Sonia Agarwal - SP Charan: ఇది సోనియాతో ఎస్పీ చరణ్ పెళ్లి ఫోటో కాదు, అసలు విషయం ఏంటంటే?
ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్, '7/జి బృందావన కాలనీ' నాయిక సోనియా అగర్వాల్ పెళ్లి చేసుకోనున్నారని కోలీవుడ్ గుసగుస. అయితే... ఇది వాళ్ళ పెళ్లి ఫోటో కాదు. అసలు విషయం ఏంటంటే...
'7/జి బృందావన కాలనీ' కథానాయిక సోనియా అగర్వాల్ గుర్తు ఉన్నారా? తెలుగు కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేశారు. ఇప్పుడూ ఈ చండీగఢ్ భామ సినీ పరిశ్రమలో నటిగా కొనసాగుతున్నారు. అయితే... మునపటి ఫేమ్ లేదు. అయితే, ఉన్నట్టుండి ఆమె పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వచ్చాయి. అదీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ను. అందుకు కారణం కూడా వాళ్ళిద్దరే!
''ఒక కొత్త ప్రారంభం'' అంటూ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను సోనియా అగర్వాల్, ఎస్పీ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసి చాలా మంది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు. అయితే, అందులో నిజం లేదు. ఒక వెబ్ సిరీస్ కోసం ఇద్దరూ కలిసి పని చేస్తున్నారు. అదీ అసలు సంగతి!
ఎస్పీ చరణ్ గాయకుడు మాత్రమే కాదు... ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా! ఆయన ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. అందులో తెలుగమ్మాయి అంజలి కూడా నటిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడించలేదు గానీ... వెబ్ సిరీస్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. దాంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.
Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
సోనియా అగర్వాల్ విషయానికి వస్తే... తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్‌ను 2006లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2010లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె సింగల్‌గా ఉంటున్నారు. మరో పెళ్లి చేసుకోలేదు. ఎస్పీ చరణ్ విషయానికి వస్తే... నాలుగేళ్ళ వైవాహిక జీవితం అనంతరం 2002లో స్మితతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2012లో అపర్ణను పెళ్లి చేసుకున్నారు.
Also Read : చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా? లేదా?
View this post on Instagram