Shatrughan Sinha: మా ఫ్యామిలీని టార్గెట్ చేయడం కొత్తేం కాదు, సోనాక్షి పెళ్లికి కొడుకు గైర్హాజరు తండ్రి షాకింగ్ కామెంట్స్
తన కూతురు సోనాక్షి సిన్హా పెళ్లికి కొడుకు లవ్ సిన్హా హాజరుకాకపోవడంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై శత్రుఘ్న సిన్హా స్పందించారు. తమ కుటుంబంపై విమర్శలు రావడం ఇదేం కొత్తకాదన్నారు.
Shatrughan Sinha On Son Skipping Sonakshi's wedding: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను రీసెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది. జూన్ 23న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ముంబైలోని బాస్టియన్‌లో గ్రాండ్ గా రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేడుకకు సోనాక్షి తల్లిదండ్రులు హాజరైనా, ఆమె సోదరుడు లవ్ సిన్హా రాలేదు. ఆయన ఈ వేడుకకు ఎందుకు రాలేదంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ముస్లీం యువకుడిని తన సోదరి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే ఆయన రాలేదని పలువురు విమర్శించారు.
మా కుటుంబపై విమర్శలు చేస్తే సహించం- శత్రుఘ్న
తాజాగా ఈ విమర్శలపై సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా స్పందించారు. తమ కుటుంబంపై అకారణంగా విమర్శలు రావడం, కొంత మంది పని గట్టుకుని టార్గెట్ చేయడం ఇదేం కొత్తకాదన్నారు. ఇంత కంటే పెద్ద విమర్శలను ఎన్నో చూశామన్నారు. సాధారణ కుటుంబం మాదిరిగా పెళ్లి చేసుకున్నా, కొంత మంది తమను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఇలాంటి పెళ్లి జరగడం ఇదే తొలిసారి కాదు. అయినా, మా కుటుంబంపై దారుణ దుష్ప్రచారం చేశారు. నా కుటుంబంపై విమర్శలు చేస్తే ఎట్టిపస్థితుల్లోనూ సహించను” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనాక్షి - జహీర్ పెళ్లికి లవ్ సిన్హా రాకపోవడం గురించి ప్రశ్నించగా... కుటుంబ విషయాలు కుటుంబంలోనే ఉంటే బాగుంటుందన్నారు. "మేము కుటుంబంలో కొన్ని విషయాలను వ్యతిరేకించుకోవచ్చు. వాదించుకోవచ్చు. కానీ, చివరికి అందరం కలుస్తాం. మేమంతా ఒకే కుటుంబం. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు” అని శత్నుఘ్న సిన్హా వెల్లడించారు. అటు తన కూతురు సోనాక్షిని ఆమె భర్త జహీర్ సంతోషంగా చూసుకుంటాడనే నమ్మకం తమకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అప్పట్లో లవ్ సిన్హా ఏమన్నారంటే?
అటు సోనాక్షి.. జహీర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె సోదరుడు లవ్ సిన్హా స్పందించారు. తన సిస్టర్ పెళ్లి గురించి తనకు ఎలాంటి విషయాలు తెలియవన్నారు. “నాకు ఈ పెళ్లి గురించి ఎలాంటి విషయాలు తెలియదు. నా కుటుంబ సభ్యులు కూడా నాకు ఏమీ చెప్పలేదు. ఈ పెళ్లి గురించి నేరుగా సోనాక్షి సిన్హాను అడగడం మంచిది. ఆమె నుంచే సరైన సమాధానం లభిస్తుంది. ఈ విషయానికి సంబంధించి నేను ఏమీ చెప్పలేను” అని వెల్లడించారు. మొదట్లో సోనాక్షి పెళ్లి శత్రుఘ్న సిన్హా దంపతులకు కూడా ఇష్టం లేదని వార్తలు వినిపించాయి. అంతేకాదు, ఈ పెళ్లికి వారు హాజరుకారని ప్రచారం జరిగింది. కానీ, శత్రుఘ్న దంపతులు ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Also Read: రాజ్ తరుణ్ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు
Read Also: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం