Sudheer Babu: మరో థ్రిల్లర్ మూవీలో సుధీర్ బాబు - వయలెంట్ లుక్‌లో పోస్టర్ అదుర్స్
Sudheer Babu Survival Thriller: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు మరో సర్వైవల్ థ్రిల్లర్‌కు రెడీ అవుతున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా లేటెస్ట్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది

Sudheer Babu's Latest Survival Thriller First Look Unvieled: ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో, నవ దళపతి సుధీర్ బాబు మరో సర్వైవల్ థ్రిల్లర్‌తో ముందుకొస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
వయలెంట్ లుక్.. ఇంట్రెస్టింగ్..
ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీలో సుధీర్ బాబు (Sudheer Babu) లుక్ అదిరిపోయింది. షర్ట్ లేకుండా సాలిడ్ ఫిజిక్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. మెట్లపై డెడ్‌బాడీస్ పడిపోతుండగా.. చేతిలో ఆయుధంతో వెళ్తున్నట్లుగా ఉన్న పోస్టర్ హైప్ క్రియేట్ చేస్తుంది. 'గాయపడ్డాను కానీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను.' అంటూ మేకర్స్ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీలో రోల్ కోసం సుధీర్ తన ఫిజిక్ మార్చుకుంటూ కండలు తిరిగిన మాచో లుక్‌లోకి మారారు. దీన్ని బట్టి ఆయనది పవర్ ఫుల్ యాక్షన్ రోల్ అని తెలుస్తోంది.
కంటెంట్ బేస్డ్ మూవీస్, భారీ స్థాయిలో మాస్ ఎంటర్‌టైనర్స్ రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన క్రేజీ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తన 51వ చిత్రంగా ఈ మూవీని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి ఆర్ఎస్.నాయుడు దర్శకత్వం వహిస్తుండగా.. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇతర యాక్టర్స్. మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.
Bruised but ready for battle! 💥💥
— People Media Factory (@peoplemediafcy) May 11, 2025
Thrilled to announce our Production No 51. Here's wishing our Nawa Dalapathy @isudheerbabu a very Happy Birthday ❤️🔥
A brutal celebration awaits with #PMFxSB
Produced by @vishwaprasadtg & #KrithiPrasad under @peoplemediafcy
Directed by… pic.twitter.com/c0AGYuyv5v
Also Read: 'ఆపరేషన్ సింధూర్'పై కామెంట్స్ - ఆ హీరోయిన్‌తో మూవీ చేయనన్న హీరో.. హిట్ మూవీ సీక్వెల్ డౌటేనా!
ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ తనదైన యాక్టింగ్, ఎమోషన్‌తో మెప్పిస్తారు సుధీర్ బాబు. ఇటీవల ఆయన నటించిన 'మా నాన్న సూపర్ హీరో' మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ 'జటాధర' తెరకెక్కుతోంది. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా మేళవింపుగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై భారీగా హైప్ పెంచేశాయి.
ఈ మూవీతోనే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇటీవలే ఆమె లుక్ రివీల్ చేయగా ఆకట్టుకుంటోంది. పవర్ ఫుల్ రోల్ ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం బ్యాక్ డ్రాప్‌గా స్టోరీ ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడా అనేది అధికారికంగా ఇంకా టీం ప్రకటించలేదు. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.






















