బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కి దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

అప్పటివరకు ఓ నటుడిగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ కరోనా టైంలో లక్షల మందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు.

అప్పటినుంచి ఇప్పటికీ తన సేవాభావాన్ని సందర్భానుసారం ప్రదర్శిస్తూనే వస్తున్నారు.

ముఖ్యంగా పేదవారికి, పూట గడవడం కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అండగా నిలుస్తున్నారు.

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ప్రజలకు తన వంతు సాయం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా వీధిలో సోనూ సూద్ ఏకంగా దోశలు వేశారు.

సోను సూద్ స్వయంగా దోశలు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Photo Credit : Sonu Sood/Instagram