Sudheer Babu: సూపర్ స్టార్ కృష్ణ అభిమాని తీసిన సినిమా... టీజర్ విడుదల చేసిన అల్లుడు సుధీర్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ అభిమాని బాబ్జి దర్శకత్వం వహించిన తాజా సినిమా పోలీస్ వారి హెచ్చరిక టీజర్‌ను కృష్ణ చిన్న అల్లుడు, నవ దళపతి సుధీర్ బాబు విడుదల చేశారు.

''మా మావయ్య గారు సూపర్ స్టార్ కృష్ణకు బాబ్జి దగ్గర వాళ్ళు. ఆయన అభిమానులు అందరికీ సుపరిచితులు. అటువంటి బాబ్జి దర్శకత్వం వహించిన 'పోలీస్ వారి హెచ్చరిక' టీజర్‌ను నా చేతుల మీదగా ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని నవ దళపతి సుధీర్ బాబు తెలిపారు.
బాబ్జి దర్శకత్వంలో తూలిక తనిష్క్ క్రియేషన్స్ పతాకం మీద బెల్లి జనార్ధన్ నిర్మించిన సినిమా 'పోలీస్ వారి హెచ్చరిక'. సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, 'శుభలేఖ' సుధాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా సినిమా టీజర్ విడుదల చేశారు. అది చూస్తే...
ఉద్యమాల్లోకి రావాల్సిన యువతను ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తున్నాయని ఆవేదన చెందే సంఘసంస్కర్త పాత్రలో అజయ్ ఘోష్ కనిపించారు. సంఘ విద్రోహ శక్తులు చేసిన పని వల్ల మతి భ్రమించిన యువకుడిగా సన్నీ అఖిల్ నటించారు. ముఖ్యమంత్రి పాత్రలో శుభలేఖ సుధాకర్ కనిపించారు.
తన ప్రతి సినిమా కార్యక్రమాన్ని కృష గారి చేతుల మీద జరపడం అలవాటు అని, ఆయన మన మధ్య భౌతికంగా లేకపోవడంతో సుధీర్ బాబు గారి చేతుల మీదుగా టీజర్ విడుదల చేయడంతో ఆ లోటు తీరిందని బాబ్జి తెలిపారు.
Also Read: విరాటపాలెం వెబ్ సిరీస్ రివ్యూ: కొత్త పెళ్లి కూతుళ్లే టార్గెట్... అమ్మవారి శాపమా? ఆస్తుల కోసం కుట్రా?
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్, జబర్దస్త్ వినోద్, జబర్దస్త్ పవన్, జబర్దస్త్ శాంతి స్వరూప్, హిమజ, శంకరాభరణం తులసి, జయ వాహిని, మేఘనా ఖుషి తదితరులు నటించిన ఈ సినిమాకు కూర్పు: శివ శర్వాణి, కెమెరా: కిషన్ సాగర్, నళినీ కాంత్, సహ నిర్మాత: ఎన్.పి. సుబ్బారాయుడు,సంగీతం: గజ్వేల్ వేణు, నిర్మాణ సంస్థ: తూలికా తనిష్క్ క్రియేషన్స్, నిర్మాత : బెల్లి జనార్థన్, దర్శకుడు: బాబ్జీ.





















