రొమాంటిక్ డ్యాన్స్ తో అదరగొట్టిన వరుణ్, వితికా! వరుణ్ సందేశ్, వితికా జంటకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వరుణ్, వితికా హీరో, హీరోయిన్లుగా 'పడ్డానండి ప్రేమలో' అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరు నిజంగానే ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రస్తుతం వరుణ్ సందేశ్ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు. వితికా షేరు సొంతంగా యూట్యూబ్ ఛానల్ తో పాటూ, అప్పుడప్పుడు పలు టీవీ షోల్లో మెరుస్తోంది. తాజాగా వరుణ్ సందేశ్, వితికాల రొమాంటిక్ డాన్స్ వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. దీనిపై మీరు ఓ లుక్కేయండి. Photo Credit : Vithika Sheru/Instagram