Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
దర్శకుడు బాలతో ఏదో డిస్కస్ చేస్తున్న ఫోటోను సూర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో పుకార్లకు చెక్ పెట్టినట్టు అయ్యింది. ఇంతకీ, ఆ పుకార్లు ఏమిటి? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
![Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య Suriya 41 Not Shelved, Hero Suriya Sivakumar put an end to speculations about creative differences between him and director Bala Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/46e14a639ea2b00306dde215f0b7a070_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Suriya 41 Movie Update: సూర్య కథానాయకుడిగా దర్శకుడు బాల ఒక సినిమా చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా తమిళనాట ఈ సినిమాపై ఓ పుకారు షికారు చేసింది. అదేంటంటే... సినిమా ఆగిపోయిందని! హీరో, దర్శకుడు క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చాయని... గొడవ కావడంతో షూటింగ్ లొకేషన్ నుంచి సూర్య వాకవుట్ చేశాడనే గుసగుసలు వినిపించాయి. సినిమా పక్కన పెట్టేశారని కొందరు అన్నారు. వాటికి సూర్య ఫుల్ స్టాప్ పెట్టారు.
దర్శకుడు బాలాతో ఏదో డిస్కస్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటోను సూర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ''మళ్ళీ సెట్స్ లోకి రావడానికి వెయిట్ చేస్తున్నాను. #Suriya41'' అని ఆ ఫోటోకు కాప్షన్ ఇచ్చారు. దాంతో పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఆల్రెడీ కన్యాకుమారిలో ఒక షెడ్యూల్ చేశారు. త్వరలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
సుమారు 18 ఏళ్ళ తర్వాత
స్టార్ హీరో సూర్య, విలక్షణ - విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తీసిన దర్శకుడు బాలది హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరి కలయికలో 'నందా', 'పితామగన్' చిత్రాలు వచ్చాయి. ఆ రెండూ భారీ విజయాలు సాధించడమే కాదు... నటుడిగా సూర్యకు పేరు, గౌరవం తీసుకు వచ్చాయి. బాల తన మెంటర్ అని సూర్య చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సుమారు 18 ఏళ్ళ విరామం తర్వాత వీళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న చిత్రమిది.
Also Read: 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - టామ్ క్రూజ్ 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?
సూర్య సమర్పణలో...
ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. సూర్య, జ్యోతిక సమర్పిస్తున్నారు. సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' ఓటీటీలో విడుదల అయ్యాయి. మంచి విజయాలు సాధించాయి. అయితే, థియేటర్లలో వచ్చిన 'ఈటీ - ఎవరికీ తలవంచడు' సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడీ సూర్య - బాల సినిమాపై తమిళనాట, తెలుగులో అంచనాలు బావున్నాయి.
Also Read: రాశి, అందాల రాశి - హీరోయిన్ పేరు మీద 'పక్కా కమర్షియల్' సినిమాలో సాంగ్, రిలీజ్ ఎప్పుడు అంటే?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)