Shilpa Shetty : షూతో జెండా ఆవిష్కరించిందా? - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన శిల్పాశెట్టి
నటి శిల్పాశెట్టి ఆగష్టు 15 సందర్భంగా షూ వేసుకుని జాతీయజెండా ఎగురవేయడం వివాదాస్పదం అయ్యింది. ఆమె తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, నెటిజన్ల కామెంట్స్ కు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఆగష్టు 15 సందర్భంగా పలువురు సినీ తారలు జాతీయ జెండగా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను గుర్తు చేసుకున్నారు. ఎందరో త్యాగధనుల ప్రాణత్యాగం వల్లే ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామని వెల్లడించారు. అందరి లాగే బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. శిల్పా తెలుపు రంగు కుర్తా పైజామాతో పాటు నారింజ దుపట్టా ధరించి ఉండగా, ఆమె కొడుకులను తెల్లటి కుర్తాలో కనిపించారు. శిల్పా భర్త గ్రీన్ కలర్ పైజామా వేసుకున్నారు. ఆమె తన పోస్టుకి వందేమాతరం, జైహింద్ అంటూ క్యాప్షన్ పెట్టారు.
శిల్పాశెట్టిపై నెటిజన్ల ట్రోలింగ్
శిల్పా శెట్టి జెండా ఎగురవేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు సమస్య మొదలయ్యింది. కాళ్లకు షూ ధరించి ఆమె త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తూ కనిపించడంపై నెటిజన్లు రెచ్చిపోయారు. స్టార్ హీరోయిన్ అయి ఉండి జాతీయ జెండాకు గౌరవం ఇవ్వాలని తెలియదా? అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. “మనం బూట్లతో భారత జెండాను ఎగురవేయవచ్చా?” అంటూ మరికొంత మంది కామెంట్స్ చేశారు. చాలా మంది నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన శిల్పాశెట్టి
తనపై అడ్డగోలుగా కామెంట్స్ పెడుతున్న నెటిజన్స్ కు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా‘ ఏం చెప్తుందని అనే విషయాన్ని గుర్తు చేశారు. షూతో జాతీయ జెండా ఎగురవేసినా నేరమేమీ కాదని వెల్లడించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. చెప్పులేసుకోకూడదన్న నియమం ఎక్కడా లేదని వివరించారు. ఈ మేరకు ‘ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా‘ షూ వేసుకోని ఫ్లాగ్ ఎగురవేయవచ్చని చెప్తోందంటూ ఓ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. ఈ కౌంటర్ తో ట్రోలింగ్ చేస్తున్న వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.
ఇక నటి శిల్పా శెట్టి గురించి సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులోనూ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ లో పలు హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగారు. శిల్పా శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఫిట్నెస్, ఫుడ్ సహా పలు విషయాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటారు. ఇక ప్రస్తుతం శిల్పాశెట్టి రోహిత్ శెట్టి కాప్ వెబ్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో కనిపించనుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రీమియర్ కానుంది.
View this post on Instagram
Read Also: దళితులపై ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు, కర్నాటక హైకోర్టు ఏం చెప్పిందంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial