(Source: Poll of Polls)
Ravi Mohan: అతని కోసం రూ.100 కోట్లు అప్పు చేశా - జయం రవి అబద్ధాలు చెబుతున్నారన్న అత్త
Jayam Ravi: కోలీవుడ్ స్టార్ జయం రవి కుటుంబ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. తాజాగా.. ఆయనపై అత్త సుజాత విజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రవి మోహన్ తీరును తప్పుబట్టారు.

Sujatha Vijaykumar About Jayam Ravi Allegations: కోలీవుడ్ స్టార్ జయం రవి కుటుంబ వివాదం ముదురుతోంది. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో సింగర్ కెనీషాతో ఆయన కనిపించిన వేళ రూమర్స్ మొదలయ్యాయి. దీనిపై ఆయన భార్య ఆర్తి రవి స్పందన.. దానికి సింగర్ కౌంటర్.. మళ్లీ జయం రవి స్టేట్‌మెంట్ రిలీజ్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా.. జయం రవిపై ఆయన అత్త, నిర్మాత సుజాత విజయ్ కుమార్ ఆరోపణలు చేశారు.
'రూ.100 కోట్లు అప్పు చేశా'
రవి వల్లే తాను సిని నిర్మాణంలోకి అడుగు పెట్టానని.. అతన్ని అల్లుడిలా కాకుండా కొడుకులా చూశానని సుజాత ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్‌గా అప్పులపాలైనా.. అతనికి విషయం తెలిసి కూడా ఎలాంటి సాయం చేయలేదని ఆరోపించారు. 'జయం రవి మాటల్లో ఎంతమాత్రం నిజం లేదు. తన ప్రోత్సాహం వల్లే నేను సినిమాల్లోకి వచ్చాను. నిర్మాతగా 'అడంగ మరు', 'భూమి', 'సైరన్' మూవీస్ నిర్మించా. ఆ చిత్రాల్లో రవినే హీరోగా చేశాడు. ఈ సినిమా కోసం ఫైనాన్షియర్ల నుంచి రూ.100 కోట్ల అప్పు తీసుకున్నా.
25 శాతం తనకే పారితోషకంగా ఇచ్చా. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అతన్ని కొడుకుగా భావించి ఎప్పుడూ బాధ పడకూడదనుకున్నా. నేను ఒక్కదాన్నే వడ్డీలు కట్టుకునేదాన్ని. అప్పులతో ప్రశాంతత లేని జీవితాన్ని గడిపాను.' అంటూ చెప్పారు.
View this post on Instagram
Also Read: కమల్‌ను చూసి చిరు, బాలయ్య నేర్చుకోవాలా? 'థగ్ లైఫ్'లో ఆ ముద్దులేంటి? రొమాన్స్ ఏంటి?
'అతను ఎప్పుడూ హీరోగానే ఉండాలి'
నష్టాలను పూడ్చేందుకు నా బ్యానర్‌లోనే మరో సినిమా చేస్తానని జయం రవి 'సైరన్' మూవీ టైంలో తనకు మాటిచ్చాడని సుజాత తెలిపారు. కానీ, ఏ చిత్రానికి కూడా సంతకాలు చేయలేదని చెప్పారు. 'అప్పులు తీర్చడానికి కూడా జయం రవి ఎలాంటి సాయం చేయలేదు. నన్ను అమ్మ అని ప్రేమగా పిలిచేవాడు. ఓ అమ్మగా ఈ రోజు నేను కోరుకునేది ఒక్కటే. తనని ఇంతకాలం ఒక హీరోగా చూశా. కానీ సానుభూతి పొందడం కోసం ఇప్పుడు అతను చేసే ఆరోపణలు చూస్తుంటే బాధగా ఉంది. హీరో అనే భావన పోతుంది. అతను ఎప్పుడూ ఓ హీరోగానే ఉండాలని కోరుకుంటున్నా.' అంటూ స్టేట్‌మెంట్‌లో రాసుకొచ్చారు.
అసలేం జరిగిందంటే?
తన భార్య ఆర్తి రవితో డివోర్స్ తీసుకున్నట్లు గతేడాది జయం రవి ప్రకటించారు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో ఆయన సింగర్ కెనీషాతో కలిసి కనిపించగా ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే రూమర్స్ వినిపించాయి. ఇదే టైంలో ఆర్తి రవి తమ విడాకుల కేసు కోర్టులో ఉందని తెలిపారు. జయం రవి తీరును తప్పుబడుతూ పోస్ట్ పెట్టారు. దీనిపై సింగర్ కెనీషా కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత జయం రవి సైతం తనకు కష్ట సమయంలో కెనీషా అండగా నిలిచారంటూ ఇటీవల ఓ పోస్ట్ పెట్టారు. తాజాగా.. జయం రవిపై అత్త ఆరోపణలు చేస్తూ పోస్ట్ పెట్టారు.





















