అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ravi Teja Ravanasura : 'ప్రపంచంలో 88 శాతం మంది విలన్సే' - బోనులో రవితేజ కామెంట్స్

మాస్ మహారాజా రవితేజ నటించిన 'రావణాసుర' సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో చేసిన ఓ ఫన్నీ ఇంటర్వ్యూని చిత్ర బృందం సోషల్ మీడియాలో వదిలారు.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది చివర్లో 'ధమాకా' చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని 100 కోట్ల క్లబ్ లో చేరాడు. అలానే ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య' వంటి మరో భారీ విజయాన్ని సాధించాడు. ఈ జోష్‌ లో ఇప్పుడు 'రావణాసుర' సినిమాతో హ్యాట్రిక్ హిట్టు కొట్టడానికి వస్తున్నాడు మాస్ రాజా.

స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా 'రావణాసుర' సినిమా తెరకెక్కింది. అక్కినేని యువ హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. అను ఇమాన్యుయేల్ - మేఘా ఆకాష్ - ఫరియా అబ్దుల్లా - దక్ష నగార్కర్ - పూజిత పొన్నాడ వంటి ఐదుగురు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో భాగం అవుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్‌ ను ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

'రావణాసుర' చిత్రం నుంచి ఇది వరకే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. విడుదల తేదీ దగ్గర పడుతుండంతో చిత్ర బృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. రవితేజ అండ్ టీం కలిసి వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా పాపులర్ యాంకర్ సుమతో చేసిన ఓ ఫన్నీ ఇంటర్వ్యూ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

'రావణాసుర' మూవీలో రవితేజ ఒక క్రిమినల్ లాయర్ గా కనిపిస్తాడని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. కోర్టు బ్యాక్ డ్రాప్ లో సీన్స్ ఉన్నట్లు ట్రైలర్ ని బట్టి అర్థమైంది. ఇప్పుడు సుమ ఇదే థీమ్ తో హీరో రవితేజ, డైరక్టర్ సుధీర్ వర్మలను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసింది. దర్శక హీరోలను ముద్దాయిలుగా పేర్కొంటూ, కోర్టు బోనులో విచారణ చేస్తున్నట్లు సాగిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అనే ట్యాగ్ లైన్ తో రావణాసుర చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో.. దీని గురించి సుమ ప్రశ్నించింది. దీనికి రవితేజ సమాధానం చెబుతూ, ఈ ప్రపంచంలో 88 శాతం మంది విలన్సే అని.. కేవలం 12 శాతం మంది మాత్రమే మంచోళ్లు ఉన్నారని అన్నారు. అలానే ఈ చిత్రానికి హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరిలియో వంటి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ను తీసుకోవడం గురించి రవితేజ మాట్లాడారు. మిస్ కమ్యూనికేషన్ కారణంగానే ఇది జరిగినదని చెప్పాడు. నిర్మాత అభిషేక్ నామా ముందుగా హర్షవర్దన్ తో రెండు ట్యూన్స్ చేయించాడని.. తానేమో బీమ్స్ ని సజెస్ట్ చేశానని చెప్పాడు. ఇద్దరూ పాజిటివ్ పీపుల్ కావడంతో, ఇద్దరినీ ఈ సినిమాలో భాగం చేశామని రవితేజ వివరించారు.

Also Read : బాలీవుడ్‌లో ఎన్టీఆర్ భారీ సినిమా - హృతిక్ రోషన్ 'వార్ 2'లో!

కాగా, అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో 'రావణాసుర' చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్ విస్సా కథ అందించడంతో పాటు మాటలు - స్ర్కీన్‌ ప్లే సమకూర్చారు. ఇందులో జయరామ్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా ('అఖండ' ఫేమ్), సత్య, జయ ప్రకాష్, హైపర్ ఆది తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మాస్ రాజా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. 

Also Read : జపాన్‌లో 'రంగస్థలం' రిలీజ్ - ఎప్పుడంటే? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Embed widget