Suriya 41: ఎన్నాళ్లకెన్నాళ్లకు, సూర్య - బాల కలయికలో సినిమా మొదలైందోచ్!
Suriya 41 shoot starts today: హీరో సూర్య శివకుమార్, దర్శకుడు బాల కలయికలో కొత్త సినిమా చిత్రీకరణ ఈ రోజు ప్రారంభం అయ్యింది.
సూర్య (Suriya Sivakumar) కొత్త సినిమా ఈ రోజు ప్రారంభం అయ్యింది. ఆయన 41వ చిత్రమిది. దీనికి బాల (Director Bala) దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాల కలయికలో 'నందా', 'పితామగన్' సినిమాలు వచ్చాయి. ఆ రెండూ మంచి విజయాలు సాధించడమే కాదు, నటుడిగా సూర్యకు పేరు తీసుకొచ్చాయి. బాలాను తన మెంటర్ అని సూర్య చెబుతూ ఉంటారు. మళ్ళీ 18 ఏళ్ళ తర్వాత వీళ్ళిద్దరి కలయికలో సినిమా రూపొందుతోంది (Director Bala and Suriya Sivakumar team up after 18 Years).
సూర్య, బాల కలయికలో తాజా సినిమా ఈ రోజు (సోమవారం) కన్యాకుమారిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. పూజ తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. సూర్య, జ్యోతిక సమర్పిస్తున్నారు.
Also Read: ఆస్కార్స్ లైవ్‌లో గొడవ, కమెడియన్‌ని కొట్టిన విల్ స్మిత్
"నా మెంటార్ బాల సార్ యాక్షన్ ఎప్పుడు చెబుతారా? అని ఎదురు చూస్తున్నాను. 18 ఏళ్ళ తర్వాత ఆ క్షణం వచ్చింది. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి" అని సూర్య ట్వీట్ చేశారు. 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' ఓటీటీ విజయాల తర్వాత 'ఈటీ - ఎవరికీ తలవంచడు' సినిమాతో సూర్య థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలతో సినిమా చేస్తున్నారు. దీనిపై తమిళనాట, తెలుగులో అంచనాలు బావున్నాయి.
Also Read: పూరితో మరోసారి - ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా విజయ్ దేవరకొండ!
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.