అన్వేషించండి

Sunainaa: దుబాయ్ యూట్యూబర్‌తో ‘రాజ రాజ చోర’ బ్యూటీ పెళ్లి? అసలు విషయం చెప్పేసిన సునయన

Sunaina Marriage: ‘రాజ రాజ చోర’ లాంటి మూవీతో, ‘ఇన్‌స్పెక్టర్ రిషి’లాంటి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు దగ్గరయిన సునయన.. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని దానికి సంబంధించిన ఫోటోను షేర్ చేసింది.

Actress Sunaina Marrige News: ఈరోజుల్లో ఏ సినీ సెలబ్రిటీకి సంబంధించిన రిలేషన్‌షిప్ గురించి అయినా, బ్రేకప్ గురించి అయినా తెలుసుకోవాలంటే వారి సోషల్ మీడియా చూస్తే చాలు.. అందులోనే చాలావరకు సీక్రెట్స్ బయటపడిపోతాయి. తాజాగా ఒక తమిళ హీరోయిన్ సునయన కూడా యూట్యూబర్‌తో ప్రేమలో ఉందనే గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ప్రేమ గురించి మాత్రమే కాదు.. పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.

క్లారిటీ ఇచ్చింది..

సునయన సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. తన వర్క్‌కు సంబంధించిన అప్డేట్స్ అన్నీ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా తను ఒక వ్యక్తి చేతులు పట్టుకున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలో కేవలం వారిద్దరి చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే తనకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందని అర్థమవుతోంది. ఇక ఫ్యాన్స్ అంతా ఈ విషయంలో కన్‌ఫ్యూజన్‌లో ఉండగా.. వెంటనే దీనిపై క్లారిటీ ఇచ్చింది సునయన. ‘‘నా చివరి పోస్ట్ గురించి కొన్ని ఆర్టికల్స్ వైరల్ అవ్వడం నేను చూశాను. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

నేను ఎంగేజ్డ్..

ఆ తర్వాత తను ఎంగేజ్డ్ అని ప్రకటించింది. ఫ్యాన్స్ చేస్తున్న మెసేజ్‌లకు, విషెస్‌కు థ్యాంక్స్ చెప్పింది. ఇది తనకు చాలా పెద్ద విషయమని స్టేట్‌మెంట్ ఇచ్చింది సునయన. దీంతో అసలు తను ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడం మొదలుపెట్టారు నెటిజన్లు. అందులో భాగంగా అతడు ఒక ఫేమస్ అరబ్ యూట్యూబర్.. ఖలీద్ అల్ అమేరీ అని బయటపడింది. ఇక సునయన చేసిన సోషల్ మీడియాలో పోస్టులు అన్నింటిలో దాదాపుగా ఖలీద్ కామెంట్ ఉంటుంది. దీంతో వీరిద్దరికే ఎంగేజ్‌మెంట్ జరిగిందని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. అంతే కాకుండా సునయన ఎంగేజ్‌మెంట్ అని ఫోటో షేర్ చేసిన రోజే.. దాదాపుగా అలాంటి ఫోటోనే ఖలీద్ కూడా షేర్ చేశాడు.

రీసెంట్‌గా విడాకులు..

సునయన, ఖలీద్ అల్ అమేరీ.. ఎంగేజ్‌మెంట్ విషయాన్ని ప్రకటించారు కానీ వీరిద్దరికే ఎంగేజ్‌మెంట్ జరిగింది అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఖలీద్‌కు ఇంతకు ముందే సల్మా అనే మహిళతో పెళ్లి జరిగింది. కానీ తాజాగా వీరిద్దరూ విడిపోయినట్టుగా సల్మా ప్రకటించింది. ఒక యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల వల్ల మళ్లీ తను స్వతంత్ర్యంగా జీవించడం మొదలుపెట్టానని చెప్పింది. విడాకులు తీసుకున్న కొన్నిరోజుల్లోనే సునయనను ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు ఖలీద్. సునయన చివరిగా ‘ఇన్‌స్పెక్టర్ రిషి’ అనే వెబ్ సిరీస్‌లో నటించి అందరినీ అలరించింది. ఇప్పటికీ తనను చాలామంది ప్రేక్షకులు ‘రాజ రాజ చోర’ మూవీతోనే గుర్తుపెట్టుకున్నారు.

Also Read: వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ సంగీత్ ఫొటోలు లీక్ చేసిన త్రిష

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sigma Release Date : సీఎం విజయ్ కుమారుడు డైరెక్షన్ డెబ్యూ - సందీప్ కిషన్ సిగ్మా రిలీజ్ డేట్
సీఎం విజయ్ కుమారుడు డైరెక్షన్ డెబ్యూ - సందీప్ కిషన్ సిగ్మా రిలీజ్ డేట్
Lokesh Kanagaraj : MCUలో లోకేశ్ కనగరాజ్ - కాటాలన్ క్లైమాక్స్‌లో బిగ్ సర్ప్రైజ్
MCUలో లోకేశ్ కనగరాజ్ - కాటాలన్ క్లైమాక్స్‌లో బిగ్ సర్ప్రైజ్
Peddi Movie : ఫ్యూచర్ కర్ణాటక సీఎం ఉపేంద్ర - శివరాజ్ కుమార్ రియాక్షన్
ఫ్యూచర్ కర్ణాటక సీఎం ఉపేంద్ర - శివరాజ్ కుమార్ రియాక్షన్
Peddi Tickets : ఏపీలో పెద్ది టికెట్ ధరలు పెరిగాయ్ - అబ్బాయ్ సినిమాకు బాబాయ్ జీవో జారీ
ఏపీలో పెద్ది టికెట్ ధరలు పెరిగాయ్ - అబ్బాయ్ సినిమాకు బాబాయ్ జీవో జారీ

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Pre Diabetic Care : ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
Embed widget