కోట్లకుపైగా కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ ను ముగించింది.
పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. వి యశస్వీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తన్వి నేగి హీరోయిన్ గా నటించింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు ఈ మూవీని నిర్మించారు. ఫిబ్రవరి 23న విడుదలైన ఈ చిత్రం యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. మొదటి రెండు రోజుల్లో 3.12 కోట్ల గ్రాస్ రాబట్టింది. మూడో రోజు పూర్తయ్యే నాటికి 4.31 కోట్లను అందుకుంది.
కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అభినవ్ గోమఠం హీరోగా, వైశాలిరాజ్ హీరోయిన్‌గా రూపొందించిన చిత్రం 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా'. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాని కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకంపై భవానీ నిర్మించారు. ఫిబ్రవరి 23న థియేటర్లలోకి వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఫస్ట్ డే 1.6 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. రెండు రోజుల్లో 2.8 కోట్ల గ్రాస్ వసూలు చేయగలిగింది.
ఇలా లాస్ట్ వీక్ రిలీజైన సినిమాల్లో ఈ మూడూ డీసెంట్ ఓపెనింగ్స్ అందుకున్నాయి. చిన్న చిత్రాలుగా వచ్చి పెద్ద విజయాలు సాధించాయి. అయితే వీటితో పాటుగా 'ముఖ్య గమనిక', '14 డేస్ లవ్' లాంటి మూవీస్ విడుదలయ్యాయి కానీ, జనాలను ఆకట్టుకోలేకపోయాయి. ఈ వారంలో 'ఆపరేషన్ వాలెంటైన్', 'భూతద్దం భాస్కర్ నారాయణ', 'చారి 111' వంటి సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి వీటిల్లో ఏవేవి ఆడియెన్స్ ను అలరిస్తాయో చూడాలి.
Also Read: ఈ బ్యూటీని గుర్తుపట్టారా? పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?