Shah Rukh Khan: స్పెషల్ ఫ్యాన్స్‌ను కలిసిన షారుఖ్ ఖాన్ - సోషల్ మీడియాలో వీడియో వైరల్
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. ఫ్యాన్స్‌తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని తెలిసిన విషయమే. తాజాగా కేకేఆర్ మ్యాచ్ తర్వాత ఒక స్పెషల్ ఫ్యాన్‌ను కలిశారు ఎస్‌ఆర్‌కే.
Shah Rukh Khan Meets Specially Disabled Person: తాజాగా ఐపీఎల్ కోసం అహ్మదాబాద్‌కు వెళ్లిన షారుఖ్ ఖాన్.. అక్కడే వడదెబ్బ తగిలి ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. తాజాగా తన ఆరోగ్యం పూర్తిగా ఓకే అవ్వడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు షారుఖ్. కేకేఆర్ ఆడిన మ్యాచ్ అయిపోయే సమయానికే షారుఖ్ అస్వస్థతకు గురయ్యారు. అయినా కూడా ఆ సమయంలో తన స్పెషల్ ఫ్యాన్‌ను కలిసి తనకు హగ్ కూడా ఇచ్చారు ఈ బాలీవుడ్ బాద్‌షా. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన ఆరోగ్యం బాలేకపోయినా తన ఫ్యాన్ మాట్లాడుతున్నందుకు షారుఖ్ అక్కడే నిలబడి ఉన్నారని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
ఫ్యాన్‌తో కబుర్లు..
అహ్మదాబాద్‌లో మంగళవారం కోలకత్తా నైట్ రైడర్స్ (కేకేఆర్) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ కోసం వైట్ టీషర్ట్‌లో కూల్ లుక్స్‌తో హాజరయ్యాడు షారుఖ్ ఖాన్. అయితే ఆ మ్యాచ్ అయిపోయే సమయానికి తనకు కాస్త అస్వస్థతగా ఉందని సన్నిహితులు చెప్తున్నారు. అందుకే గ్రౌండ్ నుంచి షారుఖ్ త్వరగా వెళ్లిపోదామనుకున్నారు. కానీ వెళ్లే సమయానికి వీల్ చైర్‌లో తన ఫ్యాన్ ఒకరు షారుఖ్‌ను పలకరించారు. దీంతో వెంటనే వెళ్లిపోవడం ఇష్టం లేక ఆ ఫ్యాన్‌తో కాసేపు ముచ్చటించారు బాద్‌షా. అంతే కాకుండా తనతో ఫోటో కూడా దిగారు. ప్రస్తుతం షారుఖ్.. తన స్పెషల్ ఫ్యాన్‌ను కలిసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Despite not feeling well after yesterday's match, Shah Rukh Khan met with a specially-abled FAN and took pictures with him. The most Kind & Humble Superstar! ♥️🔥#ShahRukhKhan pic.twitter.com/j3CfoNWRRT
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) May 22, 2024
నిలకడగా ఆరోగ్యం..
ఇక షారుఖ్ ఖాన్ ఓనర్‌గా వ్యవహరిస్తున్న ఐపీఎల్ టీమ్ అయిన కేకేఆర్.. అందరినీ దాటుకుంటూ వచ్చి ఫైనల్స్‌కు చేరుకుంది. తాజాగా క్వాలిఫయర్ 1లో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఇక ఆదివారం చెన్నైలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం కేకేఆర్‌తో ఎవరు తలపడనున్నారనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అహ్మదాబాద్‌లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న కారణంగా షారుఖ్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో తన పర్సనల్ టీమ్.. తనను హాస్పిటల్‌లో కూడా జాయిన్ చేసింది. షారుఖ్ కోసం తన భార్య గౌరీ ఖాన్ కూడా అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.
స్టాండ్స్‌లో కనిపిస్తారు..
షారుఖ్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన జూహీ చావ్లా కూడా తన భర్త జై మెహ్తాతో కలిసి కేకేఆర్ మ్యాచ్‌ను చూడడానికి అహ్మదాబాద్ వెళ్లింది. దీంతో షారుఖ్ హాస్పిటల్‌లో చేరిన సమయంలో కూడా తను పక్కనే ఉంది. తనే షారుఖ్ హెల్త్ గురించి ఫ్యాన్స్‌కు అప్డేట్ చేసింది. ఈ విషయంపై మాట్లాడడానికి మీడియా ముందుకు కూడా వచ్చింది. ‘‘షారుఖ్ ఖాన్ ఆరోగ్యం గత రాత్రి బాలేదు. కానీ ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం బెటర్‌గా ఫీలవుతున్నారు. దేవుడి దయ వల్ల ఆయన త్వరగా లేచి వీకెండ్‌లో ఆయన టీమ్‌కు సపోర్ట్ చేస్తూ స్టాండ్స్‌లో కూడా కనిపిస్తారు’’ అంటూ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది జూహీ చావ్లా.
Also Read: గాయమైనా సరే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు ఐశ్వర్య రాయ్ ఎందుకెళ్లినట్లు?