By: ABP Desam | Updated at : 16 Feb 2023 06:06 PM (IST)
Image Credit: Suriya/Instagram
ఒకరు టీమిండియా దిగ్గజ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. మరకొరు అద్భుతమైన నటుడు, నిర్మాత సూర్య. వీరిద్దరినీ ఒక్క చోట చూస్తే రెండు కళ్లూ సరిపోవు కదూ. అందుకే, వీరిద్దరు కలిసిన ఈ ఫొటో అంత వైరల్ అవుతోంది.
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో కలిసి దిగిన చిత్రాన్ని ప్రముఖ తమిళ హీరో సూర్య తన ఇన్ స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరూ ఎప్పుడు, ఎక్కడ కలిశారనే విషయంపై క్లారిటీ లేదు. కేవలం రెస్పెక్ట్ అండ్ లవ్ అని క్యాప్షన్ మాత్రమే పెట్టారు. కారణం ఏదైనా ఇలా ఇద్దరు ప్రముఖులు కలిసి కనిపించేసరికి ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేేవు.
తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించారు హీరో సూర్య. ‘గజనీ’ మూవీతో తెలుగులో హిట్ సాధించిన సూర్య ఆ తర్వాత ‘యముడు’, ‘సింగం’, ‘ఈటీ’, ‘గ్యాంగ్’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలలో నటించి తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీలో కూడా అతిథి పాత్రలో కనిపించి మెప్పించాడు. కనిపించింది కాసేపైనా అతడు పోషించిన ‘రోలెక్స్’ పాత్రకు ఎక్కడాలేని గుర్తింపు వచ్చింది. ఎంతగా అంటే.. ఇప్పుడు అంతా సూర్యను ‘రొలెక్స్’ అని పిలిచేంతగా. సూర్య ప్రస్తుతం దర్శకుడు శివతో తన తదుపరి తమిళ ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు.
ఇక క్రికెటర్ సచిన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో సచిన్ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయారు. తన కెరీర్ లో ఎన్నో వన్డే, టెస్ట్ మ్యాచ్‌ల్లో రాణించిన సచిన్.. రిటైర్మెంట్‌తో క్రికెట్‌కు వీడ్కోలు తెలిపిన సంగతి తెలిసిందే. సచిన్ భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం భారత రత్నను కూడా అందుకున్నారు. అంతేకాదు ఈ అవార్డును అందుకున్న ప్రథమ స్పోర్ట్స్ మ్యాన్ గా మరో రికార్డును సాధించారు సచిన్ టెండూల్కర్.
Also Read : లావణ్యా త్రిపాఠి 'పులి - మేక'కు రామ్ చరణ్ సాయం... అదేంటో తెలుసా?
సినీ ప్రపంచంలో రోలెక్స్ అంటే ఇప్పుడు సూర్య. అలాగే క్రికెట్ లో రోలెక్స్ అంటే సచిన్ అనడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా రోలెక్స్ అంటే పెద్ద పెద్ద విలన్లే భయపడతారు. అలాగే సచిన్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లో కాలుపెడితే ప్రత్యర్థి జట్ల బౌలర్లు కూడా అలాగే భయపడతారు. అటువంటిది వీరు ఇద్దరూ కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గత కొంతకాలంగా సూర్య ఫ్యామిలీ ముంబైలోనే ఉంటుందంట. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ లలో చిన్న బ్రేక్ వచ్చిన సూర్య వెంటనే కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిన సమయంలోనే సూర్య క్రికెట్ దిగ్గజంగా పేరు గాంచిన సచిన్ టెండూల్కర్ ను కలిశారట. అనంతరం సచిన్ తో ఉన్న ఫోటోను షేర్ చేసిన సూర్య.. ‘గౌరవం మరియు ప్రేమ’@సచింటెండూల్కర్ అంటూ రాసుకొచ్చారు. దీనిపై స్పందించిన అభిమానులు కామెంట్స్ విభాగంలో లవ్, ఫైర్ ఎమోజీలతో స్పందిస్తున్నారు.
RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం
Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?
Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!
Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!
Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా