అన్వేషించండి

Vijay Antony: షూటింగ్‌కు తీసుకొస్తా అన్నారు, ఇంతలో ఆమె అలా.. విజయ్ ఆంటోనీ కూతురి మరణంపై నటి సుధా వ్యాఖ్యలు

విజయ్ ఆంటోనీ కూతురి మరణంపై ఒక్కసారిగా సినీ రంగం అంతా చర్చించడం మొదలుపెట్టింది. సీనియర్ నటి సుధా కూడా ఈ విషయం గురించి తనకు తెలిసిన నిజాలు బయటపెట్టారు.

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ కూతురు మరణం యావత్ సినీ రంగాన్ని విషాదంలో ముంచేసిన సంగతి తెలిసింది. అంత చిన్న వయస్సులో ఆమె ఆత్మహత్య చేసుకోవడం అందరి మనసులను కలిచి వేస్తుంది. కోలీవుడ్‌లు జెంటిల్‌మ్యాన్‌గా పేరొందిన విజయ్ ఆంటోనీ ఇంట్లో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనపై సీనియర్ నటి సుధా మీడియాతో మాట్లాడారు.

12 రోజుల పాటు షూట్‌లో ఉత్సాహంగా..
సీనియర్ నటి సుధా.. ఎన్నో ఏళ్లుగా తెలుగు మాత్రమే కాదు.. తమిళ సినీ పరిశ్రమలో కూడా తల్లి పాత్రలు చేస్తూ ఫేమ్ సంపాదించుకున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోలకు, హీరోయిన్లకు ఆమె తల్లిగా నటించారు. తల్లి పాత్రలో సుధా ఒదిగిపోతారు అని ఇప్పటికే ఎంతోమంది ఆమెను ప్రశంసించారు. అలాంటి నటి.. తన అప్‌కమింగ్ సినిమాలో విజయ్ ఆంటోనీకి తల్లిగా నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో విజయ్ ఆంటోనీ ఎంత ఉత్సాహంగా ఉండేవారో గుర్తుచేసుకున్నారు. 12 రోజుల పాటు విజయ్ ఆంటోనీతో కంటిన్యూగా పని చేశానని, ఆ సమయంలో ఆయన చాలా సరదాగా మాట్లాడేవాడని, ఆ సినిమాకు ఎలా ప్రమోషన్స్ చేయాలో కూడా విజయ్ ఆంటోనీ ప్లాన్ చేసేవాడని అన్నారు.

ఎమోషనల్ అయిన సుధా..
విజయ్ ఆంటోనీ.. తన సినిమా షూటింగ్స్‌కు ఫ్యామిలీని తీసుకొస్తారా అని ప్రశ్నించగా.. ఎప్పుడూ తీసుకురాలేదని సుధా సమాధానమిచ్చారు. తీసుకురమ్మని అందరూ చెప్తుండేవారని అన్నారు. త్వరలోనే తన ఫ్యామిలీని విజయ్ ఆంటోనీ షూటింగ్‌కు తీసుకొస్తానని మాటిచ్చారని, ఇంతలోనే ఇలా జరిగింది అంటూ సుధా ఎమోషనల్ అయ్యారు. విజయ్ ఆంటోనీ చాలా కష్టపడి పైకి వచ్చాడని, ఎన్నో కష్టాలు చూశాడని, అలాంటి మనిషి ఈ బాధను ఎలా తట్టుకోగలడో అర్థం కావడం లేదని వాపోయారు. విజయ్ ఆంటోనీకి చిన్న వయసులోనే నాన్న చనిపోయినా.. తన భార్యే తనకు బలంగా నిలబడిందని సుధా తెలిపారు.

కారణం తెలియదు..
విజయ్ ఆంటోనీ కూతురు మృతి తర్వాత తన తల్లిని కలిసినట్టుగా సుధా తెలిపారు. అసలు ఎందుకిలా జరిగిందని తనను కనుక్కున్నానని చెప్పారు. ‘‘ఆ అమ్మాయికి చీకటి అంటే భయమంట, ఒంటరిగా ఎక్కడికీ వెళ్లేది కాదంట’’ అని సుధా అన్నారు. అలాంటి అమ్మాయికి ఇలాంటి ఎలా వచ్చిందో అని ఆందోళనపడ్డారు. అసలు ఆత్మహత్యకు కారణమేంటి అని సుధాని ప్రశ్నించగా. కారణం ఏంటో తనకు తెలియదన్నారు. కానీ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుందని, డిప్రెషన్‌లో ఉందని మాత్రం కుటుంబ సభ్యులు చెప్పారని బయటపెట్టారు. డిప్రెషన్‌లో ఉంది కాబట్టి ఒక్క క్షణంలో అలా చేసుకోవడానికి నిర్ణయం తీసుకుందని సుధా బాధపడ్డారు. యూత్‌ ఎవరూ ఇలా చేయకూడదని, ఇది తల్లిదండ్రులకు ఎంతో బాధనిస్తుందని కోరారు సుధా. ఎవరికైనా బాధ అనిపిస్తే తల్లిదండ్రులతో షేర్ చేసుకోమని సలహా ఇచ్చారు. తల్లిదండ్రులకంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరని అన్నారు. 

Also Read: చైతూతో మరోసారి - ఆ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Golbal Star Ram Charan : అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
Embed widget