అన్వేషించండి
Advertisement
Soul Of Satya: రామ్ చరణ్ చేతుల మీదుగా ‘సోల్ ఆఫ్ సత్య’ విడుదల, సైనికుల జీవితాలకు అద్దంపట్టే పాట
అప్పుడే పెళ్లయిన ఒక కొత్త జంట మధ్య జరిగే చిన్న చిన్న సరదాల దగ్గర నుండి మొదలయిన ఈ వీడియో సాంగ్.. తర్వాత ఎన్నో ములపులు తిరుగుతూ మన సైనికుల జీవితాల దగ్గర ఆగిపోతుంది.
హిందీలో ఆల్బమ్ సాంగ్స్ అనేవి చాలా కామన్. పైగా సినిమా పాటల రేంజ్‌లో ఈ ఆల్బమ్ సాంగ్స్ అనేవి తెరకెక్కుతుంటాయి. కానీ తెలుగులో అలాంటివి చాలా తక్కువ. తాజాగా ‘సోల్ ఆఫ్ సత్య’ పేరుతో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా దేశం కోసం పోరాడుతున్న ఎంతోమంది సైనికులకు, వారి కుటుంబాలకు ఒక ప్రత్యేకమైన సాంగ్‌ను డెడికేట్ చేశాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సాంగ్‌లో సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా స్వాతి నటించింది. అప్పుడే పెళ్లయిన ఒక కొత్త జంట మధ్య జరిగే చిన్న చిన్న సరదాల దగ్గర నుండి మొదలయిన ఈ వీడియో సాంగ్.. తర్వాత ఎన్నో ములపులు తిరుగుతూ మన సైనికుల జీవితాల దగ్గర ఆగిపోతుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘సోల్ ఆఫ్ సత్య’ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.
రామ్ చరణ్ చేతుల మీదుగా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీద ‘సోల్ ఆఫ్ సత్య’ లాంచ్ అయ్యింది. సాంగ్‌ను లాంచ్ చేసినందుకు సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ‘థ్యాంక్యూ చరణ్. నువ్వు ఈ కావ్యాన్ని సరిహద్దులు దాటి ఎంతో దూరాన ఉన్న హీరోల దగ్గరకు తీసుకెళ్లావు. ఇదే సోల్ ఆఫ్ సత్య. మా మనసులు దీనిని ప్రేమించినట్టుగా మీరు కూడా ప్రేమిస్తారని అనుకుంటున్నాను.’ అంటూ ట్వీట్ చేశాడు సుప్రీమ్ హీరో. ‘సోల్ ఆఫ్ సత్య’ కోసం స్వాతి, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి జతకట్టారు. వీరు పెయిర్ చూడడానికి చాలా రిఫ్రెషింగ్‌గా, క్యూట్‌గా అనిపిస్తుందని అప్పుడే నెటిజన్లు వీరి జంటకు వందకు వంద మార్కులు వేసేస్తున్నారు.
శృతి రంజనీ ప్రయాణం..
ముందుగా బుల్లితెరపై వచ్చే పలు మ్యూజిక్ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమయిన శృతి రంజనీ.. ఒక్కసారిగా ‘సోల్ ఆఫ్ సత్య’కు మ్యూజిక్‌ను అందించే స్థాయికి ఎదిగిపోయింది. ఈ పాటకు తను మ్యూజిక్‌ను కంపోజ్ చేయడం మాత్రమే కాదు.. తానే స్వయంగా పాడింది కూడా. అంతే కాకుండా లిరిక్స్ విషయంలో కూడా శృతి తనవంతు సాయం చేసింది. మ్యూజిక్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటి నుండే శృతి దగ్గర అంతులేని టాలెంట్ ఉందని ఎంతోమంది ప్రముఖుల దగ్గర నుండి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఆ టాలెంట్‌ను నిరూపించుకోవడం కోసం ‘సోల్ ఆఫ్ సత్య’ లాంటి అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని తను పూర్తిస్థాయిలో వినియోగించుకుంది అని మ్యూజిక్ లవర్స్ తనకు మంచి మార్కులే వేస్తున్నారు.
ఎంతోమందికి కొత్తగా అవకాశం..
‘సోల్ ఆఫ్ సత్య’కు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ దీనిని నిర్మించింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. ఈ పాట ఒకేసారి తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదలయ్యింది. శృతి రంజనీ లాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్స్‌కు ఈ పాట.. ఎన్నో విధాలుగా అవకాశాలను అందించింది. మనసుకు హత్తుకుపోయే డైలాగ్స్ కూడా ఈ పాటను చాలామందికి దగ్గర చేసే విధంగా ఉంది. ముఖ్యంగా చాలారోజుల తర్వాత కలర్స్ స్వాతి స్క్రీన్‌పై కనిపించడంతో తనను అభిమానించే ప్రేక్షకులంతా చాలా సంతోషిస్తున్నారు. ఒకప్పుడు పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మన తెలుగింటి అమ్మాయిగా వెలిగిపోయిన స్వాతి.. ‘సోల్ ఆఫ్ సత్య’తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందని వారంతా ఆశిస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement