అన్వేషించండి

Jawan First Song: ‘జవాన్‘ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల - షారుఖ్‌తో కలిసి దుమ్ములేపిన ప్రియమణి!

షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జవాన్‘ నుంచి తొలి పాట విడుదలైంది. ‘దుమ్ము దులిపేలా‘ అంటూ సాగే ఈ పాట సినీ అభిమానులను అలరిస్తోంది. అదిరిపోయే స్టెప్పులతో కింగ్ ఖాన్ మరోసారి తన సత్తా చాటారు.

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో వస్తున్న తాజా సినిమా ‘జవాన్‌’. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్‌ 7న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. అందులో భాగంగా విడుదలైన ట్రైలర్ మూవీపై ఓ రేంజిలో అంచనాలను పెంచేసింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్లతో దుమ్మురేపింది. పలు రకాల గెటప్పుల్లో షారుఖ్ ను చూసి మూవీ లవర్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘పఠాన్‘ హిట్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో  ప్రతి విషయాన్ని ఆడియెన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. అటు మేకర్స్ సైతం బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇస్తూ మూవీపై అంచనాలు పెంచుతున్నారు.

దుమ్ము దులుపుతున్న ‘జవాన్‘ సాంగ్

తాజాగా ‘జవాన్‌’ సినిమా నుంచి మేకర్స్ ఓ పాటను విడుదల చేశారు. ‘దుమ్ము దులిపేలా’ అంటూ సాగే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ పాటను యువ సంగీత తరంగం అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరచడంతో పాటు స్వయంగా పాడారు. చంద్రబోస్ చక్కటి లిరిక్స్ అందించారు. ఈ పాట చిత్రీకరణ కోసం ఏకంగా రూ. 15 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పాటను చూస్తే నిజమే అనిపిస్తోంది. ఈ పాట కోసం ఏకంగా 1000 మంది డ్యాన్సర్లు పని చేసినట్లు తెలుస్తోంది. ఈ పాట నిజానికి  ఓ విజువల్ వండర్ గా రూపొందిందని చెప్పుకోవచ్చు. శోభి పౌల్‌ రాజ్‌ కొరియెగ్రఫీ మరో లెవల్ కు చేరింది. ఈ పాట చాలా స్టైలిష్‌గా అద్భుతంగా వీక్షకులను ఆకట్టుకుంటోంది. 

సెప్టెంబ‌ర్ 7జవాన్విడుదల

ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కు జోడీగా నయనతార నటిస్తుంది. విజయ్ సేతుపతి  విలన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.  ప్రియమణి, సాన్య మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, రిధి డోగ్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ గా  ‘జవాన్’ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న విడుదల కానుంది.  ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. SRK నటించిన ఈ చిత్రం 2023లో విడుదలైన అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా పేరు తెచ్చుకోనుందని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఈ ఏడాది జనవరిలో 'పఠాన్‌'తో ప్రపంచవ్యాప్తంగా రూ. 1050 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. భారతదేశంలో రూ. 525 కోట్ల నెట్‌తో షారుఖ్.. భారీ బ్లాక్‌బస్టర్‌ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.

Read Also: ఈ వారం కూడా చిన్న సినిమాల సందడే - థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget