Shahrukh Khan: సాయిధరమ్ టైటిల్‌తో షారుక్ సినిమా - తమిళ డైరెక్టర్ అట్లీ మూవీ టైటిల్ లీక్!
షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు జవాన్ అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.
షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘జవాన్’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్‌కు సెన్సార్ పూర్తయిందని తెలిపే సర్టిఫికెట్ కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది.
ఈ సర్టిఫికెట్‌ను బట్టి జవాన్ టీజర్ నిడివి ఒక నిమిషం 34 సెకన్లుగా ఉండనుంది. యష్‌రాజ్ ఫిల్మ్స్ రూపొందించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు జవాన్ టీజర్‌ను అటాచ్ చేసే అవకాశం ఉంది.
షారుక్ ఖాన్, అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో నయనతార, ప్రియమణి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. షారుక్ ఖాన్ సూపర్ హిట్ సినిమా చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేక గీతంలో కూడా ప్రియమణి కనిపించింది. జవాన్‌లో షారుక్ డబుల్ రోల్ చేస్తున్నట్లు గతంలోనే లీకైంది.
ఈ సినిమా 2022లో రానుందో, 2023లో విడుదల కానుందో తెలియరాలేదు. ఒకవేళ 2023కు వెళ్తే... వచ్చే సంవత్సరం షారుక్ ఖాన్ మూడు సినిమాలు విడుదల కానున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ‘పఠాన్ ’ 2023 జనవరి 25వ తేదీన విడుదల కానుంది. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డుంకీ’ 2023 జనవరి 23వ తేదీన విడుదల కానుంది.
జవాన్ ఈ రెండిటి మధ్యలో విడుదల కానుందా... లేదా ఈ సంవత్సరమే విడుదల అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం 2023 జూన్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. టీజర్‌తో పాటే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది.
#Jawan Teaser - 1 mins 34 secs#ShahRukhKhan
— Manobala Vijayabalan (@ManobalaV) June 1, 2022
#SRK - #Atlee #Jawan movie teaser censor is done. #Atlee’s 5th movie with Baadhsah of Indian Cinema 💥 pic.twitter.com/a3qPBTkGeZ
— Tamil Censor (@TamilCensor) June 1, 2022
Is #Jawan the title of @Atlee_dir's debut Bollywood film with @iamsrk ?! pic.twitter.com/uGWVwSFCpa
— Troll Cinema ( TC ) (@Troll_Cinema) June 1, 2022