Simha Re Release : థియేటర్లలోకి 'సింహా' - బాలకృష్ణ ఫ్యాన్స్‌కు బంపర్ బొనాంజా
నట సింహం నందమూరి అభిమానులకు బంపర్ బొనాంజా. ఆయన సూపర్ డూపర్ హిట్ సినిమా 'సింహా' మళ్ళీ థియేటర్లలోకి వస్తోంది. ఈ నెలలో రీ రిలీజ్ కానుంది. అది ఎప్పుడంటే?
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ను పూర్తి స్థాయిలో వాడుకున్న నవ తరం దర్శకులు ఎవరు? అంటే ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను (Boyapati Srinu). 'సింహా' (Simha Movie) సినిమా వీళ్లిద్దరి కలయికలో తొలి సినిమా. అది మళ్ళీ థియేటర్లలోకి వస్తోంది.
మార్చి 11న 'సింహా' రీ రిలీజ్
Simha Movie Re Release : మార్చి 11న థియేటర్లలో 'సింహా' సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ మధ్య సూపర్ డూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న నిర్మాత నట్టి కుమార్, బాలకృష్ణ సినిమాను కూడా థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సినిమా విడుదలకు ప్లాన్ చేశారు.
'సమర సింహా రెడ్డి', 'నరసింహ నాయుడు', లక్ష్మీ నరసింహ', 'బొబ్బిలి సింహ' - బాలకృష్ణ సినిమా పేరులో 'సింహ' ఉన్న సినిమాలు అన్నీ భారీ విజయాలు సాధించాయి. ఫ్యాక్షన్ నేపథ్యంలో వరుస సినిమాలు చేసినప్పుడు టైటిల్‌లో ఎక్కువ సింహా పేరు వచ్చేది. వరుస పరాజయాల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'సింహా' మళ్ళీ బాలకృష్ణ స్టామినా ఏంటనేది బాక్సాఫీస్ దగ్గర బలంగా చాటింది.
'సింహా'లో బాలకృష్ణకు జోడీగా నయనతార నటించారు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఆమె కనిపిస్తారు. స్నేహా ఉల్లాల్, నమిత సినిమాలో ఉన్నారు. బాలకృష్ణ, నయన్ మీద తెరకెక్కించిన 'బంగారు కొండ...' మెలోడియస్ హిట్ అయితే, 'సింహమంటి చిన్నోడే' సాంగ్ మాస్ హిట్. చక్రి సినిమాకు సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చారు. ఇంకా ఈ సినిమాలో రెహమాన్, సాయి కుమార్, కేఆర్ విజయ, ఆదిత్య మీనన్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతి రావు, వేణు మాధవ్ తదితరులు నటించారు.
ఓటీటీల్లో 'వీర సింహా రెడ్డి' రికార్డులు!
సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి'తో బాలకృష్ణ థియేటర్లలో సందడి చేశారు. ఆ సినిమా అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు భారీ వసూళ్ళు సాధించింది. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఆ సినిమా విడుదలైంది. రికార్డులు క్రియేట్ చేస్తోంది.
Also Read : ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ను అవమానించిన బాలకృష్ణ?
'వీర సింహా రెడ్డి' ఫిబ్రవరి 23న ఓటీటీలో విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వీక్షకులకు అందుబాటులో ఉంది. ఓటీటీలో సినిమా ఎలా విడుదలైందో? లేదో? అలా రికార్డులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన ఒక్క నిమిషంలోనే 150K పైగా వ్యూస్ పొందింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ స్థాయి వ్యూస్ అందుకోలేదు. ప్రస్తుతం సినిమా ట్రెండింగులో ఉంది.
ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయిక. శ్రీ లీల మెయిన్ రోల్ చేస్తున్నారు. విజయ దశమి కానుకగా థియేటర్లలో ఆ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.