అన్వేషించండి

Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్

‘సప్తా సాగరదాచే ఎల్లో సైడ్ ఏ’ మూవీ కన్నడతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వగా.. దీని సీక్వెల్‌ను ఒకేసారి కన్నడతో పాటు తెలుగులో కూడా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించి విడుదల తేదీని అనౌన్స్ చేశారు.

క సినిమా బాగుందని టాక్ వస్తే చాలు.. అది ఏ భాష అని పట్టించుకోకుండా మూవీ లవర్స్ అంతా దానికి బ్రహ్మరథం పడతారు అన్నది తెలిసిన విషయమే. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో భాషల ప్రేక్షకుల్లో తెలుగు ప్రేక్షకులకు సినిమాల పచ్చి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఇతర ఏ భాషలో అయినా మూవీ విడుదలయ్యి.. దానికి హిట్ టాక్ వచ్చిందంటే చాలు.. దానిని తెలుగులో కూడా డబ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు మేకర్స్. ఇటీవల అలా విడులదయిన డబ్బింగ్ చిత్రాల్లో సెన్సేషనల్ హిట్ అందుకున్న సినిమా ‘సప్తా సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’. ఈ మూవీ ముందుగా కన్నడలో విడులదయ్యి ఆ తర్వాత తెలుగులో డబ్ అయ్యి.. ఇక్కడ కూడా హిట్ సాధించడంతో.. దీని సీక్వెల్ విషయంలో మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చారు.

రక్షిత్ శెట్టి ఎప్పటినుండో శాండిల్‌వుడ్‌లో యూత్‌కు నచ్చే సినిమాలు చేస్తూ విపరీతంగా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు కూడా రక్షిత్ సుపరిచితుడే. కానీ కొన్నాళ్ల క్రితం రక్షిత్ నటించిన ‘ఛార్లీ’ సినిమా.. తెలుగులో కూడా విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. దీంతో అప్పటినుండి తన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూడడం మొదలుపెట్టారు. అలా తన తరువాతి మూవీ ‘సప్తా సాగరదాచే ఎల్లో సైడ్ ఏ’ కూడా కన్నడ హిట్ అని టాక్ రావడంతో దీనిని తెలుగులో ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఈ మూవీ క్రియేట్ చేసిన హైప్ చూసి.. మేకర్స్ కూడా తెలుగులో డబ్ చేయడానికి ముందుకొచ్చారు. అలా కన్నడతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేసిన రక్షిత్

‘సప్తా సాగరదాచే ఎల్లో సైడ్ ఏ’ సినిమా.. తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ టైటిల్‌తో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి సీక్వెల్ ఉందని టైటిల్‌లోనే స్పష్టం చేసింది టీమ్. మొదటి పార్ట్ హిట్ అవ్వడంతో సీక్వెల్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అటు కన్నడ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. పార్ట్ 1లాగా పార్ట్ 2 కూడా ముందు కన్నడలో విడుదలయ్యి ఆ తర్వాత కొంతకాలానికి తెలుగు విడుదల అవుతుందని టాక్ వినిపించింది. దీనికి రక్షిత్ శెట్టి.. ఒక పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చాడు. ‘సప్తా సాగరదాచే ఎల్లో సైడ్ బీ’ రిలీజ్ డేట్ ఎప్పుడో రక్షిత్ కన్ఫర్మ్ చేశాడు.

ఇద్దరు హీరోయిన్స్

హేమంత్ ఎమ్ రావు తెరకెక్కించిన ‘సప్తా సాగరదాచే ఎల్లో సైడ్ బీ’ మూవీ 2023 అక్టోబర్ 20న కన్నడలో, అక్టోబర్ 27న తెలుగులో విడుదల కానుందని ఇండస్ట్రీలో రూమర్స్ చక్కర్లు కొట్టాయి. దీంతో తెలుగు, కన్నడ వర్షన్స్ రెండూ అక్టోబర్ 27నే విడుదల అవుతాయని రక్షిత్ శెట్టి క్లారిటీ ఇచ్చాడు. పార్ట్ 1లో కేవలం రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా.. పార్ట్ 2లో చైత్ర జే ఆచార్ కూడా హీరోయిన్‌గా కనిపించనుంది. పరమ్వాహ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ రాజ్ అందించిన సంగీతం.. ‘సప్తా సాగరదాచే ఎల్లో’ చిత్రానికి ప్రాణంగా నిలిచింది. ఎంతోమంది ఈ సినిమాలోని పాటలకు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు ఫిదా అయిపోతున్నారు.

Also Read: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget