అన్వేషించండి

Suniel Narang Resigned: తెలంగాణ ఛాంబర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్ రాజీనామా... 'పెద్ది' ఇష్యూలే కారణమా?

Asian Suniel Narang: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అందుకు కారణం 'పెద్ది' ఇష్యూనా? అనేది డౌట్. 

సింగిల్ స్క్రీన్స్ ఓనర్లు తమకు పర్సెంటేజ్ సిస్టమ్ కావాలని డిమాండ్ చేయడంతో కొన్ని రోజులుగా తెలుగు చిత్రసీమలో వాడీవేడి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వరుస వివాదాల నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ (Suniel Narang) రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామాకు 'పెద్ది' సమస్యలే కారణమా? అని డిస్కషన్ కూడా జరుగుతోంది.  

సునీల్ నారంగ్ రాజీనామాకు కారణం ఏమిటి?
Reason For Suniel Narang Resign: తెలుగు చిత్రసీమలో 'థియేటర్ కలెక్షన్స్ షేరింగ్ వర్సెస్ పర్సంటేజీ' విషయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' విడుదలకు ముందు, ఆ సినిమాను టార్గెట్ చేస్తూ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ఓనర్లు షేరింగ్ డిమాండ్ తీసుకు వచ్చారని నిర్మాతల నుంచి విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. తర్వాత 'పెద్ది' విడుదలకు లైన్ క్లియర్ అంటూ ఓ లేఖ వచ్చింది. తర్వాత అందులో విషయాలు ఫైనల్ కాదంటూ ప్రముఖ నిర్మాత, ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు నుంచి మరొక లేఖ వచ్చింది. ఈ తరుణంలో సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. సో... ఆ ఇష్యూలే కారణమని ప్రచారం జరుగుతోంది.

Also Read: Naga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

రాజీనామా లేఖలో సునీల్ నారంగ్ పలు అంశాలు ప్రస్తావించారని తెలిసింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్‌లోని కొందరు ఆఫీస్ బేరర్ల నుంచి తనపై విపరీతమైన ఒత్తిడి వస్తోందని, వాళ్ళకు నచ్చేలా - మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనస్సాక్షికి విరుద్ధంగా ఇక్కడ పని చేయలేనని సునీల్ నారంగ్ స్పష్టం చేశారు. ఛాంబర్ నిర్ణయాలు ఏకాభిప్రాయంతో జరగాలని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.

Also Read: Dragon Glimpse Decoded - ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌లో హిడెన్ డీటెయిల్స్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్ గమనించారా?

నిర్మాతలు మైత్రీ రవిశంకర్, సూర్యదేవర నాగవంశీతో విభేదాలు కూడా సునీల్ నారంగ్ రాజీనామాకు కారణమని ఫిల్మ్ నగర్ గుసగుస. ఛాంబర్ మీటింగ్‌లో వాళ్ళ మధ్య గొడవ కూడా జరిగిందని టాక్. కొంత మంది నుంచి ఎదురైన ఒత్తిళ్లతో పాటు కొంత కాలంగా తన ఆరోగ్య పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని తన రాజీమానా లేఖలో సునీల్ నారంగ్ వెల్లడించారు. ఛాంబర్ కార్యకలాపాలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో శేఖర్ లేదా విజేందర్‌లను అధ్యక్షులుగా నియమించాలని సునీల్ నారంగ్ పేర్కొన్నారు.

సునీల్ నారంగ్ రాజీనామాను ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తక్షణమే ఆమోదం తెలిపింది. ఆయనను బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల చిత్రసీమలో జరిగిన పరిణామాల నేపథ్యంలో సునీల్ నారంగ్ హఠాత్తుగా రాజీనామా చేయడం పరిశ్రమ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

Also Read: Dragon Glimpse vs Peddi Trailer - డ్రాగన్ గ్లింప్స్‌ vs పెద్ది ట్రైలర్... ఏది బావుంది? ఎన్టీఆర్ vs రామ్ చరణ్... ఎవరిది అప్పర్ హ్యాండ్?

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Streamings : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 8 సినిమాలు స్ట్రీమింగ్... ఈ బ్లాక్ బస్టర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 8 సినిమాలు స్ట్రీమింగ్... ఈ బ్లాక్ బస్టర్స్ డోంట్ మిస్
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Vrushakarma Trailer Review : సృష్టి ధర్మాన్ని కాపాడే 'వృషకర్మ' వచ్చేశాడు - ఊహకందని ఊహించని మరో ప్రపంచం... ట్రైలర్ రివ్యూ
సృష్టి ధర్మాన్ని కాపాడే 'వృషకర్మ' వచ్చేశాడు - ఊహకందని ఊహించని మరో ప్రపంచం... ట్రైలర్ రివ్యూ
This Week OTT Releases : నవంబర్ లాస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - హనుమాన్ అంశ్ To దృశ్యం 3... 21 సినిమాలు స్ట్రీమింగ్
నవంబర్ లాస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - హనుమాన్ అంశ్ To దృశ్యం 3... 21 సినిమాలు స్ట్రీమింగ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
Embed widget