అన్వేషించండి

'జవాన్' ఈవెంట్‌కు డేట్ ఫిక్స్ - బుర్జ్ ఖలీఫాపై మెరిసిన షారూఖ్ ఖాన్!

'జవాన్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి బుర్జ్ ఖలీఫాపై మెరిశారు. ఆగస్టు 31న రాత్రి అక్కడికి వస్తున్నట్లు ప్రకటించారు. 

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. మరో వారంలో థియేటర్లలోకి రాబోతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కింగ్ ఖాన్ స్వయంగా ఒక క్రేజీ అప్డేట్ తో వచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన రాబోయే ఈవెంట్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. 

''నేను మీ అందరితో కలిసి 'జవాన్‌' ను సెలబ్రేట్ చేసుకోకుండా ఉండను. నేను ఆగస్టు 31న రాత్రి 9 గంటలకు బుర్జ్ ఖలీఫాకు వస్తున్నాను. నాతో కలిసి జవాన్ వేడుకను జరుపుకోండి. ప్రేమ అనేది ప్రపంచంలోనే అత్యంత అందమైన అనుభూతి కాబట్టి, అందరూ లవ్ కలర్ ఎరుపు రంగు దుస్తులను ధరించండి.. ఏమంటారు? మీరంతా సిద్ధంగా ఉన్నారా?" అని షారుఖ్ ఖాన్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై మెరిసిన 'జవాన్' పోస్టర్ ని షేర్ చేసారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

షారుఖ్ పోస్టుని బట్టి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫాపై ఆగస్టు 31 రాత్రి 'జవాన్‌' ట్రైలర్ ను ప్రదర్శిస్తారని అభిమానులు భావిస్తున్నారు. గతంలో కింగ్ ఖాన్ పలు సందర్భాల్లో బుర్జ్ ఖలీఫాపై మెరిశాడు. గతేడాది పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో యూఏఈలోని బుర్జీల్ హోల్డింగ్స్ రూపొందించిన ప్రచార వీడియోను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ఈ క్రమంలో ఇప్పుడు 'జవాన్' ప్రమోషన్స్ కు వరల్డ్ లోని టాలెస్ట్ బిల్డింగ్ వేదిక కాబోతోంది. 

ఇప్పటికే 'జవాన్' ముఞ్చభి వచ్చిన ప్రీవ్యూ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలానే రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన 'జిందా బందా', 'చెలియా' సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా 'రామయ్యా వస్తావయ్యా' అనే మరో కొత్త ట్రాక్ ను అభిమానులతో పంచుకున్నారు. ''ఇది ‘రామయ్య వస్తావయ్యా కాదు...’ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు మరియు నా రెండు పాదాలను భరించినందుకు కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను'' అని షారుక్ ఖాన్ సాంగ్ టీజర్ ను పంచుకున్నారు. 

ఈ సంద‌ర్భంగా #AskSRK అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్‌తో ముచ్చటించిన షారూఖ్ ఖాన్.. కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లకు అంతే ఆసక్తికరంగా స‌మాధానాలు ఇచ్చారు. ‘జవాన్’ సినిమా గురించి ఒక్క పదంలో చెప్పమని అడగ్గా.. ''మ‌హిళ‌లు.. ఈ సినిమాను వాళ్ళే న‌డిపిస్తారు. ఇది మ‌హిళ‌ల గొప్ప‌తనాన్ని పురుషుల‌కు తెలియ‌జేసేలా తెర‌కెక్కిన చిత్రం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులందరికీ న‌చ్చుతుంది'' అని బదులిచ్చారు. పిల్ల‌ల దగ్గర నుంచి ముస‌లివాళ్ల వ‌ర‌కు అంద‌రూ ఈ సినిమా చూడొచ్చని, అందరినీ అలరించే కంటెంట్ ఇందులో ఉందని చెప్పారు. 

'జ‌వాన్' మూవీలో గుండుతో క‌నిపించ‌డం గురించి మాట్లాడుతూ.. ''ఈ సినిమా కోసం చాలా లుక్స్‌, చాలా షేడ్స్ చేశాను. చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఇందులో నేను గుండుతో క‌నిపించ‌టం చాలా మందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ‘ప‌ఠాన్’ సినిమాలో పొడ‌వాటి జుట్టుతో న‌టించాను. వెంట‌నే ఈ మూవీలో గుండు లుక్‌తో న‌టించాను. ఇది నా పిల్ల‌ల‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందోన‌ని ఎదురు చూస్తున్నాను.. హ హ'' అంటూ షారుక్ ఖాన్ చమత్కరించారు. ఈ సినిమాను ఎన్ని సార్లు చూడొచ్చని అడగ్గా.. ''ఓ సారి మ‌న‌సు కోసం, ఓసారి త‌నువు కోసం, ఓ సారి ఫ‌న్ కోసం, నా అభిమాని అయితే నా కోసం ఓసారి.. మొత్తంగా ఓ నాలుగు సార్లు చూడండి'' అని సమాధానమిచ్చారు. 

కాగా, 'జవాన్' చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. ఇందులో షారూఖ్ ఖాన్ తో పాటుగా నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. దీపికా పడుకునే ప్రత్యేక పాత్ర పోషించగా.. సన్యా మల్హోత్రా, ప్రియమణి, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా, సునీల్ గ్రోవర్‌ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై గౌరీ ఖాన్ నిర్మించిన ఈ చిత్రానికి గౌరవ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 7న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget