Sivakarthikeyan: శివకార్తికేయన్ మూడో బిడ్డకు టాలీవుడ్ స్టార్ హీరో పేరు - ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ ఎమోషనల్ పోస్ట్
Sivakarthikeyan: తమిళ హీరో శివకార్తికేయన్‌కు తాజాగా మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన ఈ హీరో తాజాగా తన నామకరణం వీడియోను షేర్ చేశాడు. అందులో తన భార్య గురించి ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.
![Sivakarthikeyan: శివకార్తికేయన్ మూడో బిడ్డకు టాలీవుడ్ స్టార్ హీరో పేరు - ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ ఎమోషనల్ పోస్ట్ Sivakarthikeyan shares a special video of his 3rd child naming ceremony Sivakarthikeyan: శివకార్తికేయన్ మూడో బిడ్డకు టాలీవుడ్ స్టార్ హీరో పేరు - ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ ఎమోషనల్ పోస్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/207e4b4236deb8b9d2c25e38186e446b1721032987667802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sivakarthikeyan Son: చాలామంది తమిళ హీరోలకు తెలుగులో కూడా సమానమైన పాపులారిటీ, క్రేజ్ ఉంది. అలాంటి హీరోల్లో శివకార్తికేయన్ ఒకరు. ఈ హీరోకు కోలీవుడ్‌తో సమానంగా టాలీవుడ్‌లో కూడా ఫేమ్ దక్కింది. ఇక శివకార్తికేయన్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండకపోయినా అప్పుడప్పుడు తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే తనకు గత నెలలో కొడుకు పుట్టాడని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు ఈ హీరో. తాజాగా తన మూడో బిడ్డ నామకరణం సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను షేర్ చేశాడు శివకార్తికేయన్.
సన్నిహితుల సమక్షంలో..
హీరోగా తను అంతగా సక్సెస్ చూడని సమయంలోనే ఆర్తీని పెళ్లి చేసుకున్నాడు శివకార్తికేయన్. వీరిద్దరికీ ఇప్పటికే ఆరాధన అనే కూతురు, గగన్ అనే కొడుకు ఉన్నారు. ఇక ఇటీవల వీరి ఫ్యామిలీలో మరో కొత్త మనిషి యాడ్ అయ్యాడు. తన మూడో బిడ్డ జన్మించాడనే విషయం.. తన ట్విటర్ ద్వారా అనౌన్స్ చేశాడు ఈ హీరో. దీంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం కంగ్రాట్స్ తెలిపారు. తాజాగా తన మూడో బిడ్డ నామకరణ వేడుకను నిర్వహించాడు శివకార్తికేయన్. తన ఇంట్లోనే జరిగిన ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తన భార్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
రుణపడి ఉంటాను..
‘ఆర్తీ.. నువ్వు ఆపరేషన్ థియేటర్‌లో మన పిల్లలకు డెలివరీ ఇచ్చేటప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను. నువ్వు పడిన బాధ ఏంటో దగ్గరుండి చూశాను. నాకు ఇంత అందమైన ప్రపంచం ఇవ్వడం కోసం నువ్వు పడిన బాధకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. లవ్ యూ’ అంటూ తన భార్య గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు శివకార్తికేయన్. ఇక తను షేర్ చేసిన వీడియో చివర్లో ‘మీ అందరి ఆశీస్సులతో మా చిన్నోడికి మేము పేరు పెట్టుకున్నాం’ అంటూ తన మూడో బిడ్డ పేరు పవన్ అని రివీల్ చేశాడు. ‘పవన్ శివకార్తికేయన్’ అంటూ ఈ వీడియోను ముగించాడు. ఇక శివకార్తికేయన్ షేర్ చేసిన ఈ వీడియోలో తన పెద్ద కొడుకు గగన్.. తన క్యూట్‌నెస్‌తో అందరినీ ఆకర్షించాడు.
View this post on Instagram
బయోపిక్‌తో సిద్ధం..
శివకార్తికేయన్ చివరిగా ‘అయలాన్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ముందుగా తమిళంలో విడుదలయిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించి క్లీన్ హిట్‌గా నిలిచింది. తమిళంలో విడుదలయిన నెలరోజుల తర్వాత తెలుగులో కూడా విడుదలయ్యి ఇక్కడ కూడా పర్వాలేదనిపించింది. తన ప్రతీ సినిమాకు వేరియేషన్‌ను చూపించే శివకార్తికేయన్.. మేజన్ ముకుందన్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘అమరన్’తో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి సిద్దమవుతున్నాడు.
Also Read: ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేస్తున్న 'ఆడు జీవితం' - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)