అన్వేషించండి

Varalaxmi Sarathkumar: వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ సంగీత్ ఫొటోలు లీక్ చేసిన త్రిష

Varalaxmi Sarathkumar Sangeeth: వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్, నికోలాయ్ సచ్ దేవ్ పెళ్లి హ‌డావుడి మొద‌లైపోయింది. సంగీత్ ని ధూమ్ ధామ్ గా చేశారు. కార్య‌క్ర‌మానికి హాజ‌రైన త్రిష ఫొటోలు షేర్ చేశారు.

Varalaxmi Sarathkumar Wedding: వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, నికోలాయ్ స‌చ్ దేవ్ లు పెళ్లితో ఒక‌టి కాబోతున్నారు. వాళ్లు పెళ్లి హ‌డావుడి మొద‌లై పోయింది. జులై 4న ఇద్ద‌రు పెళ్లితో ఒక‌టి కానుండ‌గా.. దానికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ పార్టీలు ధూమ్ ధామ్ గా చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ సంగీత్ కి హాజ‌రైన హీరోయిన్ త్రిష ఫొటోల‌ను షేర్ చేశారు. ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. 

చెన్నైలో సంగీత్.. 

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, నికోల‌య్ స‌చ్ దేవ్ ల సంగీత్ చెన్నైలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి త్రిష హాజ‌రై సంద‌డి చేశారు. ఆ ఫొటోల‌ను షేర్ చేశారు ఆమె. ఈ కార్య‌క్ర‌మానికి త్రిష‌తో పాటు మంచు ల‌క్ష్మీ, విష్ణు, విశాల్ త‌దిత‌రులు హాజ‌రై సంద‌డి చేశారు. అంద‌రూ క‌లిసి పాట‌ల‌కు డ్యాన్స్ చేసి ఆడి పాడారు. ఇక ఈ సంగీత్ కి బ్లింగ్ థీమ్ లో అంద‌రూ హాజ‌ర‌య్యారు. వ‌ర‌ల‌క్ష్మీ చ‌క్క‌గా లంగా ఓణీలో మెరిసిపోయారు. ఇక త్రిష కూడా గ్రాండ్ గాగ్ర‌, దుప‌ట్టాతో మెరిసిపోయింది. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, రాధిక శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రుల‌తో దిగిన ఫొటోల‌ను షేర్ చేసింది త్రిష‌. 

ఇక ఇదే ఈవెంట్ లో రాధిక శ‌ర‌త్ కుమార్ బ్లూ క‌ల‌ర్ డ్రెస్ లో గార్జియ‌స్ గా క‌నిపించారు. ఆమె కూతురు కూడా పింక్ క‌ల‌ర్ డ్రెస్ లో భ‌లే అందంగా ఉన్నారు. ఇదిలా ఉంటే..జూన్ 30న వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ మెహందీ ఫంక్ష‌న్ గ్రాండ్ గా జ‌రిగింది. దానికి వ‌ర‌ల‌క్ష్మీ ఎల్లో క‌ల‌ర్ డ్రెస్ వేసుకుని, స్పెష‌ల్ జ్యూయ‌ల‌రీ వేసుకుని సూప‌ర్ గా క‌నిపించారు.
Varalaxmi Sarathkumar: వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ సంగీత్ ఫొటోలు లీక్ చేసిన త్రిష

జులై 4న పెళ్లి? 

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ క‌మార్ పెళ్లి జులై 4న థాయ్ లాండ్ లో జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి పెళ్లి డేట్ కి సంబంధించి ఎక్క‌డా అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. ఇక కేవ‌లం బంధువులు, ద‌గ్గ‌రి స‌న్నిహితులు మాత్ర‌మే పెళ్లికి హాజ‌రుకానున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఆ త‌ర్వాత చెన్నైలో గ్రాండ్ గా రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్నార‌ట‌. దానికి క‌మ‌ల్ హాస‌న్, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, కొంత‌మంది తెలుగు యాక్ట‌ర్లు కూడా హాజ‌రవుతార‌ని తెలుస్తోంది. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని స‌న్నిహితులు చెప్తున్నారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, స‌చ్ దేవ్, రాధిక శ‌ర‌త్ కుమార్, శ‌ర‌త్ కుమార్ స్వ‌యంగా ప్ర‌ధానిని క‌లిసి రిసెప్ష‌న్ కి ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. 

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. విల‌న్ గా, పోలీస్ ఆఫీస‌ర్ గా, అక్క‌గా ఎన్నో క్యారెక్ట‌ర్లు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు ఆమె. ఇక త‌న చిర‌కాల స్నేహితుడు స‌చ్ దేవ్ తో ఆమె నిశ్చితార్థం మార్చి 30న ముంబైలో జ‌రిగిన విష‌యం తెలిసిందే. స‌చ్ దేవ్ కి ఇది రెండో పెళ్లి. ఆయ‌న గ‌తంలో పెళ్లై 15 ఏళ్ల కూతురు కూడా ఉంది.

Also Read: చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ

టాప్ హెడ్ లైన్స్

Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Mrunal Thakur: లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
Priyanka Chopra: సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్
సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Embed widget