Jani Master: జానీ మాస్టర్‌కు ఊరట... బెయిల్ రద్దు విషయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం కోర్టు
జానీ మాస్టర్ కు బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. సుప్రీం కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసు విషయంలో దాదాపు నెలరోజుల పాటు జైల్లో గడిపిన ఆయన అక్టోబర్ 24 న బెయిల్ పై బయటకు వచ్చారు. కానీ హైకోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేయడాన్ని బాధితురాలు తప్పుబట్టింది. ఈ మేరకు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణకు రాగా, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించింది.
జానీ మాస్టర్ కు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను క్యాన్సిల్ చేయాలంటూ బాధితురాలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరగగా, సుప్రీం కోర్టు పిటిషన్ ను కొట్టేసింది. తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఈ సందర్భంగా స్పష్టం చేసింది ధర్మాసనం. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ దగ్గర పని చేసిన లేడీ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. 2017లో జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని, ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also : Pushpa 2: కిస్సిక్ కుమ్మేసిందంతే... పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ప్రోమో వచ్చేసిందోయ్ - విన్నారా?
అంతే కాకుండా షూటింగ్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించింది. అయితే సదరు అమ్మాయి... మైనర్ గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, పెళ్లి పేరుతో ఒత్తిడి చేశాడని కంప్లైంట్ చేసింది. దీంతో జానీ మాస్టర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. అనంతరం జానీ మాస్టర్ ని పోలీసులు అరెస్ట్ చేయగా, నెలరోజుల పాటు ఆయన జైల్లో గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత జబర్దస్త్ రాకేష్ "కేసీఆర్" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ టైం కనిపించింది ఈ ఈవెంట్ లోనే. తనపై వచ్చిన ఆరోపణలు, అరెస్టు, బెయిల్ వంటి పరిణామాల తర్వాత "కేసీఆర్" మూవీ స్టేజ్ మీద జానీ మాస్టర్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అవుతూ ఇలా జరిగినప్పుడు కూడా తనను నమ్మిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా అన్ని త్వరలోనే తెలుస్తాయి అంటూ వివాదంపై స్పందించారు. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ కి రావాల్సిన నేషనల్ అవార్డు క్యాన్సిల్ అయిన సంగతి కూడా తెలిసిందే. 2022 ఏడాదికి గాను బెస్ట్ కొరియోగ్రఫీ గా నేషనల్ ఫిలిం అవార్డుకు జానీ మాస్టర్ సెలెక్ట్ అయ్యారు. అవార్డ్ అందుకోమంటూ జానీ మాస్టర్ కు ఆహ్వానం కూడా అందింది. కానీ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో ఆయనకు ఇస్తున్న అవార్డును నిలిపివేస్తున్నట్టు నేషనల్ అవార్డు కమిటీ ప్రకటించింది. ఇక తాజాగా ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను కొట్టివేయాలంటూ బాధితురాలు సుప్రీం కోర్టుకు వెళ్లగా, అక్కడ తాము కలగజేసుకోబోమని సుప్రీం కోర్టు చెప్పడంతో జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించినట్టుగా అయింది.
Also Read: జీబ్రా రివ్యూ: సత్యదేవ్ వర్సెస్ డాలీ ధనుంజయ... హీరోలు ఇద్దరిలో ఎవరిది పైచేయి? మూవీ హిట్టేనా?