Ram Charan in Vizag: వైజాగ్‌లో రామ్ చరణ్ క్రేజ్ చూసి షాక్ అయిన SJ సూర్య - వీడియో వైరల్!
Ram Charan: 'గేమ్ చేంజర్' షూటింగ్ కోసం వైజాగ్ వచ్చిన రామ్ చరణ్ ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అది చూసి ఎస్ జె సూర్య షాక్ అయిపోయారు.

Ram Charan's Craze In Vizag : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా 'RRR' మూవీ తర్వాత చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరుకుంది. ఇక ప్రస్తుతం ఈ హీరో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో ప్లాన్ చేశారు. ఇందుకోసం చరణ్ తో పాటు సినిమాలో నటిస్తున్న ప్రధాన తారాగణం వైజాగ్ కి చేరుకున్నారు. రామ్ చరణ్ వైజాగ్ వస్తున్నాడనే విషయం తెలియడంతో భారీ ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు. ఈ క్రమంలోనే వైజాగ్ లో రామ్ చరణ్ క్రేజ్ చూసి కోలీవుడ్ యాక్టర్ కం డైరెక్టర్ SJ సూర్య షాక్ అయ్యారు.
వైజాగ్‌లో 'గేమ్ ఛేంజర్' షూటింగ్
'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్ వైజాగ్ లో మార్చి 15 నుంచి జరగనుంది. అక్కడి ఆర్కే బీచ్ లో సుమారు 5 రోజులపాటు కీలక షెడ్యూల్ ని ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే బీచ్ లో పొలిటికల్ మీటింగ్ కు సంబంధించి భారీ సెట్ ని కూడా నిర్మించారు. ఈ షూటింగ్లో రామ్ చరణ్ తో పాటు సినిమాలో నటిస్తున్న ప్రధాన తారాగణం భాగం కానున్నారు. ఈ షూటింగ్ కోసం నిన్నే మూవీ టీం వైజాగ్ చేరుకుంది.
Game - Changer Arrived in VIZAG@AlwaysRamCharan #RAMCHARANAtHisFortVIZAG #GameChanger #RamCharan pic.twitter.com/EhN3dCKFOy
— Always RC (@Shaik_usman83) March 14, 2024
చరణ్ క్రేజ్ చూసి షాక్ అయిన SJ సూర్య
'గేమ్ ఛేంజర్' లేటెస్ట్ షెడ్యూల్ కోసం రామ్ చరణ్, ఎస్. జె సూర్య తో పాటు మరికొంతమంది నటీనటులు వైజాగ్ చేరుకున్నారు. రామ్ చరణ్ వైజాగ్ వస్తున్నాడని తెలియడంతో ఎక్కడెక్కడనుంచో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. నిన్న సాయంత్రం వైజాగ్ ఎయిర్ పోర్ట్ వద్ద తమ అభిమాన హీరో కోసం పడిగాపులు కాశారు. ఇక చరణ్ రాగానే ఎయిర్ పోర్ట్ అంతా మెగా ఫ్యాన్స్ తో నిండిపోయింది. కొంతమంది అభిమానులు చరణ్ రావడంతో ఒక్కసారిగా ఆయన దగ్గరికి వెళ్లి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, సెక్యూరిటీ దీన్ని గుర్తించి చరణ్ ని కార్ వద్దకు తీసుకెళ్లారు. తన కోసం వచ్చిన ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ్వకుండా చరణ్ వెళ్లే ముందు ఫ్యాన్స్ కి అభివాదం చేశారు. ఇక చరణ్ తో పాటు వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఎస్. జె సూర్య ఫ్యాన్స్ కోలాహలం చూసి షాక్ అయిపోయారు. రామ్ చరణ్ పై ఫ్యాన్స్ కి ఉన్న ప్రేమకు దాసోహం అవుతూ అలా చూస్తూ ఉండిపోయారు. అనంతరం ఎస్. జె సూర్య ని చూసిన ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
.@iam_SJSuryah Be Like : Rey Evarra Meerantha 😂🔥
— Hemanth RC ™ (@Hemanth_RcCult) March 15, 2024
Papam Naligipoyadu maa Madhyalo.#RamCharan #GameChanger pic.twitter.com/IKHib9kErc
చరణ్ బర్త్ డేకు 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ సింగిల్
ఈనెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 'గేమ్ చేంజర్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా ఓ సింగింగ్ షోలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం కన్ఫామ్ చేశారు. చరణ్ బర్త్ డే కి 'గేమ్ చేంజర్' ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ స్వయంగా తమన్ చెప్పడంతో ఫ్యాన్స్ ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా మార్చి 19 వరకు వైజాగ్ లో 'గేమ్ ఛేంజర్' షూటింగ్ జరగనుంది. మే నెలలోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : ‘హాయ్ నాన్న’ భామతో ఆనంద్ దేవరకొండ జోడీ - ఫస్ట్ లుక్ రిలీజ్





















