Ooru Peru Bhairavakona Trailer: 'గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన' - ఉత్కంఠగా సాగిన ట్రైలర్
Ooru Peru Bhairavakona Movie: స్లో స్లోగా అప్‌డేట్ వదులుతూ ఆడియన్స్‌లో క్యూరియసిటీ పెంచుతున్న మూవీ టీం తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. మొత్తం చీకట్లో సాగిన ఈ ట్రైలర్ అంచనాలను మించి ఉందంటున్నారు.
Ooru Peru Bhairavakona Trailer: యంగ్ హీరో సందీప్ కిషన్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ఇది. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో మూవీ ఇది. గతంలో ఈ కాంబోలో 'టైగర్' మూవీ వచ్చింది. ఇప్పుడు యాక్షన్ అడ్వెంచర్‌తో రాబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్,ప్రచార పోస్టర్, టీజర్, పాటలు మూవీపై అంచనాలు పెంచాయి. అంతేకాదు ఈ సినిమాలో సందీప్ కిషన్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదలకు ముందే చిత్రపాటలు రికార్డు క్రియేట్ చేశాయి. ఫస్ట్ సాంగ్ 'నిజమే నే చెబుతున్నా..' పాట అయితే యూట్యూబ్‌ని షేక్ చేసింది. సంగీత ప్రియులకు బాగా ఆకట్టుకని మిలియన్ల వ్యూస్ సాధించింది.
దీంతో మూవీపై ఎక్స్‌పెక్టెషన్స్ పెరిగిపోయాయి. కానీ మూవీ టీం మాత్రం స్లో స్లోగా అప్‌డేట్ వదులుతూ ఆడియన్స్‌లో క్యూరియసిటీ పెంచుతున్నారు. ఇటీవల సినిమాను ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ఆఫిషియల్ ఆనౌన్స్‌మెంట్ ఇచ్చింది మూవీ టీం. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. సినీ లవర్స అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ట్రైలర్ తాజాగా లాంచ్ చేశారు. టీజర్, పోస్టర్స్ ఇంటెన్స్ క్రియేట్ చేయడంతో మూవీ స్టోరీపై ఆసక్తికి నెలకొంది. గరుడ పురాణం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న హింట్ ఇచ్చిన కథ ఎంటన్నది క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ట్రైలర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే అంచనాలను మించి ఉందంటున్నారు.
ఉత్కంఠగా సాగిన ట్రైలర్
సినిమాలో ఏం ఉంటుందా? అని ఆసక్తిగా చూస్తున్న ఈ ట్రైలర్ హీరోహీరోయిన్ల లవ్ సీన్‌తో మొదలైంది. అలా కూల్‌గా వెళ్తుందనుకున్న ట్రైలర్‌లో ఒక్కసారి భయంకరమైన వాతావరణం కనిపించింది. విపరీతమైన వాయిలెన్స్, చీకటితో భయపెట్టాడు డైరెక్టర్. ఈ క్రమంలో ఒక గంభీరమైన గొంతు.. "గరుడ పురాణంలో మాయమైన మూడు పేజీలే ఈ భైరవకోన.." అంటూ ఇంటెన్స్ పెంచాడు. ఆ తర్వాత "భగవంతుడి ఆధీనంలో కూడా లేనిదే ఈ కర్మ సిద్ధాంతం.. లిఖించబడిందే జరుగుతుంది.. రక్త పాతం జరగాల్సిందే" అంటూ ఓ ఫిమేల్ వాయిస్‌తో డైలాగ్స్ ఉత్కంఠ పెంచాయి.
ఈ నేపథ్యంలో చీకట్లో దేవుడు విగ్రహం, మంటలు ఇలా ట్రైలర్ మొత్తం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మొత్తంగా ట్రైలర్‌లో ఒక వైపు దైవశక్తి .. మరో వైపున క్షుద్రశక్తి .. ఇంకో వైపు కర్మ సిద్ధాంతం .. ఈ మూడింటి చూట్టూ తిప్పుతూ కథపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ప్రస్తుతం ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది. మొత్తం చీకట్లో సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. ఇది చూసిన మూవీ లవర్స్, నెటిజన్లు సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మొత్తాన్ని దాదాపు చీకట్లోనే చీత్రికరించడం విశేషం.
Also Read: 'గేమ్ ఛేంజర్' అప్డేట్: దసరాని టార్గెట్ గా పెట్టుకున్న రామ్ చరణ్?