News
News
వీడియోలు ఆటలు
X

తెలుగు హీరోలకు అచ్చిరాని ట్రిపుల్ రోల్‌తో సుధీర్ బాబు హిట్ కొడతాడా?

సుధీర్ బాబు క్రొత్త సినిమా ‘మామా మశ్చీంద్ర’. టీజర్లో 3 గెటప్పుల్లో ఆకట్టుకొన్న సుధీర్ బాబు. ఇంతకుముందు ట్రిపుల్ రోల్స్ లో కనపడ్డ స్టార్స్. ఏ హీరోకు కలసి రాని మూడు పాత్రలతో సుధీర్ బాబు హిట్ కొడతాడా ?

FOLLOW US: 
Share:

హంట్ సినిమా లాంటి ఫ్లాప్ తర్వాత సుధీర్ బాబు నటిస్తున్న సినిమా  :మామా మశ్చీంద్ర.  టీజర్ లో మూడు పాత్రల్లో కనిపించి సుధీర్ బాబు సర్ప్రైజ్ చేసాడు . కామెడీ ,రొమాన్స్ .యాక్షన్ లతో సినిమాను దట్టించినట్టు టీజర్ లో తెలుస్తుంది . పైగా మంచి డైలాగ్ రైటర్ గా పేరున్న నటుడు హర్ష వర్ధన్ దీనికి డైరెక్టర్ . సూపర్ స్టార్ మహేష్ స్వయంగా టీజర్ రిలీజ్ చెయ్యడం తో సినిమా పైమంచి అంచనాలు ఏర్పడ్డాయి . అయితే ట్రిపుల్ రోల్ చెయ్యడం తెలుగు హీరోలకు క్రొత్త కాదు . 

సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకూ ట్రిపుల్ రోల్ చేసిన వాళ్ళే

1) ట్రిపుల్ రోల్ తో సెన్సేషన్ సృష్టించిన సీనియర్ ఎన్టీఆర్

1972 లో కులగౌరవం సినిమాలో తొలిసారి మూడు పాత్రల్లో నటించారు ఎన్టీఆర్ . అది 1971 లో అదే పేరుతో వచ్చిన వచ్చిన కన్నడ సినిమాకు రీమేక్ .  అయితే అది జస్ట్  హిట్ అని మాత్రమే అనిపించుకుంది  . కానీ    1977 లో దానవీర శూర కర్ణ సినిమాలో కర్ణుడు ,దుర్యోధనుడు, శ్రీ కృష్ణుడి పాత్రల్లో కనిపిస్తూ మరోవైపు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు . సినిమాలో ఆయన నటన ,డైలాగులు పీక్స్ లో ఉంటాయి . దానితో ఈ సినిమా సూపర్ హిట్ అయింది . 


2) 7సార్లు ట్రిపుల్ రోల్ చేసిన  సూపర్ స్టార్ కృష్ణ :

1978 లో మొదటిసారి కుమార్ రాజా సినిమాలో ట్రిపుల్ రోల్ పోషించిన కృష్ణ ,ఆ తరువాత 1982 లో పగబట్టిన సింహం , డాక్టర్ -సినీ యాక్టర్ సినిమాల్లో మూడు పాత్రల్లో కనిపించారు . 1983 లో సిరిపురం మొనగాడు ,1984 లో రక్త సంబంధం ,బంగారు కాపురం ,1997 లో బొబ్బిలి దొర సినిమాల్లో ట్రిపుల్ రోల్ పోషించారు ఆయన . అయితే వీటిలో కుమార్ రాజా, పగబట్టిన సింహం ,మాత్రమే హిట్ అవగా మిగిలినవి యావరేజ్, ప్లాప్ లుగా మిగిలాయి . 


3) నట భూషణ్  శోభన్ బాబు

1983 లో శోభన్ బాబు ముగ్గురు మొనగాళ్లు సినిమాలో ట్రిపుల్ రోల్ వేశారు కానీ ఆ సినిమా ఆడలేదు . 


4) మెగాస్టార్ చిరంజీవి

1994 లో చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు రిలీజ్ అయింది . ఇందులో ఆయన మూడు పాత్రలు పోషించారు . ఇది ఆయన సొంత సినిమా . అయినప్పటికీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు . ( అయితే అంతకు ముందు 1987లో ఆయన నటించిన ‘దొంగ మొగుడు’ సినిమాలో లాస్ట్ సీన్ లో మూడో చిరంజీవి గా కొన్ని సెకన్ల పాటు కనిపిస్తారు )


5) నటసింహం బాలయ్యకూ అచ్చిరాని ‘అధినాయకుడు’

2012లో వచ్చిన ‘అధినాయకుడు’లో బాలకృష్ణ మూడు పాత్రల్లో కనిపిస్తారు . సినిమాలో డైలాగ్స్ పొలిటికల్ గా సెన్సేషన్ అయినా సినిమా మాత్రం ప్లాప్ అయింది . 


6) తాత తర్వాత మూడు పాత్రల్లో హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్

2017 లో జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ సినిమాలో ట్రిపుల్ రోల్ లో కనపడ్డారు . ఈ సినిమా హిట్ అయింది . పైగా జై పాత్రలో ఎన్టీఆర్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి . 


7) తమ్ముడి రూట్ లోనే అన్న కళ్యాణ్  రామ్

ఈ ఏడాది మొదట్లో కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా విడుదలయింది . దీనిలో అయాన్ మూడు పాత్రల్లో కనిపించారు. బింబిసార లాంటి సూపర్ హిట్ తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ లో వచ్చిన అమిగోస్ ఆ మ్యాజిక్ ను మాత్రం మళ్ళీ రిపీట్ చెయ్యలేక పోయింది . 


వీళ్ళు మాత్రమే కాదు:

కేవలం పైన చెప్పుకున్న హీరోలు మాత్రమే కాదు .. 1987 లో వచ్చిన డ్యామిట్ కథ అడ్డం తిరిగింది సినిమాలో చంద్రమోహన్ , 2019 లో రిలీజ్ అయిన కొబ్బరి మట్ట సినిమాల్లో సంపూర్ణేష్ బాబు లు మూడు పాత్రల్లో కనిపించినా అవి పెద్దగా ఆడలేదు .  

టాలీవుడ్ కు  పెద్దగా అచ్చిరాని మూడు పాత్రల సెంటి మెంట్ ను సుధీర్ బాబు బ్రేక్ చేస్తాడా ?:

టాలీవుడ్ అంటేనే సెంటిమెంట్ లకు పెద్ద అడ్డా . ట్రిపుల్ రోల్ సినిమాలు పెద్దగా ఆడవు అన్నది వాటిలో ఒకటి . ఎక్కువ పాత్రలు ఒకే హీరో పోషిస్తుంటే కథ పలుచన అయిపోతుండడం .. మిగిలిన పాత్రలకు పెద్దగా స్కోప్ లేకపోవడం .. టైట్ స్క్రీన్ ప్లే రాసుకోవడం వీలుకాకపోవడం ఇలాంటి అనేక అంశాల వల్లే ఎక్కువశాతం ఈ తరహా సినిమాలు ఆడవు అన్న అభిప్రాయం సినీ జనాల్లో ఉంది . అయితే కథ నచ్చితే చాలు ఇలాంటి లెక్కలు ఏవీ వేసుకోకుండా దూసుకుపోయే సుధీర్ బాబు ఈ సినిమా తో హిట్ కొట్టితీరుతాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

Also Read : ఈవిల్ డెడ్ రైజ్ రివ్యూ: ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీలో కొత్త సినిమా ఎలా ఉంది? ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిందా?

 

Published at : 23 Apr 2023 10:35 AM (IST) Tags: Sudheer Babu Mama Mascheendra mama mascheendra trailer Heroes three getups Heroes three charectors

సంబంధిత కథనాలు

Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా

Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా

Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?

Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?

Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?

Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?

‘విమానం’ ఎలా ఉంది? అనసూయను తిట్టిస్తున్న విజయ్? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

‘విమానం’ ఎలా ఉంది? అనసూయను తిట్టిస్తున్న విజయ్? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్