అన్వేషించండి

HanuMan: ‘హనుమాన్’ మూవీ నుంచి ‘శ్రీ రామదూత స్తోత్రం’ విడుదల

Sri Ramadootha Stotram: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమా నుండి శ్రీ రామదూత స్థోత్రం విడుదలయ్యింది.

Sri Ramadootha Stotram from HanuMan Movie: సంక్రాంతి బరిలో దిగనున్న ఎన్నో కమర్షియల్ సినిమాల మధ్య కంటెంట్ మీద నమ్మకంతో ఒక సూపర్ హీరో సినిమా కూడా విడుదల కానుంది. అదే ‘హనుమాన్’. ఒక యంగ్ డైరెక్టర్, యంగ్ హీరో కలిసి ఈ సినిమాను తీర్చిదిద్దారు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’.. జనవరి 12న విడుదల కానుంది. అందుకే మూవీ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఓవైపు దర్శకుడు ప్రశాంత్ వర్మ, మరోవైపు హీరో తేజ సజ్జా.. తమ సినిమా హిట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ‘హనుమాన్’ నుండి ‘శ్రీ రామదూత స్తోత్రం’ విడుదలయ్యింది.

‘హనుమాన్’ నుండి ‘శ్రీ రామదూత స్తోత్రం’..
దేవుడయిన హనుమంతుడిని సూపర్ మ్యాన్‌గా చూపిస్తూ.. ఆ సూపర్ మ్యాన్ పవర్స్ అన్నీ ఒక మనిషికి దక్కితే ఎలా ఉంటుంది అని చెప్పడమే ‘హనుమాన్’ కథ. ఈ మూవీలో తేజ సజ్జాకు జంటగా అమృత అయ్యర్ నటిస్తోంది. ఇక హీరోకు అక్క పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటించింది. తమిళ నటుడు వినయ్ రాయ్.. ఇందులో విలన్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్.. అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తమ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి సంక్రాంతి రేసులో నిలబెడుతున్నామని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా విడుదలయిన ‘శ్రీ రామదూత స్తోత్రం’ కూడా మూవీ లవర్స్‌ను మాత్రమే కాదు.. దైవభక్తులను కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

స్తోత్రమే పాటలా..
‘హనుమాన్’ సినిమాలో ఒక పాటకు విడుదలయిన ఈ శ్రీ రామదూత స్థోత్రాన్ని హనుమంత బడబనల స్తోత్రం నుండి తీసుకున్నారు. ఆ స్థోత్రాన్నే పాటగా మార్చి ‘హనుమాన్’లో చేర్చాడు మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి. ఇక శ్రీ చరణ్ భాస్కరుణి, లోకేశ్వర్ ఏడార, హర్షవర్ధన్ చావలి కలిసి ఈ స్థోత్రాన్ని చాలా ఇంటెన్సిటీతో పాడారు. కంటెంట్‌ను నమ్ముకొని వస్తున్న సినిమా కావడంతో ‘హనుమాన్’లో పెద్దగా పాటలు ఉండవని అర్థమవుతోంది. కానీ ఈ స్తోత్రం మాత్రం సినిమా రేంజ్‌లో వేరే లెవెల్‌కు చేర్చేలా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ‘హనుమాన్’ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో చిరంజీవిని గ్రాఫిక్స్‌లో చూపించారని సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

హనుమాన్ స్టూడియో పేరుతో సెట్..
‘హనుమాన్’ మూవీ తక్కువ బడ్జెట్‌తోనే తెరకెక్కిన టెక్నికల్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు ప్రశాంత్ వర్మ. అందుకే షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా కూడా చాలాకాలంగా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉండిపోయింది ఈ సినిమా. ‘హనుమాన్’ను షూట్ చేయడం కోసం హైదరాబాద్ చివర్లలోనే వట్టినాగులపల్లి అనే ప్రాంతంలో హనుమాన్ స్టూడియో అనే పేరుతో పెద్ద స్టూడియోను ఏర్పాటు చేశారు మేకర్స్. దాంతో పాటు పాడేరు, మారేడుమిల్లి ప్రాంతాల్లో కూడా షూటింగ్ జరిగిందని దర్శకుడు ప్రశాంత్ వర్మ బయటపెట్టాడు. ‘హనుమాన్’ కోసం కేవలం 120 రోజులు షూటింగ్ మాత్రమే జరిగినా.. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్‌కు మాత్రమే చాలా సమయం పట్టిందని మేకర్స్ రివీల్ చేశారు.

Also Read: ఫిమేల్ సూపర్ హీరో కూడా ఉంటుంది, ఇది ఇండియాలో జరిగే కథ కాదు - ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

టాప్ హెడ్ లైన్స్

NTR Trivikram Movie Story : షణ్ముఖుడిగా ఎన్టీఆర్ - త్రిశూలంలో DNA... త్రివిక్రమ్ విజనరీ పోస్టర్ స్టోరీ ఏంటంటే?
షణ్ముఖుడిగా ఎన్టీఆర్ - త్రిశూలంలో DNA... త్రివిక్రమ్ విజనరీ పోస్టర్ స్టోరీ ఏంటంటే?
NTR God Of War : ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ - కుమార స్వామిగా మ్యాన్ ఆఫ్ మాసెస్... మాటల మాంత్రికుడి విజన్ వేరే లెవల్
ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ - కుమార స్వామిగా మ్యాన్ ఆఫ్ మాసెస్... మాటల మాంత్రికుడి విజన్ వేరే లెవల్
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget