Sonakshi Sinha Marriage: ఆ పుకార్లకు చెక్, సోనాక్షి పెళ్లికి అంతా సిద్ధం - తల్లితో కలిసి పూజ చేసిన నటి
Sonakshi Sinha Wedding Arrangements: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పెళ్లికి అంతా సిద్ధమైంది. ఆ రూమర్లకు చెక్ పెడుతూ ఈ తన ఇంటికి చేరుకుంది. అంతేకాదు తల్లితో కలిసి ఆమె పూజలో పాల్గోంది.

Sonakshi Sinha Reached to Her Home: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన లేదు. కానీ బాలీవుడ్‌లో మీడియాలో మాత్రం సోనాక్షి, జహీర్ పెళ్లంటూ గట్టి ప్రచారం జరుగుతుంది. ఇక ఆమె పెళ్లి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మరోవైపు తన కుటుంబానికి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
సోనాక్షి పెళ్లి విషయంలో ఆమె ఫ్యామిలీ అయిష్టంతో ఉందని, ఇక్బాల్‌తో సోనాక్షి పెళ్లికి నిరాకరించినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కొద్ది రోజుల కిందట తన కూతురి పెళ్లిపై ఆమె తండ్రి శత్రఘ్న సిన్హాని అడగ్గా.. ఏమో తనకి తెలియదని, తన కూతురు పెళ్లికి తనకే ఆహ్వానం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సమాధానం విని అంతా కంగుతిన్నారు. దీంతో రకరకాల వార్తలు మొదలయ్యాయి. ఫ్యామిలీకి ఇష్టం లేకుండా వారి నిర్ణయానికి వ్యతిరేకంగా సోనాక్షి పెళ్లి చేసుకుందంటూ కథనాలు వచ్చాయి. అంతేకాదు సోనాక్షిని ఆమె తల్లి, సోదరుడు సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసినట్టు ప్రచారం జరిగింది. ఇక వీటన్నింటికి తాజాగా ఫుల్‌స్టాప్ పడింది. తన ఇంట్లోనే సోనాక్షి పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి.
తన పుట్టింట్లోనే పెళ్లి కూతురు అవుతుంది. అంతేకాదు వివాహానికి ముందు జరిగే పూజల్లో తన తల్లితో పాటు పాల్గొని సోనాక్షి పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పెళ్లి, రిసెప్షన్‌కి వేడుకలకు సంబంధించిన కాస్ట్యూమ్స్ కూడా సిద్ధమయ్యాయి. వధువరుల పెళ్లి బట్టలు శత్రఘ్న సిన్హా ఇంటికి చేరుకున్నాయి. మొత్తానికి సోనాక్షి పెళ్లి తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరగబోతుంది. దీంతో ఆమె పెళ్లిపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పడినట్టుయ్యింది. కాగా మొన్నటి వరకు పెళ్లి వేడుకలు జరుగుతున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
View this post on Instagram
నిన్న సోనాక్షి మహెందీ వేడుకకు సంబంధించిన ఫోటో బయటకు వచ్చింది. సైలెంట్‌గా జరిగిన ఈ మహేందీ వేడుకకు సంబంధించిన ఫోటోను సోనాక్షి-జహీర్‌ల కామన్ ఫ్రెం్ జాఫర్ అలీ మున్హీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. దీంతో క్షణాల్లో ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఈ జంట సన్నిహితులు, స్నేహితులు కనిపించారు. ఇక బ్యాగ్రౌండ్‌లో ఉన్న డెకరేషన్ చూస్తుంటే ఇది కపుల్ మహేందీ ఫంక్షన్ అని తేలిపోతుంది. ఇక మొత్తానికి సోనాక్షి, జహీర్ వివాహం కన్‌ఫాం కావడంతో ఈ జంట ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. దీంతో ఈ జంటకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా వీరి పెళ్లి రేపు అంటే జూన్ 23న ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితులు మధ్య జరగనుందని సన్నిహితవర్గాల నుంచి సమాచారం.
Also Read: 'కల్కి 2898 AD' రిలీజ్ ట్రైలర్‌పై డైరెక్టర్ రాజమౌళి రివ్యూ - ఏమన్నారంటే..
Before You Go
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
ట్రెండింగ్ వార్తలు





















