అన్వేషించండి

Amaran Teaser: శివకార్తికేయన్, సాయి పల్లవిల ‘అమరన్’ టీజర్ : స్టంట్స్ అదుర్స్ అంతే!

Sivakarthikeyan: శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ ‘అమరన్’ సినిమా టీజర్ విడుదలయ్యింది. ఇందులో ఈ హీరో ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా ఇదొక బయోపిక్ అని అర్థమవుతోంది.

Amaran Movie Teaser Out Now: ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన కథల్లో నటిస్తూ.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలి అనుకునే హీరోలు చాలామంది ఉంటారు. అందులో ఒకరు తమిళ నటుడు శివకార్తికేయన్. ఈ హీరో తన కెరీర్‌లో పలు కమర్షియల్ సినిమాల్లో నటించాడు. కామెడీ సినిమాలతో ఎంటర్‌టైన్ చేశాడు. కానీ మధ్యమధ్యలో ప్రయోగాత్మక కథలను కూడా ఓకే చేస్తుంటాడు శివకార్తికేయన్. ఇక ఫిబ్రవరీ 17న శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ ‘అమరన్’ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శివకార్తికేయన్ ఒక ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. యాక్షన్ ప్యాక్డ్‌గా విడుదలయిన ఈ టీజర్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

బయోపిక్..

చాలామంది శివకార్తికేయన్ ఫ్యాన్స్.. తన 21వ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. వారందరికీ ‘అమరన్’ టీజర్ ఫుల్ ఫీస్ట్‌ను ఇచ్చింది. ‘అమరన్’ అంటే నిరంతరం యుద్ధం చేసేవాడని అర్థం. ఇక టైటిల్‌కు తగినట్టుగానే ఆర్మీ ఆఫీసర్‌గా ఎప్పుడూ ఫైట్ చేస్తూ.. తన టీమ్‌లో ఉన్నవారిని ప్రోత్సహిస్తూ ఉంటాడు హీరో. 1.5 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌లో ముకుంద్ వీ అనే మేజర్ జనరల్ పాత్రలో శివకార్తికేయన్ కనిపించాడు. ఇది ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ మూవీ.

సౌత్ కశ్మీర్ ఉగ్రవాదులతో యుద్ధం..

కశ్మీర్‌లోని షాపియన్ బ్యాక్‌డ్రాప్‌లో ‘అమరన్’ చిత్రం తెరకెక్కినట్టు అర్థమవుతోంది. కశ్మీర్‌లోని మిలటరీ క్యాంప్స్‌ను, అక్కడి సైనికుల జీవితాలను సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి. ముకుంద్ వరదరాజన్ లీడ్ చేసే ‘రాష్ట్రీయ రైఫల్స్’ అనే టీమ్‌కు, సౌత్ కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు మధ్య జరిగే యుద్ధంపై ‘అమరన్’ కథ ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. స్టీఫెన్ రిచర్ తెరకెక్కించిన మిలటరీ రేంజ్ స్టంట్స్ యాక్షన్ మూవీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకోనున్నాయి. ఈ సినిమాకు జీవి ప్రకాశ్‌తో పాటు సీహెచ్ సాయి, కలైవన్నన్ కూడా సంగీతాన్ని అందించారు. టీజర్‌లో విజువల్స్‌కు తగినట్టుగా మ్యూజిక్ కూడా బాగుందని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. 

కమల్ హాసన్ సాయంతో..

‘అమరన్’లో శివకార్తికేయన్‌కు జంటగా సాయి పల్లవి నటిస్తోంది. రాహుల్ బోస్, లల్లూ, మీర్ సల్మాన్, గౌరవ్ వెంకటేశ్ లాంటి ఇతర నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. 2024 చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మొత్తంగా అయిదు భాషల్లో ‘అమరన్’ విడుదల కానుందని సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్.. ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం విశేషం. గతేడాది శివకార్తికేయన్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందని కోలీవుడ్‌లో వార్తలు వైరల్ కాగా.. అదొక మల్టీ స్టారర్ మూవీ అయ్యిండవచ్చని ప్రేక్షకులు ఆశించారు. కానీ కమల్ హాసన్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాలో శివకార్తికేయన్ నటిస్తున్నాడని ఎవరూ ఊహించలేదు. ఇటీవల ‘అయలాన్’ అనే చిత్రంతో క్లీన్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు శివకార్తికేయన్.

Also Read: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న 'రాజా సాబ్' బ్యూటీ - ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
Fact Check : జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
Ramayan Leaks: రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
YS Jagan Bandage :  బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Announces YSRCP Manifesto 2024 | ఎన్నికల కోసం వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించిన సీఎం జగన్ |ABPCM Jagan on AP Roads | ఏపీలో రోడ్ల దుస్థితిపై మాట్లాడిన సీఎం జగన్ | ABP DesamCM Jagan on Three Capitals | పరిపాలనా రాజధానిగా విశాఖ సీఎం జగన్ మరోసారి క్లారిటీ | ABP DesamCM Jagan on TDP Super Six | టీడీపీ సూపర్ సిక్స్ అమలు కాని పని అంటున్న సీఎం జగన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
Fact Check : జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
Ramayan Leaks: రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
YS Jagan Bandage :  బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Water Crisis: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో నీటి కరవు, బెంగళూరు కన్నా దారుణ పరిస్థితులు తప్పవా?
Water Crisis: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో నీటి కరవు, బెంగళూరు కన్నా దారుణ పరిస్థితులు తప్పవా?
Best Horror Movies on OTT: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
IPL 2024: ఢిల్లీదే బ్యాటింగ్‌, బౌండరీల జాతరేనా?
ఢిల్లీదే బ్యాటింగ్‌, బౌండరీల జాతరేనా?
Embed widget