అన్వేషించండి

Tamannaah: ఆ బోల్డ్ సీన్స్‌పై ఎట్టకేలకు స్పందించిన తమన్నా - అలా అనేసిందేంటీ?

మిల్కీ బ్యూటీ తమన్న తాజాగా 'జీకర్దా' అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిండ్దే. అయితే ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ చేయడంపై తమన్నా స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మిల్కీ బ్యూటీ తమన్నా కొద్దిరోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అందుకు కారణం ఈ ముద్దుగుమ్మ నటించిన 'జీకర్దా' అనే హిందీ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయింది. ఇప్పటివరకు చూడని తమన్నాను ఈ వెబ్ సిరీస్ లో ఆడియన్స్ చూడడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ కోసం తమన్నా తన ఇమేజ్ ని సైతం పక్కన పెట్టి బోల్డ్ సీన్స్ లో నటించడమే కాకుండా బూతు డైలాగులు కూడా చెప్పింది.

తమన్నా బోల్డ్ సీన్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దాంతో సోషల్ మీడియాలో తమన్నాని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు నెటిజన్స్. కెరియర్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన తమన్నా ఇప్పటివరకు హద్దులు దాటలేదు. అలాంటిది హిందీ వెబ్ సిరీస్ కోసం తమన్నా తన హద్దులు అన్ని చెరిపేసి ఇలా నటించడం ఏంటంటూ చాలామంది ఆమెను విమర్శించారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో తమన్నాని సన్నీలియోన్ తో పోల్చారు.

అయితే తాజాగా వీటన్నింటిపై తమన్నా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఇంటరాక్షన్ లో తమన్నా బోల్డ్ సీన్స్ చేయడం గురించి మాట్లాడుతూ..  "కథకు ఇలాంటి సన్నివేశాలు చాలా అవసరం. ఒక రిలేషన్షిప్ ని నిజంగా చూపించడంలో ఇలాంటి సన్నివేశాలు చాలా కీలకంగా ఉంటాయి. అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. అది జనాలకు నచ్చినా? నచ్చకపోయినా కథలో భాగంగా వాటిని అలాగే చూపిస్తారు. ఓ ఇద్దరు వ్యక్తులు తమ జీవితంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే క్రమంలోనే ఆ సన్నివేశాలు వస్తాయి. ఇక మా డైరెక్టర్ అరుణిమ ఇచ్చిన సూచనలు అలాంటి సన్నివేశాల్లో సులభంగా, సౌకర్యవంతంగా నటించేందుకు ఉపయోగపడ్డాయి" అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కాగా త్వరలోనే 'లస్ట్ స్టోరీస్ 2' అనే మరో బోల్డ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందు రాబోతుంది తమన్నా.

ఈ వెబ్ సిరీస్ లో కూడా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయింది. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్న ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది. జూన్ 29న ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా 'భోళా శంకర్' అనే సినిమాలో నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాలో కూడా నటిస్తోంది తమన్నా. రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 10న రిలీజ్ కానుంది.

Also Read: నిఖిల్ 'స్పై'లో దగ్గుబాటి హీరో? ఏ పాత్రలో అంటే?

నిఖిల్ 'స్పై'లో దగ్గుబాటి హీరో? ఏ పాత్రలో అంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sai Dharam Tej : యూట్యూబర్‌పై రేవంత్, చంద్రబాబు, పవన్‌కు నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఫిర్యాదు- ఇలాంటివి జరగకుండా చూడాలంటూ రిక్వస్ట్
యూట్యూబర్‌పై రేవంత్, చంద్రబాబు, పవన్‌కు నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఫిర్యాదు- ఇలాంటివి జరగకుండా చూడాలంటూ రిక్వస్ట్
Annadatha Sukibhava Scheme: ఏపీలో 'అన్నదాత సుఖీభవ'తో ప్రతి రైతుకు రూ.20 వేలు -  ఇవి తప్పనిసరి!
ఏపీలో 'అన్నదాత సుఖీభవ'తో ప్రతి రైతుకు రూ.20 వేలు - ఇవి తప్పనిసరి!
Gudivada News: 'మా అమ్మ చావుకు ఆ ముగ్గురే కారణం' - కొడాలి నాని, కలెక్టర్, బేవరేజెస్ మాజీ ఎండీపై పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు
'మా అమ్మ చావుకు ఆ ముగ్గురే కారణం' - కొడాలి నాని, కలెక్టర్, బేవరేజెస్ మాజీ ఎండీపై పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు
GHMC Council Meeting: GHMC కౌన్సిల్ సమావేశం రసాభాస - మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ కార్పొరేటర్ల డిమాండ్
GHMC కౌన్సిల్ సమావేశం రసాభాస - మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ కార్పొరేటర్ల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sai Dharam Tej : యూట్యూబర్‌పై రేవంత్, చంద్రబాబు, పవన్‌కు నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఫిర్యాదు- ఇలాంటివి జరగకుండా చూడాలంటూ రిక్వస్ట్
యూట్యూబర్‌పై రేవంత్, చంద్రబాబు, పవన్‌కు నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఫిర్యాదు- ఇలాంటివి జరగకుండా చూడాలంటూ రిక్వస్ట్
Annadatha Sukibhava Scheme: ఏపీలో 'అన్నదాత సుఖీభవ'తో ప్రతి రైతుకు రూ.20 వేలు -  ఇవి తప్పనిసరి!
ఏపీలో 'అన్నదాత సుఖీభవ'తో ప్రతి రైతుకు రూ.20 వేలు - ఇవి తప్పనిసరి!
Gudivada News: 'మా అమ్మ చావుకు ఆ ముగ్గురే కారణం' - కొడాలి నాని, కలెక్టర్, బేవరేజెస్ మాజీ ఎండీపై పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు
'మా అమ్మ చావుకు ఆ ముగ్గురే కారణం' - కొడాలి నాని, కలెక్టర్, బేవరేజెస్ మాజీ ఎండీపై పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు
GHMC Council Meeting: GHMC కౌన్సిల్ సమావేశం రసాభాస - మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ కార్పొరేటర్ల డిమాండ్
GHMC కౌన్సిల్ సమావేశం రసాభాస - మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ కార్పొరేటర్ల డిమాండ్
Raj Tarun: హీరోయిన్‌తో రాజ్ తరుణ్ ప్రియురాలు వాగ్వాదం - ఆడియో రికార్డింగ్ లీక్, ఎవరీ మాల్వీ మల్హోత్రా?
హీరోయిన్‌తో రాజ్ తరుణ్ ప్రియురాలు వాగ్వాదం - ఆడియో రికార్డింగ్ లీక్, ఎవరీ మాల్వీ మల్హోత్రా?
Raj Tarun Case: హీరో రాజ్‌ తరుణ్‌ కేసులో ట్విస్ట్‌ - అతడి ప్రియురాలు లావణ్యకు నోటీసులు జారీ..
హీరో రాజ్‌ తరుణ్‌ కేసులో ట్విస్ట్‌ - అతడి ప్రియురాలు లావణ్యకు నోటీసులు జారీ..
BRS MLA Bandla Krishna Mohan Reddy: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఆగని వలసలు- ఇవాళ గద్వాల్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక- మరికొందరు రెడీ!
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఆగని వలసలు- ఇవాళ గద్వాల్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక- మరికొందరు రెడీ!
Swapna Varma: టాలీవుడ్‌లో విషాదం - ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య
టాలీవుడ్‌లో విషాదం - ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య
Embed widget