By: ABP Desam | Updated at : 11 May 2022 11:28 AM (IST)
'మామా మశ్చీంద్ర'లో సుధీర్ బాబు
యువ హీరో సుధీర్ బాబు 15వ చిత్రానికి 'మామా మశ్చీంద్ర' టైటిల్ ఖరారు చేశారు (Sudheer Babu New Movie Update). ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా టైటిల్ వెల్లడించడంతో పాటు ఫస్ట్ లుక్ (Maama Mascheendra First Look) విడుదల చేశారు. ఈ చిత్రానికి నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.
మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే... 'మామా మశ్చీంద్ర'లో సుధీర్ బాబు సరసన ఈషా రెబ్బా, 'గద్దలకొండ గణేష్' ఫేమ్ మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ కామెడీగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇందులో సుధీర్ బాబు డీజే రోల్ చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రెండు భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేశారు. 'మామా మశ్చీంద్ర'తో సుధీర్ బాబుకు నిట్రో స్టార్ అనే బిరుదు ఇచ్చారు.
Also Read: సుధీర్ బాబుతో ఈషా రెబ్బా, మృణాళిని రవి - హైదరాబాద్‌లో
Fun & action have no language barrier 🥳 #MaamaMascheendra!! Also in Hindi this time! 😃 Let's go! 🕺🏻@HARSHAzoomout @chaitanmusic @pgvinda #NarayanDasNarang @puskurrammohan @SVCLLP pic.twitter.com/RIil9JOJYi
— Sudheer Babu (@isudheerbabu) May 11, 2022
'మామా మశ్చీంద్ర' కాకుండా తనకు 'సమ్మోహనం' వంటి సూపర్ హిట్ ఇచ్చిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు మరో సినిమా చేస్తున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' (Aa Ammayi Gurinchi Meeku Cheppali) సంగతి తెలిసిందే. అందులో దర్శకుడి పాత్ర చేస్తున్నారు. సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.
Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో ఫోనులో మాట్లాడిన మహేష్
#AaAmmayiGurinchiMeekuCheppali Team wishes our very own @isudheerbabu garu a very happy and successful year ahead 🎂❤️
— Mythri Movie Makers (@MythriOfficial) May 11, 2022
We are excited to see you in theatres soon! #HBDSudheerBabu #MohanaKrishnaIndraganti @IamKrithiShetty @benchmarkstudi5 pic.twitter.com/pNaBtClkDA
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్‌డేట్, మరీ అంత త్వరగానా?
Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు