అన్వేషించండి

Sonu Sood: ఏపీ విద్యార్థిని చదువుకు బాధ్యత తీసుకున్న సోనూ సూద్ - మరోసారి రియల్ హీరో అనిపించుకున్న రీల్ విలన్

Sonu Sood: ఇప్పటికే ఎన్నో వేలమందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్. తాజాగా ఏపీలో ఒక విద్యార్థిని చదువు కోసం ఇబ్బందిపడుతుందని తెలిసి తనకు సాయం చేస్తానని మాటిచ్చారు.

Sonu Sood: ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిస్తే కొందరు సినీ సెలబ్రిటీలు సాయం చేయడానికి ముందుంటారు. అలా కోవిడ్ సమయంలో చాలామంది వలస కార్మికులకు, పేదవారికి సాయం చేసి అందరి దృష్టిలో రియల్ హీరోగా మారారు సోనూ సూద్. అప్పటినుండి ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు.. తనకు కుదిరినంత వరకు వారికి సహాయపడుతున్నారు. ఇప్పటికీ సోనూ సూద్ సహాయ కార్యక్రమాలు ఆపడం లేదు. సోషల్ మీడియాలో ఆయనను ట్యాగ్ చేసి ఎవరు సాయం అడిగినా ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన మరొకటి జరిగింది.

ఆర్థికంగా సాయం..

చాలామందికి చదువుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో చదువును మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని బనవనూరుకు చెందిన మాదిగ దేవీ కుమారి అనే అమ్మాయికి కూడా అదే పరిస్థితి. తనకు బీఎస్‌సీ చదవాలని ఉన్నా కూడా పేదరికం వల్ల ఫీజు కట్టే పరిస్థితి లేక తన చదువు ఆగిపోయింది. తనకు ఎవరైనా ఆర్థికంగా సాయం చేస్తారేమో అని ఎదురుచూడడం మొదలుపెట్టింది. దీంతో ఒక నెటిజన్.. దేవీ కుమారి పరిస్థితిని చూసి, దానిగురించి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. తన ఆర్థిక పరిస్థితి గురించి, తన కష్టాల గురించి దేవీ కుమారి.. ఆ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. దీంతో సోనూ సూద్ హృదయం కరిగింది.

ప్లీజ్ సాయం చేయండి..

‘తను ఆంధ్రప్రదేశ్‌లోని బనవనూర్‌కు చెందిన మాదిగ దేవీ కుమారి. తను చాలా పేద కుటుంబానికి చెందింది. బీఎస్‌సీ చదువుకోవాలని అనుకుంటోంది. మీరు ఏదైనా చేయగలరు సోనూ సార్. ప్లీజ్ ఈ అమ్మాయికి హెల్ప్ చేయండి’ అంటూ సోనూ సూద్‌కు ఈ సమాచారాన్ని అందించారు ఆ నెటిజన్. దీంతో సోనూ సూద్ కూడా వెంటనే స్పందించారు. ‘తనకు నచ్చిన కాలేజ్‌లో అడ్మిషన్ వచ్చేలాగా నేను చూస్తాను’ అని మాటిచ్చారు. దీంతో సోనూ సూద్ మంచి మనసుకు నెటిజన్లంతా మరోసారి ఫిదా అవుతున్నారు. ఇప్పటికీ ఎవరికి ఏం కష్టం వచ్చినా ఆయనను ట్యాగ్ చేస్తే చాలు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డైరెక్టర్‌గా కూడా..

ఇక సోనూ సూద్ సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. అంతే కాకుండా హిందీలో ‘ఫతే’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు ఆయన స్వయంగా నటించారు. సైబర్ నేరస్తుల గురించి ప్రేక్షకుల్లో అవగాహన తీసుకొని రావడం కోసం దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సైబర్ నేరాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సోనూ సూద్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Also Read: కన్వార్ యాత్ర వివాదంపై సోనూ సూద్‌ ట్వీట్‌, కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్

టాప్ హెడ్ లైన్స్

Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Nandamuri Deepika: నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget