SS Rajamouli : భార్యతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన రాజమౌళి - వైరల్ అవుతున్న వీడియో!
S S Rajamouli : రాజమౌళి దంపతులు తమ ఫ్యామిలీ ఈవెంట్లో కలిసి డాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
SS Rajamouli And Rama Dance At Family Event : ఎస్.ఎస్ రాజమౌళి ఖాళీ సమయంలో తన ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారనే విషయం తెలిసిందే. ఇటీవల 'RRR'తో భారీ పాన్ ఇండియా హిట్ అందుకున్న రాజమౌళి ప్రస్తుతం 'SSMB29' పనులతో బిజీగా ఉన్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టుని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ గ్యాప్ లో రాజమౌళి ఫ్యామిలీలో ఓ చిన్న ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో రాజమౌళి దంపతుల డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
భార్యతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన రాజమౌళి
తాజాగా రాజమౌళి ఫ్యామిలీలో ఓ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో రాజమౌళి తన భార్యతో కలిసి డాన్స్ చేసి అలరించారు. 'అందమైన ప్రేమ రాణి' పాటకి వీరిద్దరూ రొమాంటిక్ డ్యాన్స్ తో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫుల్ వైరల్ గా మారింది. ఈ వీడియోలో రాజమౌళి పాటకు తగ్గట్లు డాన్స్ చేస్తూ తన భార్య రమా చేతులు పట్టుకుని రొమాంటిక్ స్టెప్స్ వెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్టేజిపై రాజమౌళి దంపతులు డాన్స్ చేస్తుంటే అక్కడున్న వాళ్లంతా ఈలలు, కేకలు వేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ అంతా రాజమౌళి దంపతుల డాన్స్ చూసి ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Viral: SS Rajamouli and wife Rama put on their dancing shoes for family event.#Viral #Dance #SSRajamouli #RamaRajamouli pic.twitter.com/r6QvUjo25Z
— IndiaToday (@IndiaToday) April 1, 2024
కొడుకు పెళ్లి తర్వాత మళ్ళీ ఇలా
రాజమౌళి దంపతులు గతంలో వారి కుమారుడు ఎస్. ఎస్ కార్తికేయ వివాహ వేడుకలో కలిసి డాన్స్ చేశారు. ఆ తర్వాత మళ్లీ కలిసి డాన్స్ చేసింది లేదు. కానీ రాజమౌళి మాత్రం 'RRR' సినిమాకి ఆస్కార్ వచ్చిన తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కలిసి 'నాటు నాటు' హుక్ స్టెప్ ని రీ క్రియేట్ చేశారు. కాగా కొడుకు పెళ్లి తర్వాత రాజమౌళి దంపతులు మళ్లీ తమ ఫ్యామిలీ ఈవెంట్లో ఇలా డాన్స్ చేయడం విశేషం.
ప్రీ ప్రొడక్షన్ పనుల్లో 'SSMB29'
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'SSMB29' ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే మూవీ టీం నటీనటులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజిబెత్ ఇస్లాన్ ని తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమెతో పాటూ ఈ ప్రాజెక్టులో మరికొంతమంది హాలీవుడ్ యాక్టర్స్ భాగం కాబోతున్నట్లు సమాచారం. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత కె ఎల్ నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాట్రోగ్రఫర్‌గా వ్యవహరించబోతున్నాడట. ఆర్‌సీ కమల్ కణ్ణన్ వీఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా మోహన్ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు, కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాజమౌళి సతీమణి రమా వ్యవహరించనున్నట్టు సమాచారం.
Also Read : ప్రేమలు డిజిటల్ స్ట్రీమింగ్ - హాట్‌స్టార్‌లో కాదు, ఈ ఓటీటీలో మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగు వెర్షన్ రిలీజ్!